Mouni Roy | మొన్ననే విడాకులు – అప్పుడే కొత్త ప్రియుడితో షికార్లు – హాట్ బ్యూటీ మౌనీరాయ్‌ని ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు
భర్త సూరజ్ నంబియార్ నుంచి విడాకులు తీసుకొని రెండు నెలలు కూడా కాకముందే బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీరాయ్ మళ్లీ ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. నాగిన్ సీరియల్‌లో మౌనీరాయ్‌తో కలిసి నటించిన అర్జున్ బిజ్లానీతో మౌనీరాయ్ డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నారు. వీరిద్దరు కలిసి రెస్టారెంట్స్, పార్టీలకు వెళ్లిన ఫొటోలు వైరల్ అవుతోన్నాయి. ఈ డేటింగ్ రూమర్లపై అర్జున్ రియాక్ట్ అయ్యాడు.
Entertainment | Published On Jul 17, 2026, 3.31 pm IST
Mouni Roy | భర్త సూరజ్ నంబియార్ నుంచి ఇటీవలే విడాకులు తీసుకుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీరాయ్. నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికింది. విడాకులు తీసుకొని రెండు నెలలు కూడా కాకముందే మౌనీరాయ్ మళ్లీ ప్రేమలో పడినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నారు. ప్రముఖ టీవీ నటుడు అర్జున్ బిజ్లానీతో మౌనీరాయ్ డేటింగ్ చేస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మౌనీరాయ్, అర్జున్ కలిసి రెస్టారెంట్లు, పార్టీలకు వెళ్లిన కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో అర్జున్‌తో మౌనీరాయ్ చాలా క్లోజ్‌గా కనిపించింది. వారిద్దరి బాండింగ్ చూసిన చాలా మంది ఈ జంట డేటింగ్ లో ఉన్నది నిజమేనంటూ కామెంట్లు పెడుతోన్నారు.
భర్తతో విడిపోయిన కొద్ది రోజులకే అర్జున్‌తో మౌనీరాయ్ చట్టపట్టాలేసుకొని తిరగడంపై విమర్శలు వస్తోన్నాయి. ఈ బాలీవుడ్ బ్యూటీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
నాగిన్‌లో కలిసి...
మౌనీరాయ్‌తో అర్జున్ స్నేహం ఈనాటిది కాదు. వీరిద్దరు కలిసి నాగిన్ సీరియల్‌లో లీడ్ రోల్స్‌లో కనిపించారు. రితిక్, శివన్య పాత్రల్లో తమ కెమిస్ట్రీతో బుల్లితెర అభిమానులను ఆకట్టుకున్నారు. బెస్ట్ టీవీ సీరియల్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. పదిహేనేళ్ల లాంగ్ ఫ్రెండ్‌షిప్ ఇటీవలే ప్రేమగా మారిందని అంటున్నారు.
నిజానిజాలు....
మౌనీరాయ్‌తో డేటింగ్ రూమర్లపై అర్జున్ బిజ్లానీ రియాక్ట్ అన్నారు. మౌనీరాయ్‌తో తనకు ఉన్నది స్నేహం మాత్రమేనని, వ్యూస్ కోసం ఆ ఫ్రెండ్‌షిప్‌ను ప్రేమగా మార్చొద్దని అన్నారు. "కష్టకాలంలో ఉన్న ఓ స్నేహితురాలికి అండగా నిలవడం నా బాధ్యతగా భావించా. నిజానిజాలు తెలుసుకోకుండా మా బంధం గురించి ఏది పడితే అది రాయద్దు. మేము పదిహేనేళ్లుగా స్నేహితులుగానే కొనసాగుతున్నాం. ఇకపై కూడా అలాగే ఉంటాం" అని అర్జున్ బిజ్లానీ అన్నారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అతడి పోస్ట్ వైరల్ అవుతోంది.
చిరంజీవి విశ్వంభరలో...
సీరియల్ యాక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన మౌనీరాయ్ ఆ తర్వాత సినిమాలో బిజీ అయ్యింది. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో స్పెషల్ సాంగ్స్‌తో పాటు గ్లామర్ రోల్స్ చేస్తోంది. చిరంజీవి విశ్వంభరతో మౌనీరాయ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐటెంసాంగ్‌లో కనిపించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●US Tariffs | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. మద్దతు తెలిపిన యూఎస్ సెనేటర్లు
- ●Samvidhan Bachao | విద్యా వ్యవస్థలో అవకతవకలు.. జులై 20న 12 గంటల శాంతియుత నిరాహార దీక్ష చేపట్టండి
- ●MLA Sudheer Reddy | జూన్ 30న అప్లికేషన్ పెట్టినం.. జూలై 18 వస్తున్నా పర్మిషన్ ఇవ్వలే
- ●Karnataka High court | ప్రేమ వివాహంలో కట్నం కోసం వేధింపులా? నమ్మశక్యంగా లేదు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు బెయిల్
- ●Telugu OTT | ఒకే రోజు రెండు ఓటీటీలలో రిలీజైన తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ మూవీ
- ●Apple Back to School 2026 | యాపిల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్.. మాక్ కొంటే ఉచిత ఎయిర్‌పాడ్స్..

US Tariffs | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. మద్దతు తెలిపిన యూఎస్ సెనేటర్లు

Samvidhan Bachao | విద్యా వ్యవస్థలో అవకతవకలు.. జులై 20న 12 గంటల శాంతియుత నిరాహార దీక్ష చేపట్టండి

MLA Sudheer Reddy | జూన్ 30న అప్లికేషన్ పెట్టినం.. జూలై 18 వస్తున్నా పర్మిషన్ ఇవ్వలే

Karnataka High court | ప్రేమ వివాహంలో కట్నం కోసం వేధింపులా? నమ్మశక్యంగా లేదు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు బెయిల్






