Donald Trump | ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌కు ట్రంప్.. విజేతకు ట్రోఫీ అందించనున్న యూఎస్ ప్రెసిడెంట్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగే ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌కు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ సైతం ధ్రువీకరించింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిట్ మీడియాతో మాట్లాడుతూ ఫిఫా ముగింపు వేడుకలకు హాజరుకావాలని ట్రంప్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగే ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌కు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ సైతం ధ్రువీకరించింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిట్ మీడియాతో మాట్లాడుతూ ఫిఫా ముగింపు వేడుకలకు హాజరుకావాలని ట్రంప్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరుకానున్నారు. అమెరికా చరిత్రలో అత్యధిక వీక్షకులను ఆకట్టుకున్న, అత్యంత భద్రతతో నిర్వహించిన, అత్యంత విజయవంతమైన ఫిఫా వరల్డ్‌కప్‌గా ఈ టోర్నీ నిలిచింది. అలాంటి టోర్నీకి అధ్యక్షుడు హాజరుకావడం మరింత ప్రత్యేకతను తీసుకువస్తుంది’ అని లీవిట్ పేర్కొన్నారు. ఫైనల్లో ట్రంప్ అర్జెంటీనాకు మద్దతు ఇస్తారా? స్పెయిన్‌కు మద్దతు పలుకుతారా? అనే ప్రశ్నకు ఆమె ఆసక్తికరంగా స్పందించారు. ‘ఆ ప్రశ్నను నేరుగా అధ్యక్షుడినే అడగండి. ఆయన తప్పకుండా సరదాగా సమాధానం చెబుతారు’ అంటూ వ్యాఖ్యానించారు. ఫైనల్‌కు ముందు శుక్రవారం న్యూయార్క్ నగరంలోని ట్రంప్ టవర్‌లో జరిగే ఫిఫా ప్రత్యేక ఆతిథ్య కార్యక్రమానికి కూడా ట్రంప్ హాజరవుతారని వైట్‌హౌస్ వెల్లడించింది.
విజేతలకు ట్రోఫీ అందజేయనున్న ట్రంప్
ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ఇప్పటికే కీలక విషయాన్ని వెల్లడించారు. ఆదివారం జరిగే ఫైనల్ అనంతరం విజేత జట్టు కెప్టెన్‌కు ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని తాను, ట్రంప్ కలిసి అందజేస్తామని చెప్పారు. ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ కార్యక్రమంలో మాట్లాడిన ఇన్ఫాంటినో ‘మేమిద్దరం కలిసి ఫైనల్‌ను వీక్షిస్తాం. అనంతరం విజేత జట్టుకు ట్రోఫీని సంయుక్తంగా అందజేస్తాం’ అని పేర్కొన్నారు. ఇటీవల ఫిఫా వరల్డ్‌కప్‌లలో (రష్యా-2018, ఖతార్-2022) ఫిఫా అధ్యక్షుడే స్వయంగా ట్రోఫీని విజేత కెప్టెన్‌కు అందజేశారు. అంతకుముందు కూడా ఇదే సంప్రదాయం కొనసాగింది. అయితే, ఈసారి అమెరికా అధ్యక్షుడు కూడా ట్రోఫీ ప్రదానోత్సవంలో పాల్గొనడం ప్రత్యేకత సంతరించుకుంది. అయితే గతంలో కొన్ని సందర్భాల్లో దేశాధినేతలు కూడా ప్రపంచకప్ ట్రోఫీని అందజేశారు. 1966లో ఇంగ్లండ్ ప్రపంచకప్ గెలిచినప్పుడు బ్రిటన్ రాణి ఎలిజబెత్-II జూల్స్ రిమెట్ ట్రోఫీని కెప్టెన్ బాబీ మూర్‌కు అందించారు. 1982 ప్రపంచకప్ అనంతరం స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్, ఇటలీ కెప్టెన్ డినో జాఫ్‌కు ట్రోఫీని అందజేశారు.
గత ఏడాది క్లబ్ వరల్డ్‌కప్ ఫైనల్‌లోనూ ట్రంప్ సందడి
న్యూజెర్సీలో గత ఏడాది జరిగిన ఫిఫా క్లబ్ వరల్డ్‌కప్ ఫైనల్‌కు కూడా ట్రంప్ హాజరయ్యారు. ఆ మ్యాచ్‌లో పారిస్ సెయింట్ జర్మైన్‌పై చెల్సీ విజయం సాధించగా.. ట్రోఫీని చెల్సీ కెప్టెన్ రీస్ జేమ్స్‌కు ట్రంప్ అందజేశారు. అయితే, ఆటగాళ్లు ట్రోఫీని ఎత్తి సంబరాలు చేసుకునే సమయంలో కూడా ఆయన వేదికపైనే ఉండడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా అతిథులు వేదికను వీడిన తర్వాతే ట్రోఫీ లిఫ్ట్ జరుగుతుండగా.. ట్రంప్ ఆటగాళ్లతో కలిసి వేదికపై నిలవడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rohit Sharma | లార్డ్స్ వన్డే రోహిత్‌కు చివరిదేనా?.. జైస్వాల్‌కు ఛాన్స్ ఇవ్వాలన్న యోచనలో సెలెక్టర్లు..!
- ●Covid-19 | మళ్లీ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. నెల రోజుల్లో 13 మందికి పాజిటివ్.. నలుగురు మృతి
- ●Hydrogen Train | నేడు దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- ●Vaakiti Srihari | మంత్రి వాకిటి శ్రీహరికి తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
- ●NEET UG Results | నీట్ యూజీ ఫలితాలు విడుదల.. హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు
- ●Horoscope | జూలై 17 రాశి ఫలాలు.. ఈ రాశివారికి అడ్డంకులు ఉండవచ్చు!

Rohit Sharma | లార్డ్స్ వన్డే రోహిత్‌కు చివరిదేనా?.. జైస్వాల్‌కు ఛాన్స్ ఇవ్వాలన్న యోచనలో సెలెక్టర్లు..!

Covid-19 | మళ్లీ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. నెల రోజుల్లో 13 మందికి పాజిటివ్.. నలుగురు మృతి

Hydrogen Train | నేడు దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Vaakiti Srihari | మంత్రి వాకిటి శ్రీహరికి తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స






