MLA Rakesh Reddy | విద్యార్థినులారా.. నేన్ చెప్తున్నా.. షోరూమ్‌ల నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లండి
MLA Rakesh Reddy | అధికారంలోకి వస్తే కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని.. అందుకే కాంగ్రెస్ నేతల షోరూమ్‌లలో నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ గడ్డపై పుట్టిన అగ్గిని రాష్ట్రమంతటా రాజేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
- రేవంత్.. అహంకారం తలకెక్కిందా?
- ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేదాకా ఇడిసిపెట్టం
- అవసరమైతే చలో కొండారెడ్డిపల్లి, కొడంగల్‌కు పిలుపునిస్తం
- ఇందూర్ రణభేరి సభలో ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLA Rakesh Reddy | త్రినేత్ర.న్యూస్: అధికారంలోకి వస్తే కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని.. అందుకే కాంగ్రెస్ నేతల షోరూమ్‌లలో నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లాలని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే వరకు వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నిజామాబాద్ గడ్డపై పుట్టిన అగ్గిని రాష్ట్రమంతటా రాజేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే చలో కొండారెడ్డి పల్లి, కొడంగల్‌కు పిలుపునిస్తామని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఫైల్ పైనే తొలి సంతకం ఉంటుందని పేర్కొన్నారు. గురువారం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం ఏర్పాటు చేసిన ఇందూర్ రణభేరి సభలో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

విద్యార్థులపై కుట్రలు చేస్తున్న కాంగ్రెస్‍ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అధికారంలోకి వస్తే కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. విద్యార్థినులకు ఇచ్చిన మాట తప్పారు. ఉచితంగా స్కూటీలు ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. అందుకే ఇప్పుడు నేను చెబుతున్నా.. కాంగ్రెస్ నేతలకు చెందిన షో రూమ్‍లలో స్కూటీలు ఎత్తుకెళ్లండి అని రాకేశ్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఫైల్ పైనే బీజేపీ సీఎం తొలి సంతకం పెడతారు. విద్యార్థుల భవిష్యత్‍కు ఎలాంటి ఢోకా ఉండదు. వారికి బీజేపీ అండగా ఉంటుంది. ఉద్యోగాలు ఇవ్వమని నిరుద్యోగులు నిలదీస్తుంటే వారిని ఎండ్రిన్ తాగమంటారా? బావిలో దూకమని అంటారా? ఈ బిడ్డలను మీరు కన్నారా? పెంచారా? అని సూటి ప్రశ్నలు సంధించారు.

రేవంత్ రెడ్డి తన మనువడి కోసం 20 వేల కోట్లు పెట్టి ఫుట్ బాల్ స్టేడియం కట్టారు. మరి పేదల తాతలు, తండ్రులు ఏం కావాలి? పేదలు చదవద్దని కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. వ్యవసాయానికి నీళ్లు అడిగితే రక్తం పారిస్తామని మాట్లాడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నేతల రక్తం, కొవ్వు కరిగించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై బీజేపీ వెనక్కి తగ్గదు. పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి.. అహంకారం తలకెక్కిందా అని ఫైరయ్యారు.
తాజావార్తలు
- ●CBDT | విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..
- ●FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ తొలిసారి విజేతలకు చాంపియన్‌షిప్ రింగ్స్..! అభిమానులకు కూడా..!
- ●TECNO CAMON 50 Ultra 5G | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నికతో వచ్చిన టెక్నో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
- ●Sun Holidays | సూర్యుడికి 9 రోజులు సెలవులు.. ఎప్పుడో తెలుసా..?
- ●Mouni Roy | మొన్ననే విడాకులు - అప్పుడే కొత్త ప్రియుడితో షికార్లు - హాట్ బ్యూటీ మౌనీరాయ్‌ని ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు
- ●US Tariffs | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. మద్దతు తెలిపిన యూఎస్ సెనేటర్లు

CBDT | విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..

FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ తొలిసారి విజేతలకు చాంపియన్‌షిప్ రింగ్స్..! అభిమానులకు కూడా..!

TECNO CAMON 50 Ultra 5G | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నికతో వచ్చిన టెక్నో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..

Sun Holidays | సూర్యుడికి 9 రోజులు సెలవులు.. ఎప్పుడో తెలుసా..?





