FIFA 2026 | ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో జపాన్ మ్యాజిక్
FIFA 2026 | ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచులు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఓ మ్యాచ్‌లో చివరి నిమిషంలో ఓ జట్టు అద్భుతంగా పునరాగమనం చేయగా.. మరో మ్యాచ్‌లో ఒక్క గోల్ విజేతను నిర్ణయించింది. మరో వైపు స్వీడన్ మాత్రం ప్రత్యర్థిపై గోల్స్ వర్షం కురిపిస్తూ టోర్నీలో శుభారంభం చేసింది. డల్లాస్‌లో జరిగిన గ్రూప్-ఎఫ్ పోరులో జపాన్ చివరి క్షణాల్లో గోల్ సాధించి నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకుంది. ఇక ఐవరీ కోస్ట్ 1-0తో ఈక్వెడార్‌ను ఓడించి నాకౌట్ అవకాశాలను మరింత పదిలం చేసుకుంది. స్వీడన్-ట్యునీషియా మధ్య మాంటెరేలో జరిగిన పోరు ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్‌లో స్వీడన్ 5-1 తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది.
- నెదర్లాండ్స్‌తో మ్యాచ్ 2-2తో సమం
- ఈక్వెడార్‌కు షాక్ ఇచ్చిన ఐవరీ కోస్ట్
- ట్యునీషియాపై స్వీడన్ గోల్స్ వర్షం..
- 5-1 తేడాతో భారీ విజయం
FIFA 2026 | ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచులు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఓ మ్యాచ్‌లో చివరి నిమిషంలో ఓ జట్టు అద్భుతంగా పునరాగమనం చేయగా.. మరో మ్యాచ్‌లో ఒక్క గోల్ విజేతను నిర్ణయించింది. మరో వైపు స్వీడన్ మాత్రం ప్రత్యర్థిపై గోల్స్ వర్షం కురిపిస్తూ టోర్నీలో శుభారంభం చేసింది. డల్లాస్‌లో జరిగిన గ్రూప్-ఎఫ్ పోరులో జపాన్ చివరి క్షణాల్లో గోల్ సాధించి నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకుంది. ఇక ఐవరీ కోస్ట్ 1-0తో ఈక్వెడార్‌ను ఓడించి నాకౌట్ అవకాశాలను మరింత పదిలం చేసుకుంది. స్వీడన్-ట్యునీషియా మధ్య మాంటెరేలో జరిగిన పోరు ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్‌లో స్వీడన్ 5-1 తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది.
చివరి నిమిషంలో జపాన్ పునరాగమనం..

డల్లాస్ స్టేడియంలో జరిగిన నెదర్లాండ్స్-జపాన్ మ్యాచ్ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఉత్కంఠభరిత పోరాటాల్లో ఒకటిగా నిలిచింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు జాగ్రత్తగా ఆడాయి. దాంతో ఒక్క గోల్ కూడా పడలేదు. రెండో అర్ధభాగం మొదలైన కొద్దిసేపటికే నెదర్లాండ్స్ కెప్టెన్ వర్జిల్ వాన్‌డైక్ 50వ నిమిషంలో అద్భుత హెడ్డర్‌తో జట్టును ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు. కొద్దిసేపటికే జపాన్ సైతం గోల్ వేసింది. 57వ నిమిషంలో కైటో నకమురా ఖచ్చితమైన షాట్‌తో స్కోర్‌ను 1-1తో సమం చేశాడు. 64వ నిమిషంలో క్రెసెన్సియో సమ్మర్‌విల్ అద్భుత కర్లింగ్ షాట్‌తో నెదర్లాండ్స్‌కు మళ్లీ ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మ్యాచ్ ముగిసే వరకు ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటారని అందరూ భావించినా.. మరోసారి జపాన్ తన సత్తాను చాటింది. 89వ నిమిషంలో కోకి ఒగావా హెడ్డర్‌ను డైచి కమాడా గోల్‌గా మలిచి జట్టుకు సమం చేసే గోల్ అందించాడు. దీంతో మ్యాచ్ 2-2తో ముగిసింది. ఒత్తిడి పరిస్థితుల్లోనూ తిరిగి తిరిగి పట్టు సాధించే సామర్థ్యం తమకు ఉందని జపాన్ మరోసారి నిరూపించుకుంది. నెదర్లాండ్స్ కెప్టెన్ వర్జిల్ వాన్‌డైక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
ఐవరీ కోస్ట్ విజయం..

గ్రూప్-ఈలో ఐవరీ కోస్ట్-ఈక్వెడార్ మధ్య పోరు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. నువ్వానేనా అన్నట్లుగా రెండు జట్లు తలపడ్డాయి. రెండు జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఎక్కువసేపు స్కోరు నమోదు కాలేదు. ఈక్వెడార్ పలుసార్లు ప్రత్యర్థి పోస్ట్ వరకు దూసుకొచ్చినప్పటికీ.. ఐవరీ కోస్ట్ గోల్ పడకుండా సమర్థవంతంగా అడ్డుకుంది. అయితే, మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనుకున్న సమయంలో అమాద్ డియాలో కీలక గోల్ సాధించి జట్టును 1-0 ఆధిక్యంలో నిలిపాడు. అయితే, ఇదే గోల్ మ్యాచ్ ఫలితాన్ని మార్చింది. ఈ విజయంతో ఐవరీ కోస్ట్ మూడు కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుని గ్రూప్‌లో తన అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఈ నెల జూన్ 21న జర్మనీతో జరగనున్న మ్యాచ్ గ్రూప్‌లో అగ్రస్థానాన్ని నిర్ణయించే కీలక మ్యాచ్ జరుగనున్నది. ఇదిలా ఉండగా.. గత 19 మ్యాచుల్లో ఒక్క ఓటమి లేకుండా విజయాలతో దూసుకువెళ్తున్న ఈక్వెడార్.. ఐవరీకోస్ట్‌తో మ్యాచ్‌లో మాత్రం ఓటమిపాలైంది. మూడు పాయింట్లతో మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ ప్రపంచకప్‌లో బోణీ చేయగా.. ఈక్వాడార్ మాత్రం ఇంకా ఖాతా తెరవలేదు.
స్వీడన్ గోల్స్ వర్షం..

మాంటెరే వేదికగా జరిగిన గ్రూప్-ఎఫ్ మ్యాచ్‌లో స్వీడన్ ప్రత్యర్థి ట్యునీషియాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. టోర్నీలో తమ తొలి మ్యాచ్ ఆడిన స్వీడిష్ జట్టు మొదటి నుంచే దూకుడు ప్రదర్శించి 5-1 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ప్రారంభమైన ఏడో నిమిషానికే యాసిన్ అయారి గోల్ సాధించి స్వీడన్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ గోల్‌తో స్వీడన్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. మధ్యమైదానంపై పట్టు సాధించిన స్వీడన్ దూకుడగా ఆడుతూ ట్యునీషియాను ఇబ్బంది పెట్టింది. ఈ క్రమంలో స్టార్ ఫార్వర్డ్ అలెగ్జాండర్ ఇసాక్ మరో గోల్ జోడించి ఆధిక్యాన్ని పెంచాడు. అనంతరం విక్టర్ గ్యోకెరెస్, మతియాస్ స్వాన్‌బెర్గ్ కూడా గోల్స్ చేయడంతో మ్యాచ్ పూర్తిగా స్వీడన్ చేతుల్లోకి వెళ్లింది. ట్యునీషియా తరఫున ఒమర్ రెకిక్ 43వ నిమిషంలో గోల్ సాధించి జట్టుకు కొంత ఊరటనిచ్చాడు. అయితే, ఆ గోల్ తప్ప మ్యాచ్‌లో ట్యునీషియా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆసక్తికరంగా బంతిపై నియంత్రణ విషయంలో ట్యునీషియా 51 శాతం పొజెషన్ సాధించింది. కానీ, ఆ ఆధిక్యాన్ని గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. మరోవైపు స్వీడన్ అవకాశాలను సమర్థంగా వినియోగించుకుంది. మొత్తం 13 ప్రయత్నాలు చేసిన స్వీడన్, అందులో ఎనిమిదిని టార్గెట్ వైపు పంపి ప్రత్యర్థిపై తీవ్ర ఒత్తిడి పెంచింది. ఇక అదనపు సమయంలో (90+6వ నిమిషం) యాసిన్ అయారి తన రెండో గోల్‌ను నమోదు చేసి జట్టుకు 5-1 భారీ విజయాన్ని ఖాయం చేశాడు. రెండు గోల్స్‌తో మెరిసిన అయారి స్వీడన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఘన విజయంతో స్వీడన్ గ్రూప్-ఎఫ్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Justin Trudeau | బాయ్‌ఫ్రెండ్‌గా ఆ మాత్రం బాధ్యతలు తప్పవు.. విమర్శకుల నోళ్లు మూయించిన జస్టిన్ ట్రూడో!
జూన్ 14, 2026

FIFA World Cup | ఫుట్‌బాల్ మహాసమరంలో రసవత్తర పోరు..!
జూన్ 14, 2026

Gitika Talukdar | ప్రతిష్ఠాత్మక ఫీఫా వరల్డ్ కప్‌లో అస్సాం అమ్మాయి.. ఏకైక భారతీయ మహిళా ఫోటో జర్నలిస్ట్‌గా చరిత్ర!
జూన్ 14, 2026
తాజావార్తలు
- ●Heavy Rains | ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశం
- ●NSE | ఎన్ఎస్ఈ ఐసీవోకు గ్రీన్ సిగ్నల్.. 10 ఏళ్ల నిరీక్షణకు తెర.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..
- ●Rani Rudrama Reddy | రాంచందర్‌రావుకు హిట్లర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : రాణీ రుద్రమారెడ్డి
- ●Revanth Reddy | ఎన్వోసీ ఇవ్వండి.. మెట్రో ఫేజ్-2 కట్టుకుంటాం
- ●PM Modi | సమగ్ర భాగస్వామ్య స్థాయికి భారత్-స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాలు : ప్రధాని మోదీ
- ●ITR | ఐటీఆర్ గడువు దాటితే.. ఫైలింగ్ చేయలేమా.. ఏం జరుగుతుంది..?

Heavy Rains | ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశం

NSE | ఎన్ఎస్ఈ ఐసీవోకు గ్రీన్ సిగ్నల్.. 10 ఏళ్ల నిరీక్షణకు తెర.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..

Rani Rudrama Reddy | రాంచందర్‌రావుకు హిట్లర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : రాణీ రుద్రమారెడ్డి

Revanth Reddy | ఎన్వోసీ ఇవ్వండి.. మెట్రో ఫేజ్-2 కట్టుకుంటాం



