England vs Norway | ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ గెలుపు: క్వార్టర్స్‌లో నార్వే కొంపముంచిన ఆ తప్పులు ఇవే!
ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ సత్తా చాటింది. నార్వే చేసిన చిన్న తప్పులు ఆ జట్టు కొంపముంచగా.. బెల్లింగ్‌హామ్ మ్యాజిక్‌తో ఇంగ్లండ్ సెమీస్‌కు దూసుకెళ్లింది.
సంక్షిప్త సారాంశం
ఫిఫా వరల్డ్ కప్ 2026లో నార్వే ప్రస్థానం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 2-1 తేడాతో పరాజయం పాలయింది. రెండు అద్భుతమైన గోల్స్‌తో ఇంగ్లండ్ హీరోగా స్టార్ ప్లేయర్ జూడ్ బెల్లింగ్‌హామ్ నిలిచాడు. కీలక సమయంలో నార్వే ఆటగాళ్లు చేసిన స్వయంకృతాపరాధాలే ఆ జట్టును టోర్నీ నుంచి బయటకు పంపాయి. జూలై 15న అట్లాంటాలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో ఇంగ్లండ్ ఢీకొట్టనుంది.
- ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించిన నార్వే
- క్వార్టర్ ఫైనల్‌లో వెనుకంజ
- కొంపముంచిన తప్పిదాలు
- 2-1 తేడాతో గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఇంగ్లండ్
- రెండు గోల్స్ చేసిన బెల్లింగ్‌హామ్
England vs Norway | త్రినేత్ర.న్యూస్: ఫిఫా ప్రపంచకప్ 2026లో టోర్నీలో నార్వే ప్రస్థానం ముగిసింది. చరిత్రలో తొలిసారిగా క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టిన నార్వే కేవలం తప్పిదాల కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మియామీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నార్వేపై 2-1 తేడాతో గెలిచి ఇంగ్లండ్ సగర్వంగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జూడ్ బెల్లింగ్‌హామ్ అద్భుతంగా ఆడి, రెండు గోల్స్‌తో చెలరేగాడు. మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడినా స్వయంకృతాపరాధంతో నార్వే ఓటమి చెందింది. ఈ నెల 15న అట్లాంటా స్టేడియంలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో ఇంగ్లండ్ తలపడనుంది.
మ్యాచ్ ప్రారంభం నుంచే నార్వే ఆటగాళ్లు వరుస అటాక్స్ చేశారు. 36వ నిమిషంలో నార్వే తరపున ఆండ్రియాస్ షెల్‌డెరప్ గోల్ చేసి ఆధిక్యాన్ని అందించాడు. ఈ ఆనందం నార్వేకు ఎక్కువ సేపు లేదు. మొదటి అర్థభాగం ముగిసేందుకు కొన్ని నిమిషాల ముందు బెల్లింగహామ్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు. కొద్దిసేపటికే మళ్లీ గోల్ చేసే అవకాశం నార్వేకు వచ్చినప్పటికీ అలెగ్జాండర్ సార్లోత్ చేసిన తప్పిదంతో ప్రయత్నం విఫలమైంది. సార్లోత్ బంతిని నార్వే స్టార్ ప్లేయర్ ఇర్లింగ్ హాలండ్‌కు పాస్ చేయకుండా తానే గోల్ కొట్టేందుకు యత్నించాడు. బంతిని గోల్ కీపర్ విజయవంతంగా అడ్డుకున్నాడు.

రెండవ అర్థభాగంలో గోల్ కోసం ఇరుజట్లు తీవ్రంగా పోరాడాయి. 59వ నిమిషంలో నార్వే ఆటగాడు తోర్బ్‌జోర్న్ హెగ్గెం బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి నార్వేకు ఆధిక్యాన్ని కట్టబెట్టాడు. కానీ ఇంగ్లండ్ ఆటగాళ్ల అభ్యర్థన మేరకు రిఫరీ రివ్యూ కోరాడు. ఆ రివ్యూలో నార్వే ఆటగాడు హాలాండ్ ఫౌల్ చేసినట్లు తేలడంతో గోల్‌ను రిఫరీ రద్దు చేశారు. మ్యాచ్ ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో నిలిచాయి. దాంతో మ్యాచ్ ఫలితం తేలడం కోసం ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించారు.
ఎక్స్‌ట్రా టైమ్‌లో ఇంగ్లండ్ జట్టు సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దింపిన మోర్గాన్ రోజర్స్ కొట్టిన షాట్‌ను నార్వే కీపర్ నైలాండ్ సరిగ్గా నియంత్రించలేకపోయాడు. బంతి జారిపోవడంతో అక్కడే ఉన్న బెల్లింగ్‌హామ్ బంతిని గోల్‌పోప్ట్‌లోకి పంపి ఇంగ్లండ్‌కు స్పష్టమైన విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో ఇంగ్లాండ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన బెల్లింగ్‌హామ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Argentina vs Switzerland | ఎక్స్‌ట్రా టైమ్‌లో విశ్వరూపం: స్విట్జర్లాండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా!
జులై 12, 2026

Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
జులై 11, 2026

France vs Morocco | ఫ్రాన్స్ తీన్మార్!
జులై 10, 2026
తాజావార్తలు
- ●Parliament All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పీఎం, సీఎంల పదవులు ఊడే కొత్త బిల్లు
- ●DMK vs TVK | కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.. సీఎం విజయ్‌తో రాజీ లేదు: భగ్గుమన్న డీఎంకే
- ●MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
- ●Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ - ఐదు కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ
- ●Argentina vs Switzerland | ఎక్స్‌ట్రా టైమ్‌లో విశ్వరూపం: స్విట్జర్లాండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా!
- ●Trekking in Ananthagiri | అనంతగిరి ట్రెక్కింగ్‌లో విషాదం.. హైదరాబాద్‌కు చెందిన టీచర్ మృతి

Parliament All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పీఎం, సీఎంల పదవులు ఊడే కొత్త బిల్లు

DMK vs TVK | కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.. సీఎం విజయ్‌తో రాజీ లేదు: భగ్గుమన్న డీఎంకే

MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ - ఐదు కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ



