Argentina vs Switzerland | ఎక్స్‌ట్రా టైమ్‌లో విశ్వరూపం: స్విట్జర్లాండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా!
ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌ను 3-1 తేడాతో మట్టికరిపించిన అర్జెంటీనా సెమీస్‌కు దూసుకెళ్లింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో అల్వారెజ్ మ్యాజిక్ అర్జెంటీనా గెలుపునకు తోడైంది.
సంక్షిప్త సారాంశం
ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా అదరగొట్టింది. క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌పై 3-1 తేడాతో ఘనవిజయం సాధించింది. 10వ నిమిషంలో మెస్సీ అసిస్ట్‌తో మెక్ అలిస్టర్ తొలి గోల్ చేయగా, 67వ నిమిషంలో స్విస్ ఆటగాడు డాన్ ఎండోయె గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. ఎక్స్‌ట్రా టైమ్‌లో (112వ నిమిషం) అల్వారెజ్, ఆఖర్లో మార్టినెజ్ అద్భుత గోల్స్ కొట్టి అర్జెంటీనాకు చారిత్రక విజయాన్ని అందించారు. జూలై 16న అట్లాంటాలో జరిగే సెమీఫైనల్ పోరులో పటిష్టమైన ఇంగ్లండ్‌తో అర్జెంటీనా తలపడనుంది.
- అర్జెంటీనా చేతిలో స్విస్ చిత్తు
- క్వార్టర్స్‌లో 3-1 తేడాతో విజయం
- సగర్వంగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టిన డిఫెండింగ్ చాంపియన్
Argentina vs Switzerland | త్రినేత్ర.న్యూస్ : ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తన విశ్వరూపాన్ని ప్రదర్శించి స్విట్జర్లాండ్‌పై 3-1 తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ, అర్జెంటీనా రెట్టించిన ఉత్సాహంతో ఆడి స్విస్‌కు ముచ్చెమటలు పట్టించింది. ఈ నెల 16న అట్లాంటాలో జరిగే సెమీఫైనల్‌లో అర్జెంటీనా ఇంగ్లండ్‌తో తలపడనుంది. ప్రపంచకప్‌లో వరుసగా రెండుసార్లు సెమీస్ చేరిన జట్టుగా అర్జెంటీనా రికార్డు నెలకొల్పింది.
మ్యాచ్ ఆరంభం నుంచే అర్జెంటీనా దూకుడు ప్రదర్శించింది. ఆట మొదలైన పదవ నిమిషంలో స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ అందించిన అసిస్ట్‌ను అందుకున్న మెక్ అలిస్టర్ గురితప్పకుండా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. దీంతో అర్జెంటీనా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి అర్థభాగం మొత్తం అర్జెంటీనా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ మరో గోల్ మాత్రం సాధించలేకపోయింది. స్విస్ డిఫెన్స్‌ను విచ్ఛిన్నం చేస్తూ వరుస దాడులు చేసినప్పటికీ గోల్ మాత్రం చేయలేకపోయారు.
ద్వితీయార్థంలో స్విస్ ప్లేయర్లు చెలరేగిపోయారు. 67వ నిమిషంలో రికార్డో రోడ్రిగ్జ్ సహకారంతో డాన్ ఎండోయె గోల్ సాధించారు. దీంతో స్కోరు సమమైంది. మరో అయిదు నిమిషాలకే స్విస్ ఆటగాడు బ్రిల్ ఎంబోలో రెడ్ కార్డు ఎదుర్కొని మైదానం వీడాడు. దీంతో మిగిలిన సమయం స్విట్జర్లాండ్ పది మంది ఆటగాళ్లతోనే ఆటను కొనసాగించింది. నిర్ణీత కాలం పూర్తయ్యేసరికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు దారితీసింది.
అదనపు సమయంలో స్విస్ డిఫెన్స్‌ను ఛేదించేందుకు అర్జెంటీనా వరుస దాడులు చేసినా ఫలితం కనిపించలేదు. మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీస్తుందని భావిస్తున్న తరుణంలో 112వ నిమిషంలో జూలియన్ అల్వారెజ్ అద్భుత కర్లింగ్ షాట్‌తో గోల్ సాధించాడు. దీంతో అర్జెంటీనా 2-1 తో ఆధిక్యం సాధించింది. చివరి క్షణాల్లో లౌటారో మార్టినెజ్ మరో గోల్ చేయడంతో 3-1 తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Trekking in Ananthagiri | అనంతగిరి ట్రెక్కింగ్‌లో విషాదం.. హైదరాబాద్‌కు చెందిన టీచర్ మృతి
- ●CM Chandrababu | పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి : సీఎం చంద్రబాబు
- ●Rangareddy | ఎస్ఐ నిర్వాకం.. మెయిన్ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్
- ●Shabad Murders case | షాబాద్ రాజ్‌కుమార్ దొరకలే.. వదంతులు అబద్దం: డీసీపీ యోగేష్ గౌతం
- ●Tollywood | శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ - డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్‌లో గొడవలు
- ●Oman Ship Attack | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండించిన భారత్.. 10 మంది భారతీయులు సేఫ్, ఒకరు గల్లంతు

Trekking in Ananthagiri | అనంతగిరి ట్రెక్కింగ్‌లో విషాదం.. హైదరాబాద్‌కు చెందిన టీచర్ మృతి

CM Chandrababu | పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి : సీఎం చంద్రబాబు

Rangareddy | ఎస్ఐ నిర్వాకం.. మెయిన్ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్

Shabad Murders case | షాబాద్ రాజ్‌కుమార్ దొరకలే.. వదంతులు అబద్దం: డీసీపీ యోగేష్ గౌతం






