Mohammed Shami | ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి సమన్లు జారీ చేసిన ఈసీ..!
Mohammed Shami | టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ఎన్నికల కమిషన్ సమన్లు జారీ చేసింది. దక్షిణ కోల్‌కతాలోని జాదవ్ ప్రాంతంలోని కర్తాజునగర్ స్కూల్‌లో అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (AERO) ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
Mohammed Shami | టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ఎన్నికల కమిషన్ సమన్లు జారీ చేసింది. దక్షిణ కోల్‌కతాలోని జాదవ్ ప్రాంతంలోని కర్తాజునగర్ స్కూల్‌లో అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (AERO) ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. షమీతో పాటు అతని సోదరుడు కైఫ్‌కు సైతం సమన్లు పంపింది. సమాచారం మేరకు.. మహమ్మద్ షమీ రస్బిహారీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) వార్డ్ నంబర్ 93లో ఓటరుగా నమోదు చేసుకున్నాడు. తాజాగా సర్ నేపథ్యంలో సమన్లు పంపింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జన్మించినప్పటికీ.. చాలా సంవత్సరాలుగా కోల్‌కతాలో శాశ్వత నివాసం ఉంటున్నాడు.
ఇదిలా ఉండగా.. షమీ గత కొంతకాలంగా భారత జట్టులోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అత్త్యుత్తమంగా రాణించినా.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో బీసీసీఐ చోటు కల్పించలేదు. చివరిసారిగా షమీ 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో జాతీయ తరఫున ఆడాడు. అప్పటి నుంచి అతను జట్టుకు దూరంగా ఉన్నాడు. జాతీయ జట్టులో చోటు కోల్పోయిన షమీ.. జాతీయ జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఫాస్ట్ బౌలర్ ప్రస్తుత సీజన్‌లో రంజీ ట్రోఫీ, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో 200 ఓవర్లకుపైగా బౌలింగ్ చేసి మొత్తం 47 వికెట్లు పడగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో, షమీ బెంగాల్ తరపున ఏడు ఇన్నింగ్స్‌లలో 15 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీ తర్వాత.. షమీ రంజీ ట్రోఫీలోని మిగతా మ్యాచులు ఆడనున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో ప్రారంభం కానున్నది. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






