BRS | బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ముగ్గురు కార్పొరేటర్లు
ఖమ్మం (Khammam) కార్పొరేషన్‌లో బీఆర్ఎస్‌కు (BRS) మరో షాక్ తగిలింది. రెండు రోజుల క్రితం ఐదుగురు కార్పొరేటర్లు అధికార పార్టీలో (Congress) చేరగా, తాజాగా మరో ముగ్గురు గులాబీ పార్టీకి ఝలకిచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
ఖమ్మం: ఖమ్మం (Khammam) కార్పొరేషన్‌లో బీఆర్ఎస్‌కు (BRS) మరో షాక్ తగిలింది. రెండు రోజుల క్రితం ఐదుగురు కార్పొరేటర్లు అధికార పార్టీలో (Congress) చేరగా, తాజాగా మరో ముగ్గురు గులాబీ పార్టీకి ఝలకిచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇందులో భాగంగా నగర మేయర్ సహా 40 మంది కార్పొరేటర్లు హైదరాబాద్ పయణమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గంను రద్దుచేసి ఫిబ్రవరి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్, మున్సిపల్ శాఖ అధికారులను కోరనున్నారు. ఈ మేరకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
60 డివిజన్లు కలిగిన ఖమ్మం కార్పొరేషన్‌కు 2021లో ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అయితే తదనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వలసలు ప్రారంభమయ్యాయి. మేయర్, డిప్యూటీ మేయర్ సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు హస్తం పార్టీలోకి జంప్ అవడంతో ఖమ్మం కార్పొరేషన్ కాంగ్రెస్ వశమైంది. ఈ నెల 5న గాంధీభవన్‌లో ఐదుగురు గులాబీ కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఆ పార్టీ బలం 37కు చేరింది. అయితే పాత కొత్త నేతలతో ఖమ్మం కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొన్నది. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన తమకు.. వలసతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..
- ●Supreme Court | విద్యార్థులపై చర్యలు వద్దు.. వారిని వెంటనే వదిలిపెట్టండి.. పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు
- ●Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. దిగువకు 30 వేల క్యూసెక్కులు విడుదల
- ●CP Sumathi | దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ సుమతి
- ●Attack with Knife | జనగామలో కత్తిపోట్ల కలకలం.. నలుగురు యువకులపై దాడి
- ●Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..

WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..

Supreme Court | విద్యార్థులపై చర్యలు వద్దు.. వారిని వెంటనే వదిలిపెట్టండి.. పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు

Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. దిగువకు 30 వేల క్యూసెక్కులు విడుదల

CP Sumathi | దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ సుమతి






