UP SIR Draft Roll | ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల ఓటర్లు ఔట్.. చనిపోయిన వాళ్లే 46 లక్షలు
ఎక్కువ ఓటర్లను తొలగించిన ప్రాంతాల్లో లక్నో టాప్‌లో నిలిచింది. SIR ప్రకటించినప్పుడు 39.9 లక్షల ఓటర్లు ఉండగా, ఇప్పుడు 27.9 లక్షల ఓటర్లు మాత్రమే ఉన్నారు. అంటే 30 శాతం ఓటర్లు గల్లంతయ్యారు.
UP SIR Draft Roll | కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే తొలి దశ పూర్తయి రెండో దశ నడుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండో దశలో భాగంగా ఎన్నికల అధికారులు SIR కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రాష్ట్రంలో చనిపోయిన వాళ్లు, వలసలు వెళ్లిన వాళ్లు, సరైన ప్రూఫ్స్ లేని వాళ్లు, నకిలీ ఓట్లు అన్నింటినీ జల్లెడ పట్టిన అధికారులు తాజాగా యూపీకి సంబంధించిన డ్రాఫ్ట్‌ని రిలీజ్ చేశారు. అందులో 2.89 కోట్ల ఓట్లను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. 2.89 కోట్ల ఓటర్లలో చనిపోయిన వాళ్లు 46 లక్షల ఓటర్లు ఉన్నారు. 25.47 లక్షల మంది రెండు చోట్ల ఓటు హక్కును కలిగి ఉన్నారు. 2.17 కోట్ల మంది రాష్ట్రం నుంచి వలస వెళ్లారు. మొత్తంగా 2.89 కోట్ల మంది ఓటర్లను ఫైనల్ లిస్టు నుంచి తొలగించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్ల తుది జాబితాను మార్చి 6న రిలీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
రిజిస్టర్డ్ ఓటర్లు 15.44 కోట్లు
అక్టోబర్ 27, 2025 న SIR ప్రకటించే సమయానికి ఉత్తరప్రదేశ్‌లో 15.44 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. ప్రతి ఒక్క ఓటరు వివరాలను తనిఖీ చేసేందుకు ఎన్యుమరేషన్ ఫామ్స్‌ని ప్రింట్ చేయించి ఇంటింటికి వెళ్లి బూత్ లేవల్ అధికారులు ఓటర్ల వివరాలను నింపించి వాళ్ల సంతకం తీసుకొని వాటిని వెరిఫై చేశారు. అలా ఇప్పటి వరకు 12,55,56,025 ఓటర్లు తమకు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్స్‌ని తిరిగి ఎన్నికల అధికారులు ఇచ్చారు. అంటే రిజిస్టర్ అయి ఉన్న ఓటర్లలో 81.03 శాతం. 18.7 శాతం ఓటర్ల ఫామ్స్ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. 18.7 శాతం ఓటర్లలో 2.89 కోట్ల మంది ఉన్నారు. వాళ్లకు సంబంధించిన డ్రాఫ్ట్‌ని తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసింది.
ఓట్ల తొలగింపులో లక్నో టాప్
ఎక్కువ ఓటర్లను తొలగించిన ప్రాంతాల్లో లక్నో టాప్‌లో నిలిచింది. SIR ప్రకటించినప్పుడు 39.9 లక్షల ఓటర్లు ఉండగా, ఇప్పుడు 27.9 లక్షల ఓటర్లు మాత్రమే ఉన్నారు. అంటే 30 శాతం ఓటర్లు గల్లంతయ్యారు. అలాగే లలిత్‌పూర్‌లో 9.5 లక్షల ఓటర్లు ఉండగా.. ఇప్పుడు 10 శాతం తగ్గి 8.6 లక్షల ఓటర్లే మిగిలారు.
సంబంధిత వార్తలు

Draft Voter List | నేడు ముసాయిదా ఓటర్ల జాబితా.. 92 లక్షల మందికి నోటీసులు!
ఆగస్టు 17, 2026

KTR | డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ బీఎల్ఏల వద్ద ఉండాలి.. రోజుకు 50 ఇళ్లను పరిశీలించాలి
ఆగస్టు 16, 2026

ATM Robbery | ఎట్టకేలకు దొరికారు.. బీదర్‌లో ఏటీఎంను కొల్లగొట్టి.. కూకట్‌పల్లిలో షెల్టర్ తీసుకున్నారు..
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం
- ●Khajaguda U Turn | ఖాజాగూడ రూట్లో వెళ్తున్నారా? ట్రాఫిక్ రూల్స్‌లో కీలక మార్పులు.. జాయింట్ సీపీ ఆకస్మిక తనిఖీలు
- ●Telangana CEO Sudharsan Reddy | SIR డ్రాఫ్ట్ రిలీజ్ చేయగానే అన్ని రాజకీయ పార్టీలను మీటింగ్‌కు పిలిచిన ఈసీ.. ఎందుకంటే?
- ●Ponguleti Srinivas Reddy | హక్కుదారులకు హామీ ఇస్తున్నా.. 22ఎ వల్ల గజం భూమిని కూడా పోనివ్వం
- ●Telangana employees JAC | తెలంగాణ సర్కార్‌పై పోరుకు సిద్ధమవుతున్న ఉద్యోగులు.. పీఆర్సీ, డీఏల సాధన కోసం రేపే కీలక భేటీ
- ●Kalyana Lakshmi Scheme Stopped | 50 లక్షల లాయర్ నీకు ఓకే.. ఆడబిడ్డలకు వద్దా? సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం

Khajaguda U Turn | ఖాజాగూడ రూట్లో వెళ్తున్నారా? ట్రాఫిక్ రూల్స్‌లో కీలక మార్పులు.. జాయింట్ సీపీ ఆకస్మిక తనిఖీలు

Telangana CEO Sudharsan Reddy | SIR డ్రాఫ్ట్ రిలీజ్ చేయగానే అన్ని రాజకీయ పార్టీలను మీటింగ్‌కు పిలిచిన ఈసీ.. ఎందుకంటే?

Ponguleti Srinivas Reddy | హక్కుదారులకు హామీ ఇస్తున్నా.. 22ఎ వల్ల గజం భూమిని కూడా పోనివ్వం



