త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SL vs ENG | చెల‌రేగిన ఇంగ్లిష్ బౌల‌ర్లు.. శ్రీ‌లంక‌పై గ్రాండ్ విక్ట‌రీ

SL vs ENG | టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సూప‌ర్ ఎయిట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు 51 ప‌రుగుల తేడాతో శ్రీ‌లంక‌ను ఓడించింది. ఇంగ్లిష్ బౌల‌ర్ల ధాటికి లంక 95 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 147 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన శ్రీ‌లంక 16.4 ఓవ‌ర్ల ఆలౌట్ అయ్యింది.

P

Sports | Published On Feb 22, 2026, 6.42 pm IST

SL vs ENG | చెల‌రేగిన ఇంగ్లిష్ బౌల‌ర్లు.. శ్రీ‌లంక‌పై గ్రాండ్ విక్ట‌రీ
Advertisement

SL vs ENG | టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సూప‌ర్ ఎయిట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు 51 ప‌రుగుల తేడాతో శ్రీ‌లంక‌ను ఓడించింది. ఇంగ్లిష్ బౌల‌ర్ల ధాటికి లంక 95 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 147 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన శ్రీ‌లంక 16.4 ఓవ‌ర్ల ఆలౌట్ అయ్యింది. గ్రూప్ ద‌శ‌లో ఆక‌ట్టుకున్న శ్రీ‌లంక.. ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా నిరాశ ప‌రిచింది. ఏడుగురు బ్యాట్స్‌మెన్ క‌నీసం రెండంకెల స్కోర్ చేయ‌లేక‌పోయారు. ఇందులో ఇద్ద‌రు బ్యాట్స్‌మెన్ డ‌కౌట్ అయ్యారు. ఆ జ‌ట్టు త‌ర‌ఫున కెప్టెన్ దాసున్ ష‌న‌కా మాత్ర‌మే 30 ప‌రుగుల‌తో టాప్ స్కోర్‌గా నిలిచాడు. కమిందు మెండిస్ (13), దునిత్ వెలలాగే (10) ప‌రుగులు చేయ‌గా.. మహీష్ తీక్షణ ప‌ది ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు.

ఇంగ్లండ్ తరఫున విల్ జాక్స్ మూడు వికెట్లు పడగొట్టగా, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్ తలా రెండు వికెట్లు తీశారు. జామీ ఓవర్టన్‌కి ఒక వికెట్ ద‌క్కింది. అంత‌కు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీ‌లంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 146 ప‌రుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ సైతం చెత్త‌గా సాగింది. క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోతూ వ‌చ్చింది. ఫిల్ సాల్ట్ 40 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేయ‌డంతో ఇంగ్లండ్ ఆమాత్రం స్కోర్ చేయ‌గ‌లిగింది. మిగ‌తా ఎవ‌రూ చెప్పుకోద‌గ్గ ఇన్నింగ్స్ ఆడ‌లేక‌పోయారు. విల్ జాక్స్ (21), హ్యారీ బ్రూక్ (14), సామ్ క‌ర్రాన్ (11), జోస్ బట్లర్ 7, టామ్ బెంటన్ (6), లియామ్ డేవిసన్ (6), జాకబ్ బెథెల్ (3) పరుగులు చేయగా, జేమీ ఓవర్టన్ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక తరపున దునిత్ వెలాలేజ్ మూడు వికెట్లు పడగొట్టగా, దిల్షాన్ మదుశంక, మహీష్ తీక్షణ తలా రెండు వికెట్లు పడగొట్టారు. దుష్మంత చమీర‌కి ఒక వికెట్ ద‌క్కింది.

Advertisement
Advertisement