2019 Easter bombings | 2019 ఈస్టర్ ఆత్మాహుతి దాడుల కేసు.. 15 మందికి 200 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష
2019 Easter bombings | 2019 ఈస్టర్ సండే ఆత్మాహుతి దాడి (2019 Easter bombings) కేసులో శ్రీలంక కోర్టు (Sri Lankan court) సంచలన తీర్పు వెలువరించింది. 15 మంది దోషులకు 200 నుంచి 260 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.
International | Published On Sep 23, 2026, 10.45 am IST
2019 Easter bombings | త్రినేత్ర న్యూస్ : 2019 ఈస్టర్ సండే ఆత్మాహుతి దాడి (2019 Easter bombings) కేసులో శ్రీలంక కోర్టు (Sri Lankan court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 24 మందిలో 15 మందిని కోర్టు మంగళవారం దోషులుగా నిర్ధారించింది. తాజాగా వారికి శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. దోషులకు 200 నుంచి 260 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించింది (15 accused to over 200 years in prison). వీరిలో దాడులకు ఆర్థిక సాయం, ప్రణాళికలు అందించిన ప్రధాన సూత్రధారి అయిన మహమ్మద్ నౌఫర్‌కు కోర్టు 220 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
2019లో ISIS ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న స్థానిక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్‌కు చెందిన ఆత్మాహుతి దళ సభ్యులు శ్రీలంకలో మారణహోమం సృష్టించారు. ఏప్రిల్ 21న ఈస్టర్ సండే సందర్భంగా మూడు కేథలిక్ చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్లపై వరుస దాడులు చేశారు. ఈ వరుస పేలుళ్లలో 11 మంది భారతీయులు సహా దాదాపు 270 మందికిపైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 500 మందికిపైగా గాయపడ్డారు.
ఈ కేసు విచారణ దాదాపు ఐదేళ్లపాటూ సాగింది. 24 మందిపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున మొత్తం 2,309 మంది సాక్షులను విచారించారు. నిందితులపై హత్య, ఉగ్రవాద కుట్ర, పేలుడు పదార్థాలు కలిగి ఉండటం వంటి సుమారు 23,000కు పైగా అభియోగాను మోపారు. వీటి ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ కింద 15 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. సుదీర్ఘ విచారణ తర్వాత జస్టిస్ నవరత్న మారసింఘే, జస్టిస్ రామనాథన్ కన్నన్, జస్టిస్ సుజీవ నిశ్శంకతో కూడిన ప్రత్యేక బెంచ్ దోషులకు శిక్ష ఖరారు చేస్తూ తుది తీర్పు వెలువరించింది. ఇదే కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో మరో 9 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. దోషుల ఆస్తులను ప్రభుత్వ పరం చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Also Read..
విద్యార్థి ఆత్మహత్య కేసు.. ప్రొఫెసర్‌ను సెలవుపై పంపిన ఐఐటీ బాంబే
ఢిల్లీలో మరో ఘటన.. కళాశాల విద్యార్థినిని వెంబడించి వేధించిన ఆకతాయిలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Apple Mac Mini | యాపిల్ కొత్త మ్యాక్ మినీ, మ్యాక్ స్టూడియో వచ్చేశాయి.. ధరలు ఇవే..
- ●Jurala Project | ఆయకట్టు రైతులకు సాగునీటి కోసం.. జూరాల నుంచి నీరు విడుదల..
- ●Stock Markets | భారీగా తగ్గిన ముడి చమురు ధరలు.. మార్కెట్లకు స్వల్ప ఊరట..
- ●IIT Bombay | విద్యార్థి ఆత్మహత్య కేసు.. ప్రొఫెసర్‌ను సెలవుపై పంపిన ఐఐటీ బాంబే
- ●Revanth Reddy | సీఎం గారు ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ షో చూస్తా.. అనుమతివ్వాలంటూ నాని రిక్వెస్ట్.. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?
- ●College Student | ఢిల్లీలో మరో ఘటన.. కళాశాల విద్యార్థినిని వెంబడించి వేధించిన ఆకతాయిలు

Apple Mac Mini | యాపిల్ కొత్త మ్యాక్ మినీ, మ్యాక్ స్టూడియో వచ్చేశాయి.. ధరలు ఇవే..

Jurala Project | ఆయకట్టు రైతులకు సాగునీటి కోసం.. జూరాల నుంచి నీరు విడుదల..

Stock Markets | భారీగా తగ్గిన ముడి చమురు ధరలు.. మార్కెట్లకు స్వల్ప ఊరట..

IIT Bombay | విద్యార్థి ఆత్మహత్య కేసు.. ప్రొఫెసర్‌ను సెలవుపై పంపిన ఐఐటీ బాంబే






