త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhishek Porel | ఐపీఎల్ క్రికెటర్‌ అభిషేక్‌ పోరెల్ అరెస్ట్‌.. పెళ్లి చేసుకుంటానని అత్యాచారం చేశాడ‌ని ఆరోప‌ణ‌లు..

Abhishek Porel | ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రికెటర్‌, బెంగాల్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అభిషేక్‌ పోరెల్ అరెస్ట‌య్యాడు. ఓ వైద్య విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసులో పోలీసులు సోమవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నారని, అనంతరం దాడి చేసి బెదిరించారని ఆమె ఆరోపించింది.

P

Sports | Published On Aug 11, 2026, 4.26 pm IST

Abhishek Porel | ఐపీఎల్ క్రికెటర్‌ అభిషేక్‌ పోరెల్ అరెస్ట్‌.. పెళ్లి చేసుకుంటానని అత్యాచారం చేశాడ‌ని ఆరోప‌ణ‌లు..
Advertisement

Abhishek Porel | ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రికెటర్‌, బెంగాల్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అభిషేక్‌ పోరెల్ అరెస్ట‌య్యాడు. ఓ వైద్య విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసులో పోలీసులు సోమవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నారని, అనంతరం దాడి చేసి బెదిరించారని ఆమె ఆరోపించింది. హూగ్లీ ఎస్పీ కున్వర్‌ భూషణ్‌ సింగ్‌ అరెస్టును ధ్రువీకరించారు. ఎమామి సిటీలోని పోరెల్‌ను డమ్‌డమ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. జూన్‌లో బాధితురాలు, ఆమె తల్లి హూగ్లీలోని మొగ్రా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు పోరెల్‌తో సుమారు మూడేళ్లుగా సంబంధం ఉందని ఆమె పేర్కొంది. గత ఏడాది నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని, ఆ తర్వాత పోరెల్‌ తనకు దూరంగా ఉంటున్నాడ‌ని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని న‌మ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నారని, అనంతరం వివాహానికి నిరాకరించారని ఫిర్యాదులో పేర్కొంది. దాడి, బెదిరింపులకు పాల్పడ్డాడ‌ని పేర్కొంది.

హైకోర్టు ఆదేశాలతో అరెస్టు

ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పోరెల్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కలకత్తా హైకోర్టు జూలైలో ఆయనను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసుకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకోవాలని కూడా సూచించింది. బాధితురాలికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని బయటకు రాకుండా చూడాలన్న ఉద్దేశంతో ఈ ఆదేశాలు ఇచ్చింది. పోరెల్‌పై అత్యాచారం, బెదిరింపులు, దాడి తదితర ఆరోపణల్లో ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదైంది. ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. పోరెల్‌ గతంలో ఈ ఆరోపణలను ఖండించాడు. ఇందులో ఏమాత్రం నిజం లేద‌ని తెలిపాడు. అభిషేక్‌ పోరెల్‌ ఎడమచేతి వాటం బ్యాటర్‌, వికెట్‌కీపర్‌. 2023 నుంచి ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ త‌ర‌ఫున ఆడుతున్నాడు. భారత్‌ ‘ఏ’ జట్టుతో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. బెంగాల్‌ తరఫున 2021–22 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్‌ అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement
Advertisement