Tragedy in Rajahmundry | రాజమండ్రిలో దారుణం.. వైద్య విద్యార్థినిపై కారు ఎక్కించిన యువకులు
Medical Student | ఏపీలోని రాజమండ్రిలో దారుణం జరిగింది. ఓ మెడికల్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు కారు ఎక్కించిన ఘటనలో ఆమెను వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారకులైన ఇద్దరు యువకులను రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించిన వైద్యులు
- పశ్చిమబెంగాల్ ఘటన తరహాలోనే చేశారంటూ వైద్యుల ఆగ్రహం
Tragedy in Rajahmundry | త్రినేత్ర.న్యూస్: ఏపీలోని రాజమండ్రిలో దారుణం జరిగింది. ఓ మెడికల్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు కారు ఎక్కించిన ఘటనలో ఆమెను వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారకులైన ఇద్దరు యువకులను రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ ఘటన తరహాలోనే ఈ ఘటన జరిగిందని రాజమండ్రి వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి సెంట్రల్ జోన్ డీఎస్పీ ఎ. సుభాష్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ ప్రియాంక (28) జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీలో పీజీ చేస్తోంది. ఈనెల 3న రాజమండ్రి ఏవీ అప్పారావ్ రోడ్‌లోని ప్రసాదిత్యా మాల్‌లో సినిమా చూసేందుకు వెళ్లింది. అనంతరం స్కూటీపై బయటికి వస్తోంది. ఈ సమయంలో ఇద్దరు యువకులు ఆమె వెళ్తున్న స్కూటీకి డ్యాష్ ఇచ్చారు. ఇదేంటని ప్రశ్నించగా మరోసారి వేగంగా ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా ఆమె తలపై నుంచి కారును పోనిచ్చారు. యువతికి తీవ్ర గాయం కావడంతో స్థానికులు హుటాహుటిన రాజమండ్రిలోని స్వతంత్ర ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. చివరి అవకాశంగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఘటన సమయంలో నిందితులు ఇద్దరూ మద్యం సేవించారని.. మాల్లోకి సినిమా చూసేందుకు రావడంతో తనిఖీలు చేసిన మాల్ సిబ్బంది వారిని అనుమతించలేదని డీఎస్పీ తెలిపారు. బయటకు వెళ్తూ గేటు వద్ద స్కూటీని ఢీకొట్టి పారిపోయారన్నారు. నామవరానికి చెందిన నిందితులైన ఇంజినీరింగ్ విద్యార్థులు సురావరపు దస్వంత్ ఎ1గా, ఆండ్రూ జోసఫ్ అడ్వర్డ్స్ A2గా చేర్చి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మాల్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు మరో కేసు నమోదు చేసి వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.
రాజమండ్రిలో దారుణం
జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ
పీజీ చేస్తున్న 28 ఏళ్ల డాక్టర్ ప్రియాంకరెండు రోజుల క్రితం రాజమండ్రి ఏవీ అప్పారావ్ రోడ్ లోని ప్రసాదిత్యా మాల్ లో సినిమాకు వెళ్లిన
సందర్భంగా పార్కింగ్ లో డాక్టర్ ప్రియాంక కారును ఢీకొట్టిన ఇద్దరు యువకులు కారు… pic.twitter.com/JLXzdPgJeA— RTV (@RTVnewsnetwork) August 6, 2026
సంబంధిత వార్తలు

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
ఆగస్టు 12, 2026

TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
ఆగస్టు 12, 2026

Revanth Reddy | ఆర్మీ నియామకాల్లో యువతను ప్రోత్సహించేందుకు కలిసి పని చేస్తాం
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..
- ●Harish Rao | ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమన్న హామీ ఏమైంది రేవంత్?: హరీశ్ రావు

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్

Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..

Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం



