WPL 2026 | డబ్ల్యూపీఎల్ ఎలిమినేటర్.. ఢిల్లీ ఘన విజయం.. ఫైనల్స్‌లో బెంగళూరుతో ఢీ..
WPL 2026 | వడోదరలో ఉత్కంఠభరితంగా సాగిన డబ్ల్యూపీఎల్ ఎలిమినేటర్ 2026 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన, లిజెల్ లీ, షఫాలి వర్మల మెరుపు ఆరంభంతో గుజరాత్ జయాంట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది.
WPL 2026 | వడోదరలో ఉత్కంఠభరితంగా సాగిన డబ్ల్యూపీఎల్ ఎలిమినేటర్ 2026 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన, లిజెల్ లీ, షఫాలి వర్మల మెరుపు ఆరంభంతో గుజరాత్ జయాంట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 5న జరగనున్న ఫైనల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢిల్లీ ఎదుర్కోనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జయాంట్స్‌కు ఈసారి ఆరంభమే చేదుగా మారింది. ఈ సీజన్‌లో బ్యాటింగ్ ఫస్ట్‌లో అజేయంగా సాగిన గుజరాత్ ఈ మ్యాచ్‌లో మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. కీలక ప్లేయర్ సోఫీ డివైన్ రెండో ఓవర్‌లోనే పెవిలియన్ చేరడంతో పతనం మొదలైంది. ఆ తర్వాత నందని శర్మ వరుస బంతుల్లో అనుష్క శర్మ, ఆష్లీ గార్డ్‌నర్‌ను ఔట్ చేసి గుజరాత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. మిన్ను మణి మరో వికెట్ తీసి స్కోర్‌ను 59/4కు కుదించింది.
లిజెల్ లీ, షఫాలి మెరుపు ఆరంభం..
ఈ దశలో బెత్ మూనీ బాధ్యత తీసుకుని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపింది. జార్జియా వేరమ్‌తో కలిసి ఆమె కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. చివరి ఓవర్లలో కష్వీ గౌతమ్ సహకారంతో స్కోర్‌ను 168 పరుగుల వరకు తీసుకెళ్లింది. బెత్ మూనీ 51 బంతుల్లో అజేయంగా 62 పరుగులు చేసి మరోసారి ఆకట్టుకుంది. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు లిజెల్ లీ, షఫాలి వర్మలు మెరుపు ఆరంభం అందించారు. తొలి ఓవర్లలోనే బౌండరీల వర్షం కురిపించిన ఈ జోడీ, పవర్‌ప్లేలోనే మ్యాచ్ దిశను మార్చేశారు. ఐదో ఓవర్ వరకు 64 పరుగులు సాధించి గుజరాత్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. షఫాలి దూకుడైన షాట్లతో ప్రేక్షకులను అలరించగా, లిజెల్ లీ నిలకడగా పరుగులు జోడించింది. ఇద్దరూ కలిసి 89 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పి లక్ష్యంలో సగానికి పైగా పరుగులు సాధించారు. ఎనిమిదో ఓవర్‌లో ఇద్దరూ ఔటైనా అప్పటికే మ్యాచ్ ఢిల్లీ వైపు మళ్లింది.
తర్వాత జెమిమా రోడ్రిగ్స్, లారా వోల్వార్ట్ జోడీ ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేసింది. రోడ్రిగ్స్ వేగంగా పరుగులు సాధించగా, వోల్వార్ట్ తనదైన షాట్లతో స్కోర్‌ను ముందుకు నడిపింది. రోడ్రిగ్స్ 23 బంతుల్లో 41 పరుగులు చేయగా, చివర్లో మరిజాన్ కాప్ విజయం ఖరారు చేసింది. 26 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 5న జరగనున్న డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్‌లో బెంగళూరును ఢిల్లీ ఢీకొట్టనుంది. ఇరు జట్లు సమరోత్సాహంతో చక్కని ఫామ్ లో ఉన్న నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
సంబంధిత వార్తలు

IPL 2026 | కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టి.. సరికొత్త రికార్డును నెలకొల్పిన కేఎల్ రాహుల్..!
మే 2, 2026

Lungi Ngidi | ఆసుపత్రి నుంచి లుంగి ఎంగిడీ డిశ్చార్జి.. బాగానే ఉన్నానని తెలిపిన ఫాస్ట్ బౌలర్..!
ఏప్రిల్ 26, 2026

IPL 2026 | లుంగీ ఎంగిడి ఆరోగ్యం నిలకడగానే ఉంది.. అప్డేట్ ఇచ్చిన ఐపీఎల్ నిర్వాహకులు..
ఏప్రిల్ 25, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



