Sourav Ganguly | ఇకనైనా తలరాత మారేనా..? ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా సౌరవ్ గంగూలీ
Sourav Ganguly | భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కీలక బాధ్యతలు స్వీకరించాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా గంగూలీ నియమితులయ్యాడు. 2019లో సలహాదారుగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో గంగూలీ అనుబంధం మొదలైంది. ఆ తర్వాత పురుషుల, మహిళల జట్లకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సహా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించాడు.
Sourav Ganguly | భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కీలక బాధ్యతలు స్వీకరించాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా గంగూలీ నియమితులయ్యాడు. 2019లో సలహాదారుగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో గంగూలీ అనుబంధం మొదలైంది. ఆ తర్వాత పురుషుల, మహిళల జట్లకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సహా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. ఫ్రాంచైజీ క్రికెట్ వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించాడు. తాజాగా హెడ్‌కోచ్ బాధ్యతలు చేపట్టిన గంగూలీ.. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను టైటిల్ రేసులో నిలిపేందుకు ప్రయత్నించనున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టు ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవలేకపోయింది. 2020లో తొలిసారి ఫైనల్‌కు చేరినా.. టైటిల్‌ను మాత్రం అందుకోవడంలో విఫలమైంది.
గంగూలీ కుటుంబంలో భాగమే..
గంగూలీ నియామకంపై ఢిల్లీ క్యాపిటల్స్ చైర్మన్, సహ యజమాని పార్థ్ జిందాల్ హర్షం వ్యక్తం చేశారు. ‘గంగూలీ ఎప్పటినుంచో ఢిల్లీ క్యాపిటల్స్ కుటుంబంలో కీలక సభ్యుడు. భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన ఆయన ఇప్పుడు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉంది. ఆయన మార్గనిర్దేశంలో టైటిల్ కోసం మరింత మెరుగ్గా సన్నద్ధమవుతాం’ అని పేర్కొన్నాడు. ఫ్రాంచైజీ సహ యజమాని కిరణ్ కుమార్ గ్రాంధి మాట్లాడుతూ.. ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ వ్యవస్థపై గంగూలీకి ఉన్న లోతైన అవగాహన కొత్త బాధ్యతల్లో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
భయంలేని జట్టుగా తీర్చిదిద్దుతా..
హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడంపై గంగూలీ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఐపీఎల్‌లో హెడ్‌కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఢిల్లీ క్యాపిటల్స్ నాకు ఎంతో ప్రత్యేకమైన ఫ్రాంచైజీ. యాజమాన్యం, మేనేజ్‌మెంట్, సహాయక సిబ్బంది, ఆటగాళ్లతో గతంలోనే కలిసి పనిచేశా. మాకు ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. ఇటీవల మంచి క్రికెట్ ఆడాం. కొత్త సీజన్‌లో బలమైన, భయంలేని జట్టును నిర్మించడంపై దృష్టి పెడతా’ అని గంగూలీ తెలిపాడు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు మహిళల జట్టు కూడా ఉంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగు సీజన్లలోనూ ఢిల్లీ జట్టు ఫైనల్‌కు చేరడం విశేషం. ప్రతిసారీ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. పురుషుల జట్టు ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురుచూస్తుండగా.. మహిళల జట్టు కూడా డబ్ల్యూపీఎల్ ట్రోఫీని అందుకోలేకపోయింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●ACB Raids Telangana | కోరుట్ల ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ మెరుపు దాడి: ఎంవీఐ బదులు కానిస్టేబులే డ్రైవింగ్ టెస్టులు
- ●Anaswara Rajan | మాస్ మహారాజా సినిమాలో మలయాళ హీరోయిన్...టాలీవుడ్లో అనస్వరకు మరో ఛాన్స్
- ●Ramchandar Rao | రాహుల్! ఈవీఎంలు తెచ్చిందే మీ నాయిన
- ●Public Smoking Jail Hyderabad | బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు కాలుస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే..!
- ●Namrata Shirodkar | నమ్రతా శిరోద్కర్‌తో సుకుమార్ సతీమణి - ఫొటోలు వైరల్
- ●Kishan Reddy | బతుకమ్మ.. మహిళల చైతన్యానికి ప్రతీక

ACB Raids Telangana | కోరుట్ల ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ మెరుపు దాడి: ఎంవీఐ బదులు కానిస్టేబులే డ్రైవింగ్ టెస్టులు

Anaswara Rajan | మాస్ మహారాజా సినిమాలో మలయాళ హీరోయిన్...టాలీవుడ్లో అనస్వరకు మరో ఛాన్స్

Ramchandar Rao | రాహుల్! ఈవీఎంలు తెచ్చిందే మీ నాయిన

Public Smoking Jail Hyderabad | బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు కాలుస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే..!






