Virat Kohli | కోహ్లీ సరికొత్త చరిత్ర.. 13 వేల పరుగుల మార్కును దాటిన తొలి ఆటగాడిగా..
Virat Kohli | భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (Virat Kohli)మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో (One Day Internationals) నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 13 వేల పరుగుల మార్కును దాటిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
Virat Kohli | త్రినేత్ర న్యూస్: భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (Virat Kohli)మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో (One Day Internationals) నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 13 వేల పరుగుల మార్కును దాటిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజీలాండ్‌తో (New Zealand) ఆక్‌లాండ్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో 37 ఏండ్ల కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ ఈ ఘనత సాధించడానికి కేవలం 12 పరుగుల దూరంలో ఉన్నాడు. కివీస్ ఉంచిన 186 పరుగుల లక్ష్యసాధనలో భాగంగా ఏడో ఓవర్‌లో తను ఎదుర్కొన్న 13వ బంతికి కోహ్లీ ఈ రికార్డ్ సాధించాడు. కేవలం 251 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. ఇందులో 48 సెంచరీలు, దాదాపు 70 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడో స్థానంలో కోహ్లీ యావరేజ్ 60కి పైగా ఉండటం గమనార్హం.
ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగులు దాటడానికి ఆటగాళ్లు శ్రమిస్తుండగా, కోహ్లీ మాత్రం కేవలం వన్డేల్లోనే అదికూడా మూడో స్థానంలోనే 13 వేల పరుగులు సాధించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో నంబర్ 3 స్థానంలో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ Ricky Ponting (12,662 పరుగులు) రికార్డును కోహ్లీ అధిగమించి, ఆయన కంటే చాలా ముందంజలో నిలిచాడు. వన్డేల్లో మూడో స్థానంలో 10 వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు ప్రపంచంలో కోహ్లీ, పాంటింగ్ మాత్రమే కావడం గమనార్హం.
మూడో స్థానంలో అత్యధిక రన్స్..
విరాట్ కోహ్లీ: 13,000 పరుగులు (61.55 సగటుతో)
రికీ పాంటింగ్: 12,662 పరుగులు (42.48 రన్స్)
కుమార్ సంగక్కర: 9,747 పరుగులు (44.71 రన్స్)
జాక్వెస్ కల్లిస్: 7,774 పరుగులు (45.72 రన్స్)
కేన్ విలియమ్సన్: 6,504 పరుగులు (51.61 రన్స్)
ఈ ఏడాది (2026) వన్డేల్లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లో 69 సగటుతో 552 పరుగులు చేశాడు. ఇందులో వెస్టిండీస్‌పై చేసిన 139 (నాటౌట్) స్కోరుతో పాటు రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ తాజా మైలురాయితో వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా తన స్థానాన్ని కోహ్లీ మరింత పదిలం చేసుకున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | కాలుష్య రహిత దీపావళి.. విరాట్ కోహ్లీతో అవగాహన కల్పించండి : సుప్రీంకోర్టు
అక్టోబర్ 30, 2026

New Zealand Bra Fence | న్యూజిలాండ్‌లో వింత టూరిస్ట్ స్పాట్: 40 మీటర్ల కంచె నిండా వందలాది బ్రాలు.. అసలు కథేంటంటే!
అక్టోబర్ 17, 2026

Virat Kohli | ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడానికి కోహ్లీ రూ.5 కోట్లు తీసుకున్నారా..? క్లారిటీ ఇచ్చిన విరాట్ టీమ్
అక్టోబర్ 7, 2026
తాజావార్తలు
- ●Mallikarjun Kharge | సమాధానాలు లేకే.. దిమాగీ నక్సల్ నినాదాన్ని ఎత్తుకున్నారు : మోదీ, షాపై ఖర్గే విమర్శలు
- ●KTR | భూములు అమ్ముకునే బ్రోకర్ రేవంత్ రెడ్డి
- ●Stockal | స్టాక్ఏల్లో రూ.100 కోట్ల మోసం.. అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడుల పేరుతో కుచ్చు టోపీ..
- ●Prashant Bhushan | సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై FIR నమోదు
- ●US Stocks | అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులా? భారతీయులు తెలుసుకోవాల్సిన 5 రిస్కులు!
- ●Massive explosion on a railway track | ప్రయాణికుల రైలు వెళ్లిన కొద్దిసేపటికే.. రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు

Mallikarjun Kharge | సమాధానాలు లేకే.. దిమాగీ నక్సల్ నినాదాన్ని ఎత్తుకున్నారు : మోదీ, షాపై ఖర్గే విమర్శలు

KTR | భూములు అమ్ముకునే బ్రోకర్ రేవంత్ రెడ్డి

Stockal | స్టాక్ఏల్లో రూ.100 కోట్ల మోసం.. అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడుల పేరుతో కుచ్చు టోపీ..

Prashant Bhushan | సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై FIR నమోదు



