Stockal | స్టాక్‌ఏల్‌లో రూ.100 కోట్ల మోసం.. అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడుల పేరుతో కుచ్చు టోపీ..
Stockal | అమెరికా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన భారతీయ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తగిలింది. ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ స్టాక్‌ఏల్‌లో అనధికారిక లావాదేవీలు జరిగినట్లు సుమారు 30 మంది ఇన్వెస్టర్లు ఆరోపించారు. వారి పోర్ట్‌ఫోలియోల్లోని యాపిల్, ఎన్విడియా, అమెజాన్, టెస్లా వంటి ప్రముఖ కంపెనీల షేర్లను విక్రయించి, చైనాకు చెందిన ఒక మైక్రోక్యాప్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో నష్టాలు రూ.100 కోట్లకు పైగా ఉంటాయని అంచనా.
Stockal | అమెరికా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన భారతీయ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తగిలింది. ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ స్టాక్‌ఏల్‌లో అనధికారిక లావాదేవీలు జరిగినట్లు సుమారు 30 మంది ఇన్వెస్టర్లు ఆరోపించారు. వారి పోర్ట్‌ఫోలియోల్లోని యాపిల్, ఎన్విడియా, అమెజాన్, టెస్లా వంటి ప్రముఖ కంపెనీల షేర్లను విక్రయించి, చైనాకు చెందిన ఒక మైక్రోక్యాప్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో నష్టాలు రూ.100 కోట్లకు పైగా ఉంటాయని అంచనా.
అనధికార విక్రయాలు, కొనుగోళ్లు..
అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ ఇన్వెస్టర్లు ఉపయోగిస్తున్న స్టాక్‌ఏల్ ప్లాట్‌ఫామ్‌లో అనధికారిక ట్రేడింగ్ జరిగినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అక్టోబర్ 15న అమెరికా మార్కెట్ ట్రేడింగ్ సమయంలో ఈ లావాదేవీలు జరిగినట్లు సమాచారం. బాధితుల పోర్ట్‌ఫోలియోల్లో ఉన్న యాపిల్, ఎన్విడియా, అమెజాన్, టెస్లా, ఆల్ఫాబెట్, ఏఎండీ వంటి ప్రముఖ కంపెనీల షేర్లను విక్రయించి, ఆ డబ్బుతో అమెరికా నాస్‌డాక్‌లో లిస్టయిన చైనాకు చెందిన జిబావో టెక్నాలజీ (Zhibao Technology Inc.) షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. స్టాక్‌ఏల్ మాతృసంస్థ బోర్డర్‌లెస్ లింక్డ్‌ఇన్‌లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గుర్తుతెలియని మూడో వ్యక్తి సరైన లాగిన్ వివరాలను ఉపయోగించి 26 మంది కస్టమర్ల ఖాతాల్లోకి ప్రవేశించారని తేలింది. వీటిలో 13 ఖాతాల్లో అనధికారికంగా షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయి. అయితే ఈ లావాదేవీల ద్వారా ఎలాంటి నగదు ఉపసంహరణ జరగలేదని సంస్థ స్పష్టం చేసింది.
దర్యాప్తు చేయిస్తున్న సంస్థ..
ఈ ఘటనపై బోర్డర్‌లెస్ స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ నిపుణులతో దర్యాప్తు చేయిస్తోంది. తమ ప్లాట్‌ఫామ్, సాంకేతిక వ్యవస్థలు లేదా అంతర్గత సర్వర్లలో ఎలాంటి భద్రతా ఉల్లంఘన జరిగినట్లు ఆధారాలు లభించలేదని పేర్కొంది. కొన్ని వారాల క్రితం మరో సంస్థ డేటా లీక్ కావడంతో బయటపడిన వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి సోషల్ ఇంజినీరింగ్ లేదా ఫిషింగ్ దాడి ద్వారా ఇన్వెస్టర్ల ఖాతాలను యాక్సెస్ చేసి ఉంటారని అనుమానిస్తోంది. అయితే, ఈ అనుమానానికి ఇంకా నిర్ధారణ లభించలేదు. బాధిత ఖాతాలకు అదనపు భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు, డైవ్‌వెల్త్‌తో కలిసి లావాదేవీలపై విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
అసలు ఏం జరిగింది..?
మరోవైపు, ఈ వ్యవహారంలో స్టాక్‌ఏల్, డైవ్‌వెల్త్ సంస్థల మధ్య బాధ్యతలపై వివాదం నెలకొంది. తమ ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి భద్రతా లోపం లేదని స్టాక్‌ఏల్ చెబుతుండగా, బాధితుల ఈ-మెయిల్ ఖాతాలు లేదా లాగిన్ వివరాలు ఫిషింగ్ ద్వారా దుర్వినియోగమై ఉంటాయని పేర్కొంది. అయితే, అక్టోబర్ 30న బాధిత ఇన్వెస్టర్‌కు పంపిన లేఖలో డైవ్‌వెల్త్ ఈ ఆరోపణలను ఖండించింది. స్టాక్‌ఏల్ ఇంటర్‌ఫేస్ ద్వారానే అనధికారిక యాక్సెస్ జరిగిందని, భద్రతా లోపాలకు భారతీయ ప్లాట్‌ఫామ్‌దే బాధ్యతని ఆరోపించింది. అలాగే ప్రభావిత ఖాతాలను నిలిపివేయాలని స్టాక్‌ఏల్ సూచించిందని, కొన్ని సరిదిద్దే చర్యలను కూడా నిలిపివేసిందని పేర్కొంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు, నియంత్రణ సంస్థలకు సహకరిస్తున్నామని బోర్డర్‌లెస్ వెల్లడించింది. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Prashant Bhushan | సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై FIR నమోదు
- ●Virat Kohli | కోహ్లీ సరికొత్త చరిత్ర.. 13 వేల పరుగుల మార్కును దాటిన తొలి ఆటగాడిగా..
- ●US Stocks | అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులా? భారతీయులు తెలుసుకోవాల్సిన 5 రిస్కులు!
- ●Massive explosion on a railway track | ప్రయాణికుల రైలు వెళ్లిన కొద్దిసేపటికే.. రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు
- ●Gas Cylinder | దీపావళి కానుక.. ఆ లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్
- ●iPhone 16 | అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. ఉద్యోగులను ఐఫోన్లతో సర్ప్రైజ్ చేసిన సంస్థ

Prashant Bhushan | సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై FIR నమోదు

Virat Kohli | కోహ్లీ సరికొత్త చరిత్ర.. 13 వేల పరుగుల మార్కును దాటిన తొలి ఆటగాడిగా..

US Stocks | అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులా? భారతీయులు తెలుసుకోవాల్సిన 5 రిస్కులు!

Massive explosion on a railway track | ప్రయాణికుల రైలు వెళ్లిన కొద్దిసేపటికే.. రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు





