త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prashant Bhushan | సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌పై FIR నమోదు

Prashant Bhushan | రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌కు సంబంధించిన మార్ఫింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది (Supreme Court lawyer) ప్రశాంత్‌ భూషణ్ (Prashant Bhushan)పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

D

National | Published On Nov 4, 2026, 1.24 pm IST

Prashant Bhushan | సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌పై FIR నమోదు
Advertisement

Prashant Bhushan | త్రినేత్ర న్యూస్ : సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది (Supreme Court lawyer) ప్రశాంత్‌ భూషణ్ (Prashant Bhushan)పై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌కు సంబంధించిన మార్ఫింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు (Delhi Police) కేసు నమోదు చేశారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. అక్టోబర్ 31న జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్‌లు (Sergey Lavrov) భేటీ అయ్యారు. ఆ తర్వాత లావ్రోవ్ భారత్ అంతర్గత విషయాలు, రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై విమర్శలు చేసినట్లు ఏఐ ద్వారా రూపొందించిన‌ ఒక ఫేక్ వీడియోను ప్రశాంత్ భూషణ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. ఇది కాస్తా వైర‌ల్‌గా మార‌డంతో కేంద్రం ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఆ వీడియో పూర్తిగా నకిలీద‌ని కేంద్ర విదేశంగ మంత్రిత్వ శాఖ తేల్చింది. రష్యా రాయబార కార్యాలయం కూడా ఇది ఏఐ (AI) సాయంతో సృష్టించిన నకిలీ కంటెంట్ అని స్ప‌ష్టం చేసింది. దీంతో వీడియోపై వివాదం చెల‌రేగడంతో ఆ పోస్టును ఆయ‌న తొల‌గించారు.

నవంబర్ 3న సైబర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న స‌మ‌యంలో @thequotesnews అనే సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఫేక్ వీడియోని ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ గుర్తించింది. వీడియోలో తప్పుదోవ పట్టించే, రెచ్చగొట్టే కంటెంట్ ఉన్న‌ట్లు గుర్తించింది. దీనిపై సుమోటోగా స్పందించి కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read..

ప్ర‌యాణికుల రైలు వెళ్లిన కొద్దిసేప‌టికే.. రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు

అదిరిపోయే దీపావ‌ళి గిఫ్ట్.. ఉద్యోగుల‌ను ఐఫోన్లతో స‌ర్‌ప్రైజ్ చేసిన‌ సంస్థ‌

నేను బ్యాలెట్‌లో లేను.. లేదంటే.. ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ట్రంప్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌

ట్యాగ్స్:

Delhi PoliceFIR Against Prashant BhushanPrashant BhushanRussian Foreign Minister Sergey LavrovSergey LavrovSupreme CourtSupreme Court Lawyer
Advertisement
Advertisement