US Stocks | అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులా? భారతీయులు తెలుసుకోవాల్సిన 5 రిస్కులు!
US Stocks | అమెరికా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో భాగస్వాములు కావచ్చు. అయితే షేర్ల ధరల్లో మార్పులతోపాటు రూపాయి-డాలర్ మారకపు విలువ, సైబర్ భద్రత, బ్రోకరేజ్ సంస్థల విశ్వసనీయత, మార్కెట్ ఒడిదుడుకులు, పన్నుల నిబంధనలు వంటి ఐదు ప్రధాన రిస్కులను భారతీయ ఇన్వెస్టర్లు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. స్టాక్ఆల్ ట్రేడింగ్ మోసం ఆరోపణలు విదేశీ పెట్టుబడుల్లో అప్రమత్తత అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి.
US Stocks | అమెరికా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో భాగస్వాములు కావచ్చు. అయితే షేర్ల ధరల్లో మార్పులతోపాటు రూపాయి-డాలర్ మారకపు విలువ, సైబర్ భద్రత, బ్రోకరేజ్ సంస్థల విశ్వసనీయత, మార్కెట్ ఒడిదుడుకులు, పన్నుల నిబంధనలు వంటి ఐదు ప్రధాన రిస్కులను భారతీయ ఇన్వెస్టర్లు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. స్టాక్ఆల్ ట్రేడింగ్ మోసం ఆరోపణలు విదేశీ పెట్టుబడుల్లో అప్రమత్తత అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి.
సైబర్ భద్రత తప్పనిసరి..
భారతీయులు అమెరికా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. యాపిల్, ఎన్విడియా, అమెజాన్, టెస్లా వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టే అవకాశం లభిస్తున్నప్పటికీ, ఈ విధానంలో కొన్ని కీలకమైన ప్రమాదాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ స్టాక్ఆల్ సెక్యూరిటీస్‌కు సంబంధించిన సుమారు రూ.100 కోట్ల ట్రేడింగ్ మోసం ఆరోపణలు ఈ అంశాన్ని మరోసారి చర్చనీయాంశంగా మార్చాయి. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. సుమారు 30 మంది భారతీయ ఇన్వెస్టర్లు తమ అనుమతి లేకుండానే అమెరికా షేర్లను విక్రయించి, ఆ మొత్తంతో జిబావో టెక్నాలజీ అనే చైనా కంపెనీ షేర్లను కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. మొదటిది ప్లాట్‌ఫామ్, సైబర్ భద్రత రిస్క్. ఫిషింగ్, ఈ-మెయిల్ ఖాతాల హ్యాకింగ్, లాగిన్ వివరాల చోరీ వంటి కారణాలతో అనధికార లావాదేవీలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, తక్షణ ట్రేడ్ అలర్ట్స్, లాగిన్ నోటిఫికేషన్లు వంటి భద్రతా సదుపాయాలు ఉన్నాయో లేదో పరిశీలించాలి.
ఆర్థిక ఇబ్బందుల్లో పడితే పరిస్థితి ఏమిటి..?
రెండోది కస్టడీ, కౌంటర్పార్టీ రిస్క్. విదేశీ షేర్ల పెట్టుబడుల్లో భారతీయ ప్లాట్‌ఫామ్‌తోపాటు విదేశీ బ్రోకర్, క్లియరింగ్ సంస్థ, కస్టోడియన్ వంటి పలు సంస్థలు భాగస్వాములుగా ఉంటాయి. అసలు షేర్లను ఎవరు కలిగి ఉన్నారు? ఏ సంస్థ పేరుతో రిజిస్టర్ అయ్యాయి? బ్రోకర్ లేదా ప్లాట్‌ఫామ్ ఆర్థిక ఇబ్బందుల్లో పడితే పెట్టుబడుల పరిస్థితి ఏమిటి? వంటి అంశాలను ముందుగానే తెలుసుకోవాలి. మూడోది కరెన్సీ, మారకపు విలువ రిస్క్. అమెరికా షేర్లలో వచ్చే లాభాలు కేవలం వాటి ధరలపై మాత్రమే ఆధారపడవు. రూపాయి-డాలర్ మారకపు విలువ కూడా తుది రాబడిని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడితే అమెరికా షేర్ల ధర మారకపోయినా, వాటిని రూపాయల్లోకి మార్చినప్పుడు పెట్టుబడి విలువ తగ్గుతుంది. రూపాయి బలహీనపడితే మాత్రం అదనపు రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి తోడు కరెన్సీ మార్పిడి ఛార్జీలు, విదేశాలకు నగదు పంపించే ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
మార్కెట్ నష్టాల నుంచి రక్షణ ఉండదు..
నాలుగోది మార్కెట్ ఒడిదుడుకులు, లిక్విడిటీ రిస్క్. అమెరికాలో పేరున్న కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టినా మార్కెట్ నష్టాల నుంచి రక్షణ ఉండదు. వడ్డీ రేట్లు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆర్థిక గణాంకాలు షేర్ల ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా తక్కువ ట్రేడింగ్ జరిగే చిన్న కంపెనీల షేర్లను అవసరమైన సమయంలో ఆశించిన ధరకు విక్రయించడం కష్టమవుతుంది. ఐదోది నియంత్రణ, పన్నుల అనుసరణ రిస్క్. భారతీయ నివాసితులు విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) నిబంధనలు వర్తిస్తాయి. దీని ప్రకారం అనుమతించిన లావాదేవీల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 2.5 లక్షల డాలర్ల వరకు విదేశాలకు పంపించవచ్చు. అలాగే విదేశీ షేర్లు, డిపాజిటరీ ఖాతాలు, కస్టోడియన్ ఖాతాలు, విదేశీ ఆదాయానికి సంబంధించిన వివరాలను ఆదాయపు పన్ను రిటర్నుల్లోని షెడ్యూల్ ఎఫ్ఏలో వెల్లడించాల్సిన బాధ్యత ఉంటుంది.
నిబంధనలను పరిశీలించాలి..
అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత ప్లాట్‌ఫామ్‌కు ఉన్న నియంత్రణ అనుమతులు, విదేశీ బ్రోకర్ వివరాలు, కస్టోడియన్ సంస్థ విశ్వసనీయత, పెట్టుబడిదారులకు వర్తించే రక్షణ నిబంధనలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. అనధికార లావాదేవీలు జరిగితే ఫిర్యాదు చేసే విధానం, వాటిపై చర్యలు తీసుకునే సమయం గురించి కూడా ముందుగానే తెలుసుకోవాలి. అమెరికాలోని సెక్యూరిటీస్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కార్పొరేషన్ (ఎస్ఐపీసీ) రక్షణ కూడా అన్ని రకాల నష్టాలకు వర్తించదు. ఎస్ఐపీసీ సభ్యత్వం ఉన్న బ్రోకరేజ్ సంస్థల వద్ద అర్హత కలిగిన ఆస్తులకు మాత్రమే నిర్దిష్ట పరిస్థితుల్లో రక్షణ లభిస్తుంది. బ్రోకర్ విఫలమైనప్పుడు ఏర్పడే కొన్ని నష్టాలకు మాత్రమే ఈ రక్షణ వర్తిస్తుంది. మార్కెట్లో షేర్ల ధరలు పడిపోవడం వల్ల కలిగే నష్టాలకు మాత్రం ఎలాంటి రక్షణ ఉండదని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Massive explosion on a railway track | ప్రయాణికుల రైలు వెళ్లిన కొద్దిసేపటికే.. రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు
- ●Gas Cylinder | దీపావళి కానుక.. ఆ లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్
- ●iPhone 16 | అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. ఉద్యోగులను ఐఫోన్లతో సర్ప్రైజ్ చేసిన సంస్థ
- ●IRDAI | వాహనదారులకు భారీ ఊరట.. కావల్సిన ఇన్సూరెన్స్ ను ఎంచుకోవచ్చు..
- ●Jeevan Reddy | తెలంగాణకు పట్టిన శని రేవంత్ రెడ్డి.. మూడేండ్లలో రెండు పిల్లర్లకు మరమ్మతులు కూడా చేయలే: జీవన్ రెడ్డి
- ●Donald Trump | నేను బ్యాలెట్లో లేను.. లేదంటే.. ఎన్నికల ఫలితాలపై ట్రంప్ ఆసక్తికర పోస్ట్

Massive explosion on a railway track | ప్రయాణికుల రైలు వెళ్లిన కొద్దిసేపటికే.. రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు

Gas Cylinder | దీపావళి కానుక.. ఆ లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్

iPhone 16 | అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. ఉద్యోగులను ఐఫోన్లతో సర్ప్రైజ్ చేసిన సంస్థ

IRDAI | వాహనదారులకు భారీ ఊరట.. కావల్సిన ఇన్సూరెన్స్ ను ఎంచుకోవచ్చు..






