త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | భూములు అమ్ముకునే బ్రోక‌ర్ రేవంత్ రెడ్డి

KTR | భూములు అమ్ముకునే బ్రోక‌ర్ రేవంత్ రెడ్డిని సీఎం చేశారు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క.. సినీ న‌టులు క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌ను మించి ఎన్నిక‌ల్లో న‌టించార‌ని విమ‌ర్శించారు.

S

Hyderabad | Published On Nov 4, 2026, 2.25 pm IST

KTR | భూములు అమ్ముకునే బ్రోక‌ర్ రేవంత్ రెడ్డి
Advertisement

భ‌ట్టి విక్ర‌మార్క‌.. క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌ను మించి న‌ట‌న‌
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు

KTR | త్రినేత్ర న్యూస్ : భూములు అమ్ముకునే బ్రోక‌ర్ రేవంత్ రెడ్డిని సీఎం చేశారు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క.. సినీ న‌టులు క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌ను మించి ఎన్నిక‌ల్లో న‌టించార‌ని విమ‌ర్శించారు. శేరిలింగంప‌ల్లి నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిక‌ల సంద‌ర్భంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.

కాంగ్రెస్ వాళ్లు కహానీలు చెప్పారు. ఇంటింటికి గ్యారెంటీ కార్డులు పంచారు. అయినా కూడా హైదరాబాద్ నగరంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. రేవంత్ రెడ్డికి లొల్లి, కొవ్వు ఎక్కువ. మియాపూర్‌లో 550 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టులో తీర్పు వస్తే ఆ భూమిని అమ్ముతా అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి సోదరుడు, మంత్రులు వివేక్ వెంక‌ట‌స్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చెరువు శిఖంలో ఇళ్ళు కట్టుకోవచ్చు. హైడ్రాతో ఎవరికి ఉపయోగం జరిగింది. భూముల విలువ పడిపోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు.

హిల్ట్ పాలసీలో భూములు కొంటే ఇబ్బందులు తప్పవు

హిల్ట్ పాలసీ పేరుతో రేవంత్ రెడ్డి లావాదేవీలు చేసుకుని 10 వేల ఎకరాలు అమ్మాలనే కుట్ర చేస్తున్నారు. ఎర్రవెల్లిలో అమరవీరులకు ఇల్లు కట్టిస్తా అని సీఎం అంటున్నారు. అమరవీరుల కుటుంబాలకు మియాపూర్‌లో ఇల్లు కట్టి ఇవ్వు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరైనా పారిశ్రామికవేత్తలు రేవంత్ రెడ్డి ఉచ్చులో పడి హిల్ట్ పాలసీలో భూములు కొంటే ఇబ్బందులు తప్పవు. సంవ‌త్స‌రంలోగా కేసీఆర్ సీఎం కాబోతున్నారు. హిల్ట్ పాలసీ భూములకు చెక్ పెడతాం. హౌసింగ్ బోర్డు భూములు, వక్ఫ్ భూములు రేవంత్ రెడ్డి అమ్ముతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

ఢిల్లీ పార్టీల వద్ద మన వాళ్లకు ఉన్న విలువ ఇది

బండి సంజయ్ కరీంనగర్ ఇజ్జత్ తీస్తున్నారు. బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి అనే సోయి లేదు. రేవంత్ రెడ్డిని ప్రియాంక గాంధీ సెక్యురిటీ తోసివేశారు. ఢిల్లీ పార్టీల వద్ద మన వాళ్లకు ఉన్న విలువ ఇది. ఢిల్లీ వాళ్ళతో తెలంగాణకు ఉపయోగం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద‌ర్ రావు అమిత్ షా కాళ్ళు మొక్కారు. అమిత్ షా తెలంగాణకు వచ్చి చేతులు ఊపి వెళ్లారు. కాంగ్రెస్ ఢిల్లీకి సంచులు మోసే పార్టీ.. బీజేపీ ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీ అని కేటీఆర్ విమ‌ర్శించారు.

ట్యాగ్స్:

Bhatti VikramarkaCM Revanth ReddyCongress GovtKTRSherilingampallyTelangana
Advertisement
Advertisement