త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaibhav Suryavanshi | వైభ‌వ్ సూర్య‌వంశీకి జాతీయ బాల‌ల పుర‌స్కారం

Vaibhav Suryavanshi | క్రికెట్ (Cricket) సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Suryavanshi) కి కేంద్రం (Indian Government) ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ – 2025 (Pradhan Mantri Rashtriya Bal Puraskar) ను ప్రదానం చేసింది. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) న్యూ ఢిల్లీ (New Delhi)లోని రాష్ట్రపతి భవన్‌ (Rashtrapati Bhavan)లో జరిగిన వేడుకలో అందజేశారు.

A

Sports | Published On Dec 26, 2025, 1.13 pm IST

Vaibhav Suryavanshi | వైభ‌వ్ సూర్య‌వంశీకి జాతీయ బాల‌ల పుర‌స్కారం
Advertisement

Vaibhav Suryavanshi | క్రికెట్ (Cricket) చిచ్చ‌ర‌పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Suryavanshi) కి భార‌త ప్రభుత్వం (Indian Government) ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ – 2025 (Pradhan Mantri Rashtriya Bal Puraskar) ను ప్రదానం చేసింది. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) న్యూ ఢిల్లీ (New Delhi)లోని రాష్ట్రపతి భవన్‌ (Rashtrapati Bhavan)లో జరిగిన వేడుకలో అందజేశారు. క్రికెట్‌లో ప‌ద్నాలుగేళ్ల వ‌య‌సులోనే అద్భుతాలు సృష్టిస్తున్న వైభ‌వ్ ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 84 బంతుల్లో 190 పరుగులు చేసి, సంచ‌ల‌నం సృష్టించాడు. అతని దూకుడైన బ్యాటింగ్, స్థిరమైన ప్రదర్శన కారణంగా జాతీయ స్థాయి గుర్తింపు పొందాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్, అత్యధిక స్ట్రైక్ రేట్‌(206.55) సాధించి “సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్” అవార్డును కూడా గెలుచుకున్నాడు. సీనియర్ స్టార్ బ్యాటర్లను మించిపోయిన ఈ చిన్న వయస్కుడి ప్రతిభపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం ఈ బాల అవార్డు విజేతలతో భేటీ కానున్నారు. వైభవ్ స్వస్థలం బీహార్‌లోని సమస్తిపూర్. అక్క‌డ వైభ‌వ్‌కు అవార్డు రావ‌డం ప‌ట్ల ఘ‌నంగా వేడుక‌లు జరుపుకుంటున్నారు. చిన్న వయసులోనే ఇంతటి ఘనత సాధించిన వైభవ్ ఇప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తుగా మారాడని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement