త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rising Stars Asia Cup | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 53 బంతుల్లో 204 పరుగులు..!

Rising Stars Asia Cup | రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత యువ జట్టు సంచలనం సృష్టించింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. యువ కెర‌టం వైభవ్ సూర్యవంశీ కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులతో చెలరేగడంతో భారత్-ఏ ఘన విజయం సాధించింది.

P

Sports | Published On Nov 24, 2026, 6.33 pm IST

Rising Stars Asia Cup | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 53 బంతుల్లో 204 పరుగులు..!
Advertisement

Rising Stars Asia Cup | రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత యువ జట్టు సంచలనం సృష్టించింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. యువ కెర‌టం వైభవ్ సూర్యవంశీ కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులతో చెలరేగడంతో భారత్-ఏ ఘన విజయం సాధించింది. దీంతో టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన నాలుగు జట్లూ ఖరారయ్యాయి. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో సెమీఫైనల్ బెర్తులన్నీ ఖరారయ్యాయి. మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి చివరి నాలుగు జట్లలో చోటు దక్కించుకుంది. ఇప్పటికే శ్రీలంక-ఎ, బంగ్లాదేశ్-ఎ, పాకిస్థాన్-ఎ జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించగా.. తాజాగా భారత్-ఎ కూడా వాటి సరసన చేరింది.

చెల‌రేగిన వైభ‌వ్‌

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. హర్‌ప్రీత్ సింగ్ భాటియా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 130 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ ముందు 250 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో భారత్-ఏకు యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. యూఏఈ బౌలర్లపై విరుచుకుపడిన ఈ యువ సంచలనం బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 28 సిక్సర్లు ఉండ‌డం విశేషం. వైభవ్ విధ్వంసంతో యూఏఈ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు.

14.2 ఓవర్లలోనే లక్ష్యం చేరిన భార‌త్‌

వైభవ్ సూర్యవంశీ వీరవిహారంతో భారత్-ఏ కేవలం 14.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 254 పరుగులు సాధించింది. దీంతో మరో 35.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 250 పరుగుల లక్ష్యాన్ని ఇంత తక్కువ సమయంలో ఛేదించడం మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్-ఏ సెమీఫైనల్‌కు అర్హత సాధించడంతో రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో టైటిల్ వేట కొనసాగించనున్న నాలుగు జట్లు ఖరారయ్యాయి. భారత్-ఎతో పాటు శ్రీలంక-ఏ, బంగ్లాదేశ్-ఏ, పాకిస్థాన్-ఏ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఇక సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా ఈ జట్లు బరిలోకి దిగనున్నాయి. యూఏఈపై భారత్ సాధించిన భారీ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచగా.. వైభవ్ సూర్యవంశీ అసాధారణ ఇన్నింగ్స్ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది.

Advertisement
Advertisement