Vaibhav Suryavanshi | టెన్త్ క్లాస్ పరీక్షలు రాయబోతున్న చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ.. ఎక్కడంటే..?
Vaibhav Suryavanshi | ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌లో సంచలన ప్రదర్శనతో భారత యువ జట్టుకు ఆరో టైటిల్ అందించిన తర్వాత, స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన ప్రపంచంలో అడుగుపెట్టబోతున్నాడు. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై అతను ఆడిన అద్భుతమైన 175 పరుగుల ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
Vaibhav Suryavanshi | ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌లో సంచలన ప్రదర్శనతో భారత యువ జట్టుకు ఆరో టైటిల్ అందించిన తర్వాత, స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన ప్రపంచంలో అడుగుపెట్టబోతున్నాడు. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై అతను ఆడిన అద్భుతమైన 175 పరుగుల ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ క్రమంలోనే వైభవ్‌కు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో కావల్సిన స్టార్ డమ్ వచ్చేసింది. అయితే ప్రస్తుతానికి అతని వయస్సు 14 ఏళ్లే. ఇంకా స్కూల్ పరీక్షలను కూడా రాయలేదు. దీంతో అతను ఇప్పుడు చదువుపై ఫోకస్ పెట్టనున్నాడు. వైభవ్ త్వరలోనే 10వ తరగతి బోర్డు పరీక్షలు రాయనున్నాడు. సమస్తిపూర్‌లోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ నీల్ కిశోర్ మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ త్వరలో 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నాడని తెలిపారు. అయితే క్రికెట్ స్టార్ అయినప్పటికీ అతడికి ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవని, ఇతర విద్యార్థుల్లాగే పరీక్షలు రాయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
అందరికీ సమానంగానే సౌకర్యాలు: ప‌్రిన్సిపాల్
క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తమ పాఠశాలలో 10వ తరగతి బోర్డు పరీక్షలు రాయబోతున్నాడని నీల్ కిశోర్ తెలిపారు. వైభవ్‌కి హాల్ టికెట్ కూడా అందిందని, అతని రాకపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులలో ఉత్సాహం నెలకొందన్నారు. అయినప్పటికీ ఇది క్రికెట్ పిచ్ కాదు, అకడమిక్ పిచ్. పరీక్షల సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. భద్రత, సౌకర్యాలు అందరికీ సమానంగా ఉంటాయి. పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయి.. అని నీల్ కిశోర్ తెలిపారు.
ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్..
కాగా ఇటీవల హరారేలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ టోర్నమెంట్ చరిత్రలోనే గుర్తుండిపోయేలా నిలిచింది. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసిన వైభవ్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో అతను ఒక అండర్-19 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ టోర్నమెంట్ మొత్తంలో వైభవ్ 7 మ్యాచ్‌ల్లో 439 పరుగులు సాధించి, సగటు 62.71, స్ట్రైక్‌రేట్ 169.49తో రెండో అత్యధిక రన్‌గెటర్‌గా నిలిచాడు. ఒక శతకం, మూడు అర్ధశతకాలు సాధించిన అతని అత్యుత్తమ స్కోరు 175. టోర్నమెంట్‌లో మొత్తం 30 సిక్సులు బాదగా, 2022 ఎడిషన్‌లో డెవాల్డ్ బ్రేవిస్ కొట్టిన 18 సిక్సుల రికార్డును వైభవ్ అధిగమించాడు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా కూడా అతనికి రికార్డు ఉంది.
ఇక వైభవ్ సూర్యవంశీ పరీక్షలను ముగించుకున్న అనంతరం త్వరలో జరగనున్న ఐపీఎల్ 2026 ఎడిషన్‌లో పాల్గొననున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న వైభవ్ గత సీజన్‌లోనే మేటి అంతర్జాతీయ బౌలర్లకు సైతం చుక్కలు చూపించాడు. అయితే వైభవ్ ప్రస్తుతం టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తుండడంతో అతను హాజరు కానున్న స్కూల్‌లో సందడి నెలకొంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






