Shubman Gill | సలైవా వాడకంపై బ్యాన్ ఎత్తేయండి.. ఐసీసీకి గిల్ రిక్వెస్ట్..!
Shubman Gill | అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనలపై టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బంతిని మెరిపించేందుకు సలైవా (ఉమ్మి)ని ఉపయోగించడంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుత కూకబుర్రా బంతులు చాలా త్వరగా మెత్తబడుతున్నాయని, దీనివల్ల బౌలర్లు వికెట్లు తీయడం కష్టంగా మారుతోందని అభిప్రాయపడ్డాడు.
Shubman Gill | అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనలపై టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బంతిని మెరిపించేందుకు సలైవా (ఉమ్మి)ని ఉపయోగించడంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుత కూకబుర్రా బంతులు చాలా త్వరగా మెత్తబడుతున్నాయని, దీనివల్ల బౌలర్లు వికెట్లు తీయడం కష్టంగా మారుతోందని అభిప్రాయపడ్డాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసిన అనంతరం గిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
కోవిడ్ నాటి నిబంధన ఇంకా అవసరమా?
కరోనా మహమ్మారి సమయంలో ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా బంతిపై ఉమ్మి రుద్దడాన్ని ఐసీసీ నిషేధించింది. కరోనా పరిస్థితులు ముగిసి చాలా కాలమే అయినప్పటికీ ఆ నిబంధనను కొనసాగించడంపై గిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'కోవిడ్ కాలం నుంచి మనం చాలా ముందుకొచ్చాం. బంతిని మెరిపించేందుకు సలైవా ఉపయోగించకూడదనే నిబంధన అప్పట్లో తీసుకొచ్చారు. ఏడెనిమిదేళ్లు గడిచిపోయాయి. అయినా ఆ నిషేధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదు. మేం తీసుకున్న కొత్త బంతి 25-30 ఓవర్లకే మెత్తబడిపోయింది. న్యూజిలాండ్ జట్టు కూడా ఇదే విషయంపై ఫిర్యాదు చేసినట్లు గుర్తు. ఇంగ్లండ్‌లోనూ ఇలాంటి పరిస్థితినే చూశాం' అని గిల్ పేర్కొన్నాడు.
కూకబుర్రా బంతుల నాణ్యతపై ప్రశ్నలు
ప్రస్తుతం ఉపయోగిస్తున్న కూకబుర్రా బంతుల నాణ్యతపైనా గిల్ సందేహాలు వ్యక్తం చేశాడు. బంతి త్వరగా మెత్తబడిపోవడం వల్ల బ్యాటర్ ఎడ్జ్ తీసుకునే అవకాశాలు తగ్గుతున్నాయని తెలిపాడు. దీంతో వికెట్ కీపర్, స్లిప్ ఫీల్డర్లకు క్యాచ్‌లు అందడం కూడా కష్టమవుతోందని వివరించాడు. 'బంతుల నాణ్యత తగ్గిందో.. మరేదైనా కారణమో తెలియదు. పిచ్ నుంచి బౌలర్లకు ఎలాంటి సహకారం లభించనప్పుడు, బంతి కూడా త్వరగా మెత్తబడిపోతే వికెట్లు తీయడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి బంతులతో బ్యాట్ ఎడ్జ్ తీసుకునే అవకాశాలు తక్కువ. దీంతో వికెట్ కీపర్‌కు లేదంటే స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. పిచ్ సహకరించకపోతే ఎల్బీడబ్ల్యూ ద్వారా వికెట్లు తీయడం కూడా అంత సులభం కాదు' అని గిల్ అభిప్రాయపడ్డాడు.
బౌలర్లకు అనుకూలంగా నిబంధనలు మార్చాలి
బంతిని ఎక్కువసేపు గట్టిగా, మెరుపుతో ఉంచేందుకు ఉమ్మి వినియోగానికి అనుమతించాలని గిల్ సూచించాడు. కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన నిబంధనను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నాడు. పిచ్‌ల నుంచి బౌలర్లకు సహకారం తగ్గుతున్న తరుణంలో బంతి నాణ్యత కూడా దెబ్బతింటే మ్యాచ్‌లు బ్యాటర్లకు మరింత అనుకూలంగా మారతాయని పరోక్షంగా పేర్కొన్నాడు. కాగా, భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 352 పరుగుల ఆధిక్యం సాధించినప్పటికీ మ్యాచ్‌ను గెలవలేకపోయింది. పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లభించకపోవడంతో న్యూజిలాండ్ జట్టు మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఈ నేపథ్యంలో గిల్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●West Bengal Renamed Paschim Banga | వెస్ట్ బెంగాల్ ఇకపై 'పశ్చిమ బంగ'.. డిసెంబర్ 9న అసెంబ్లీలో కీలక తీర్మానం
- ●Bhatti Vikramarka | పార్టీలో విభేదాలేం లేవ్.. ఊహాజనిత ప్రచారాలను పట్టిచ్చుకోం
- ●Niharika Konidela | మెగా డాటర్ నిహారిక కొణిదెల కొత్త బిజినెస్
- ●Bandi Sanjay | మోదీ నిప్పులాంటోడు.. టచ్ చేస్తే మాడి మసైపోతావ్..
- ●Ayodhya To Janakpur | ఇక అయోధ్య నుంచి జనక్పూర్కి నేరుగా రైలు సర్వీసు.. కీలక వివరాలు ఇవే
- ●Telangana Gold Man IT Raid | తెలంగాణ 'గోల్డ్ మ్యాన్' కేసులో ఐటీ శాఖ కొరడా: రాయదుర్గంలో రూ.3.2 లక్షల అద్దె వచ్చే బినామీ భవనం అటాచ్

West Bengal Renamed Paschim Banga | వెస్ట్ బెంగాల్ ఇకపై 'పశ్చిమ బంగ'.. డిసెంబర్ 9న అసెంబ్లీలో కీలక తీర్మానం

Bhatti Vikramarka | పార్టీలో విభేదాలేం లేవ్.. ఊహాజనిత ప్రచారాలను పట్టిచ్చుకోం

Niharika Konidela | మెగా డాటర్ నిహారిక కొణిదెల కొత్త బిజినెస్

Bandi Sanjay | మోదీ నిప్పులాంటోడు.. టచ్ చేస్తే మాడి మసైపోతావ్..






