త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tilak and Nitish Speak in Telugu | నువ్వు కాల్ ఇవ్వ‌లే.. రెండు అని చెప్పురా పోనీ.. తెలుగులో మాట్లాడి మ్యాచ్ గెలిపించిన తిల‌క్‌-నితిశ్‌

Tilak and Nitish Speak in Telugu | న్యూజిలాండ్‌తో రెండో టీ20 క్రికెట్ మ్యాచ్ సంద‌ర్భంగా తెలుగు కుర్రాళ్లు తిల‌క్‌వ‌ర్మ‌ (Tilak Varma), నితిశ్‌కుమ‌ర్ (Nitish Kumar) తెలుగులో మాట్లాడారు. వారి సంభాష‌ణ ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ఇంత‌కీ ఏం మాట్లాడారంటే!

S

Sports | Published On Oct 24, 2026, 7.04 pm IST

Tilak and Nitish Speak in Telugu | నువ్వు కాల్ ఇవ్వ‌లే.. రెండు అని చెప్పురా పోనీ.. తెలుగులో మాట్లాడి మ్యాచ్ గెలిపించిన తిల‌క్‌-నితిశ్‌
Advertisement
  • న్యూజిలాండ్‌తో రెండో టీ20 క్రికెట్ మ్యాచ్ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

Tilak and Nitish Speak in Telugu | త్రినేత్ర న్యూస్: క్రికెట్ అంటేనే ఇంగ్లిష్ కామెంట‌రీ, ఇంగ్లిష్‌లో మాట్లాడుకోవ‌డం స‌ర్వ సాధార‌ణం. మీడియా ముందైనా, మ్యాచ్ మ‌ధ్య‌లో అయిన ఇంగ్లిష్‌లోనే డిస్క‌ష‌న్ న‌డుస్త‌ది. ఏ దేశ ఆట‌గాళ్లైనా అంతే. కానీ తెలుగు కుర్రాళ్లు తిల‌క్‌వ‌ర్మ‌, నితిశ్‌కుమార్‌రెడ్డి న్యూజిలాండ్ గ‌డ్డపై తెలుగులో మాట్లాడుతూ ఏకంగా మ్యాచ్‌నే గెలిపించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఈ క‌న్వ‌ర్జేష‌న్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ‌ వైర‌ల‌వుతోంది. ఆ సంభాష‌ణ వారి మాట‌ల్లోనే..

తిలక్- నువ్వు కాల్ ఇవ్వలేదు.. నేన్ స‌గం దూరం వ‌చ్చేశా
నితీశ్‌ - నువ్వు వచ్చేసేయ్.. నేను వచ్చేస్తా ఆరాంసే
తిలక్- రేయ్ రెండు అని చెప్పురా పోనీ.. నేన్ ముందుకొచ్చి వెయిట్ చేస్తున్నా నీ కోసం.. అంటూ తెలుగులో మాట్లాడుకున్న మాట‌లు ప్ర‌స్తుతం వైర‌ల‌వుతోన్నాయి. తెలుగోళ్ల దెబ్బ‌కు న్యూజిలాండ్ ప‌రిస్థితి అబ్బ అయింద‌ని పలువురు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌ న‌రాలు తెగే ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాళ్లు ఔరా అనిపించారు. ఒకానొక ద‌శ‌లో స్కోరు బోర్డు 70 ప‌రుగుల్లో ఉండ‌గానే భార‌త్‌ ఐదు కీల‌క వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో క్రీజులోకి వ‌చ్చిన తిలక్ - నితీశ్ (Tilak - Nitish) మాత్రం పట్టు విడవలేదు. అడపాదడపా బౌండరీలు బాదుతూనే డబుల్స్ ఎక్కువగా తీశారు. తిలక్‌ తన అర్ధ శతకం పూర్తి చేసుకున్న త‌ర్వాత‌ ఆఖరి మూడు ఓవర్లలో భారత్‌కు 46 పరుగులు అవసరం అయింది. డఫీ వేసిన 18వ ఓవర్‌లో 17 పరుగులు పిండుకొని.. నాథన్‌ స్మిత్ వేసిన 19వ ఓవర్‌లో 18 పరుగులు రాబట్టడంతో భారత్‌ సమీకరణం కాస్త‌ తేలికైంది. చివరి ఓవర్‌లో 11 పరుగులు కావాల్సి ఉండ‌గా మరో బంతి మిగిలి ఉండగానే భారత్‌ విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అంత‌కుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయ‌గ‌లిగింది. అనంతరం టీమ్‌ఇండియా 6 వికెట్లను కోల్పోయి 19.5 ఓవర్లలో 181 లక్ష్యాన్ని ఛేదించి విజయం సొంతం చేసుకుంది.

Advertisement
Advertisement