KRMB | మహారాష్ట్రకు సీఎం రేవంత్.. 26న జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా
KRMB | ఈ నెల 26న జరగాల్సిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు( KRMB ) సమావేశం వాయిదా పడింది. తెలంగాణ( Telangana ), ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల్లో వాటా, ఇతర అంశాలపై చర్చించేందుకు 26న కేఆర్ఎంబీ 21వ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
KRMB | త్రినేత్ర న్యూస్ : ఈ నెల 26న జరగాల్సిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు( KRMB ) సమావేశం వాయిదా పడింది. తెలంగాణ( Telangana ), ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల్లో వాటా, ఇతర అంశాలపై చర్చించేందుకు 26న కేఆర్ఎంబీ 21వ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై చర్చించేందుకు మహారాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారు. దీంతో సీఎం వెంట తాము కూడా వెళ్లాల్సి ఉంటుందని, కేఆర్ఎంబీ బోర్డు సమావేశానికి హాజరు కావడం వీలుకాదని తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ తెలిపారు. ఈ మేరకు ఆయన కేఆర్ఎంబీకి లేఖ రాశారు. సోమవారం తలపెట్టిన సమావేశం వాయిదా వేయాలని కోరారు. తెలంగాణ విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వాయిదా వేసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు... తదుపరి సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారం అందించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్లో 774 మంది న్యాయవాదులుగా నమోదు
- ●Raashi Khanna | సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ సెట్స్‌లో రాఖీఖన్నా - ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●Gajwel SI Mallareddy | రైతుపై దాడి.. గజ్వేల్ ఎస్ఐ మల్లారెడ్డిపై వేటు
- ●Raithu Garjana Sabha | నవంబర్ 1న బీఆర్ఎస్ రైతు గర్జన సభ
- ●Sobhita Dhulipala | భర్తతో బాక్సాఫీస్ ఫైట్ - అక్కినేని కోడలి తమిళ మూవీ రిలీజ్ డేట్ ఇదేనా?
- ●Jagadeesh Reddy | ఎవన్ని గుంజకు కట్టేయాల్నో.. కోదండం ఎక్కియాల్నో ప్రజలే చెప్తరు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్లో 774 మంది న్యాయవాదులుగా నమోదు

Raashi Khanna | సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ సెట్స్‌లో రాఖీఖన్నా - ఫొటోలపై ఓ లుక్కేయండి!

Gajwel SI Mallareddy | రైతుపై దాడి.. గజ్వేల్ ఎస్ఐ మల్లారెడ్డిపై వేటు

Raithu Garjana Sabha | నవంబర్ 1న బీఆర్ఎస్ రైతు గర్జన సభ






