Minister Seethakka | ఎల్ నినో ఎఫెక్ట్.. ఏడాది పొడవునా కూలీలకు ఉపాధి కల్పించాలి
Minister Seethakka | ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడి, వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, శాశ్వత గ్రామీణ ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనపై మంత్రి సీతక్క సమీక్ష
Minister Seethakka | త్రినేత్ర న్యూస్ : ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడి, వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, శాశ్వత గ్రామీణ ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వీబీ-జీ రామ్ జీ పథకం కింద అనుమతించిన 370 రకాల పనులను ప్రాధాన్యత క్రమంలో విభజించి, స్థానిక అవసరాలకు అనుగుణంగా దశలవారీగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అన్ని పనులను ఒకేసారి చేపట్టకుండా, ఏడాది పొడవునా కూలీలకు ఉపాధి లభించేలా ఎనిమిది నెలల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు.
డీఆర్డీఓలపై మంత్రి ఆగ్రహం
ఎల్‌నినో నేపథ్యంలో వీబీ-జీ రామ్ జీ పథకం అమలు, ఉపాధి హామీ పనుల పురోగతిపై మంత్రి శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచని డీఆర్డీఓలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతి కనిపించాలని, కేవలం సమాధానాలు చెప్పి తప్పించుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 30వ తేదీ నాటికి మండలస్థాయి సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో పనుల ప్రణాళికలను పూర్తి చేయాలని, నవంబర్ 1 నుంచి ఉపాధి హామీ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి కార్యాచరణ ప్రణాళికను సమీక్షించి, తదుపరి పనులను గుర్తించాలని సూచించారు.
పని దినాలను విభజించి పక్కా కార్యాచరణ రూపొందించాలి
పథకంలో అనుమతించిన 370 రకాల పనులను ఒకేసారి చేపట్టకుండా, స్థానిక అవసరాలు, వాతావరణ పరిస్థితులు, కూలీల లభ్యత ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో విభజించాలని మంత్రి అన్నారు. గుర్తించిన 318 రకాల పనుల్లో గ్రామాల అవసరాలకు అనుగుణంగా కనీసం 50 రకాల ముఖ్యమైన పనులకు ప్రాధాన్యతనిచ్చి, నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని సూచించారు. సీజన్లు, నెలలు, ప్రాంతాల వారీగా పనులను, పని దినాలను విభజించి పక్కా కార్యాచరణ రూపొందించాలని మంత్రి తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత తలెత్తే అవకాశమున్నందున నీటి సంరక్షణ పనులను ప్రాధాన్యతగా చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. సీఎం సూచనల మేరకు కాలువల మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని, చెరువులు, కుంటలు, నీటి నిల్వలు, భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడే పనులను గుర్తించాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు కృపాకర్ రెడ్డి, జగదీశ్వర్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీఆర్డీఓలు, ఈఈలు, డీఈలు, ఎంపీడీవోలు సమీక్షలో పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana | కరువు.. అప్పులు.. సర్కారును కలవరపెడుతున్న కష్టాల సుడిగుండాలు
- ●KRMB | మహారాష్ట్రకు సీఎం రేవంత్.. 26న జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా
- ●Tilak and Nitish Speak in Telugu | నువ్వు కాల్ ఇవ్వలే.. రెండు అని చెప్పురా పోనీ.. తెలుగులో మాట్లాడి మ్యాచ్ గెలిపించిన తిలక్-నితిశ్
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్లో 774 మంది న్యాయవాదులుగా నమోదు
- ●Raashi Khanna | సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ సెట్స్‌లో రాఖీఖన్నా - ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●Gajwel SI Mallareddy | రైతుపై దాడి.. గజ్వేల్ ఎస్ఐ మల్లారెడ్డిపై వేటు

Telangana | కరువు.. అప్పులు.. సర్కారును కలవరపెడుతున్న కష్టాల సుడిగుండాలు

KRMB | మహారాష్ట్రకు సీఎం రేవంత్.. 26న జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా

Tilak and Nitish Speak in Telugu | నువ్వు కాల్ ఇవ్వలే.. రెండు అని చెప్పురా పోనీ.. తెలుగులో మాట్లాడి మ్యాచ్ గెలిపించిన తిలక్-నితిశ్

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్లో 774 మంది న్యాయవాదులుగా నమోదు






