Israeli PM Netanyahu | అమెరికా అధ్యక్షుడితో ఇజ్రాయెల్‌కు ముప్పు.. భారత్‌తో సంబంధాలు చాలా అవసరం : నెతన్యాహు
Israeli PM Netanyahu | భవిష్యత్తులో అమెరికా నుంచి తమ దేశానికి తీవ్ర వ్యతిరేకత ఉండొచ్చని ఇజ్రాయెల్ ప్రధాని (Israeli PM) బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో మరో రెండేళ్లలో కొత్త అధ్యక్షుడు (US president) అధికారంలోకి రావొచ్చని నెతన్యాహూ అంచనా వేశారు.
International | Published On Oct 19, 2026, 11.43 am IST
Israeli PM Netanyahu | ఇజ్రాయెల్ ప్రధాని (Israeli PM) బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో అమెరికా నుంచి తమ దేశానికి తీవ్ర వ్యతిరేకత ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా తమ దేశ స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి భారత్ (India), లాటిన్ అమెరికా (Latin America) దేశాలతో కొత్త పొత్తులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో తన దేశ భద్రతకు సంబంధించిన విధానాన్ని వివరిస్తూ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో మరో రెండేళ్లలో కొత్త అధ్యక్షుడు (US president) అధికారంలోకి రావొచ్చని నెతన్యాహూ అంచనా వేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఉండే వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు..? అంటూ అధికారులను ఉద్దేశించి నెతన్యాహు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, అమెరికాతో సంబంధాలను ఎలా నిర్వహిస్తారు..? అంటూ ప్రశ్నించారు. అందుకే ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలోనే అంతర్జాతీయంగా తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన నొక్కి చెప్పారు.
భారత్ చిన్న దేశం కాదు..
అమెరికాలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, లేకపోయినా ఆ దేశంతో సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. అదే సమయంలో భవిష్యత్తు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరిన్ని దేశాలతో సంబంధాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ పేరును నెతన్యాహు ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్ చిన్న దేశం కాదని.. అంతర్జాతీయ వేదికపై ఒంటరి కాకుండా ఉండేందుకు 140 కోట్లకు పైగా జనాభా కలిగిన, శక్తివంతమైన దేశమైన భారతదేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన గట్టిగా పిలుపునిచ్చారు.
ప్రపంచంలో ఇంకా చాలా దేశాలతో సంబంధాలను విస్తరించుకోవచ్చని అన్నారు. ఇజ్రాయెల్ దౌత్య భాగస్వామ్యాలను విస్తరించుకోవడానికి లాటిన్ అమెరికాలో వస్తున్న రాజకీయ పరిణామాలు ఒక అవకాశమని ఆయన పేర్కొన్నారు. "లాటిన్ అమెరికాలో పెను మార్పు వస్తోంది. బ్రెజిల్‌లో మరికొద్ది రోజుల్లోనే భారీ మార్పు సంభవించవచ్చు. మనం మన కూటముల పరిధిని విస్తరించుకోవాలి. అందరికీ ఉపయోగపడేలా మన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలి" అని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఈ ఎన్నికల్లో ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పూర్తి మద్దతు ప్రకటించారు.
Also Read..
ఈఎంఐ విధానంలో బంగారం కొనవచ్చా.. ఖర్చు ఎంతవుతుంది..?
మరణం గురించి సందేశం ఇస్తుండగా.. సిలువ మీదపడి చర్చి ఫాదర్ మృతి
బులియన్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు.. పెట్టుబడిదారుల ఆసక్తి..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold Investment | ఈఎంఐ విధానంలో బంగారం కొనవచ్చా.. ఖర్చు ఎంతవుతుంది..?
- ●Crucifix | మరణం గురించి సందేశం ఇస్తుండగా.. సిలువ మీదపడి చర్చి ఫాదర్ మృతి
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు.. పెట్టుబడిదారుల ఆసక్తి..
- ●Revanth Reddy | నేడు ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ పర్యటన.. పోలీస్ కమిషనరేట్ ప్రారంభం
- ●Hyderabad | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో భారీగా సబ్ఇన్స్పెక్టర్లు బదిలీ.. సీపీ సజ్జనర్ ఉత్తర్వులు
- ●Samsung Galaxy F70 5G | శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 5జి లాంచ్.. ధర రూ.17,999 నుంచే..

Gold Investment | ఈఎంఐ విధానంలో బంగారం కొనవచ్చా.. ఖర్చు ఎంతవుతుంది..?

Crucifix | మరణం గురించి సందేశం ఇస్తుండగా.. సిలువ మీదపడి చర్చి ఫాదర్ మృతి

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు.. పెట్టుబడిదారుల ఆసక్తి..

Revanth Reddy | నేడు ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ పర్యటన.. పోలీస్ కమిషనరేట్ ప్రారంభం






