T20 World Cup 2026 | శ్రీలంక జట్టుకు షాక్.. గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ నుంచి హసరంగ ఔట్..
T20 World Cup 2026 | శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ టీ20 వరల్డ్‌కప్ 2026 నుంచి నిష్క్రమించాడు. ఎడమ కాలుకు తొడ కండరాల గాయం కావడంతో అతను కనీసం 4 వారాల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చిందని శ్రీలంక మీడియా వెల్లడించింది.
T20 World Cup 2026 | శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ టీ20 వరల్డ్‌కప్ 2026 నుంచి నిష్క్రమించాడు. ఎడమ కాలుకు తొడ కండరాల గాయం కావడంతో అతను కనీసం 4 వారాల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చిందని శ్రీలంక మీడియా వెల్లడించింది. దీంతో శ్రీలంక సహ ఆతిథ్య దేశంగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్‌లో హసరంగ సేవలను ఆ జట్టు కోల్పోనుంది. కొలంబోలో ఐర్లాండ్‌తో జరిగిన శ్రీలంక తొలి మ్యాచ్‌లోనే హసరంగకు గాయం అయింది. మ్యాచ్ సమయంలోనే అసౌకర్యంగా కనిపించిన అతను గాయంతోనే స్పెల్‌ను పూర్తి చేసి 4 ఓవర్లలో 3/25 గణాంకాలను నమోదు చేశాడు.
హసరంగ స్థానంలో మరో స్పిన్నర్..
అయితే మ్యాచ్ తరువాతి రోజు అతనికి ఎంఆర్‌ఐ స్కాన్ చేయగా గాయం తీవ్రత బయటపడింది. దీంతో హసరంగ జట్టుకు దూరమైనట్లు ప్రకటించారు. ఇక అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ దుశాన్ హేమంతను జట్టులోకి తీసుకున్నారు. 31 ఏళ్ల హేమంత ఇప్పటివరకు ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో అతని ఎకానమీ రేట్ 7.85గా ఉంది. ఇక శ్రీలంక ఈ వరల్డ్‌కప్ లో ఐర్లాండ్‌పై 20 పరుగుల విజయంతో శుభారంభం చేసింది. ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో హసరంగ ప్రాధాన్యం మరోసారి రుజువైంది. బ్యాటింగ్‌లో కమిందు మెండిస్ 19 బంతుల్లో 44 పరుగులు చేయగా, కుశాల్ మెండిస్ అజేయంగా 56 పరుగులతో శ్రీలంకను 163/6కు చేర్చారు.
శ్రీలంక జట్టుపై తీవ్ర ప్రభావం..
ఇక మ్యాచ్ ను మలుపు తిప్పింది మాత్రం హసరంగ బౌలింగ్ స్పెల్ అని చెప్పవచ్చు. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ను 19.5 ఓవర్లలో 143 పరుగులకు కుప్పకూల్చడంలో హసరంగ కీలక పాత్ర పోషించాడు. తొలి ఓవర్‌లోనే రాస్ అడైర్‌ను గూగ్లీతో ఔట్ చేసిన హసరంగ, 16వ ఓవర్‌లో హ్యారీ టెక్టర్‌ను పెవిలియన్‌కు పంపి ఐర్లాండ్ ఆశలను దెబ్బతీశాడు. మరోవైపు మహీష్ తీక్షణ (3/23)తో కలిసి మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌పై పట్టు సాధించారు. ఈ మ్యాచ్‌తో హసరంగ టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. అయితే హసరంగ శ్రీలంక జట్టుకు దూరం కావడం పెద్ద లోటు అనే చెప్పవచ్చు. అతను ముఖ్యమైన సమయాల్లో వికెట్లను తీయడంతోపాటు బ్యాటింగ్‌లోనూ రాణించగలడు. కానీ గాయం కారణంగా అతను జట్టుకు దూరం కావడం శ్రీలంక జట్టుపై భారీగానే ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. మరి శ్రీలంక జట్టు అతని గైర్హాజరిలో ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






