Arshdeep Singh | టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత!
Arshdeep Singh | టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో ఆ జట్టు కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌ను ఔట్ చేసి 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
Arshdeep Singh | టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో ఆ జట్టు కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌ను ఔట్ చేసి 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ, అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
భారత్ తరఫున టాప్ వికెట్ టేకర్
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 103 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా 126 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (115), హార్దిక్ పాండ్యా (114), కుల్దీప్ యాదవ్ (98) ఉన్నారు. 2022 జూలైలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా అర్ష్‌దీప్ అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 2025 జనవరిలో కోల్‌కతాలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో బెన్ డకెట్‌ను ఔట్ చేసి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అప్పటివరకు 96 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న యుజ్వేంద్ర చహల్‌ను అధిగమించాడు.
ఈ ఏడాది వికెట్ల వేటలోనూ టాప్
ఈ క్యాలెండర్ ఏడాది టీ20ల్లోనూ అర్ష్‌దీప్ సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు 40 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2022లో జోష్ లిటిల్ సాధించిన 39 వికెట్లు రెండో స్థానంలో ఉన్నాయి. వనిందు హసరంగ (2024లో 38), భువనేశ్వర్ కుమార్ (2022లో 37) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టీ20ల్లో 150 వికెట్లు పూర్తి చేసేందుకు అర్ష్‌దీప్ 2,143 బంతులు వేశాడు. ఈ జాబితాలో హసరంగ 2,035 బంతులతో అగ్రస్థానంలో ఉండగా.. రషీద్ ఖాన్ 2,098 బంతులతో రెండో స్థానంలో ఉన్నాడు. అర్ష్‌దీప్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో అర్ష్‌దీప్ ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నప్పటికీ.. ఆ వికెట్ అతడి కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. కివీస్ కెప్టెన్ శాంట్నర్ అతని 150వ అంతర్జాతీయ టీ20 వికెట్‌గా రికార్డులకెక్కాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Chanagani Dayakar | మియాపూర్ భూముల తీర్పు కేసీఆర్‌కు చెంప పెట్టు లాంటిది: చనగాని దయాకర్
- ●Stock Markets | ఐటీ, ఫార్మా షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●Online Dating App | డేటింగ్ యాప్‌తో ట్రాన్స్జెండర్ల కొత్త మోసం.. యువకులను ట్రాప్ చేసి దోపిడీ
- ●Sara Ali Khan | కేదార్నాథ్ ఆలయంలో పూజలు - చిక్కుల్లో బాలీవుడ్ హీరోయిన్
- ●Simhastha Kumbh | రేపటి నుంచి సింహస్థ కుంభమేళా షురూ.. 2027లో నాలుగు అమృత స్నానాలు ఎప్పుడంటే?
- ●Gig Workers | గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత.. జాతీయ బోర్డు ఏర్పాటు చేసిన కేంద్రం..

Chanagani Dayakar | మియాపూర్ భూముల తీర్పు కేసీఆర్‌కు చెంప పెట్టు లాంటిది: చనగాని దయాకర్

Stock Markets | ఐటీ, ఫార్మా షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Online Dating App | డేటింగ్ యాప్‌తో ట్రాన్స్జెండర్ల కొత్త మోసం.. యువకులను ట్రాప్ చేసి దోపిడీ

Sara Ali Khan | కేదార్నాథ్ ఆలయంలో పూజలు - చిక్కుల్లో బాలీవుడ్ హీరోయిన్





