T20 World Cup 2026 | శ్రీలంక స్పిన్నర్ హసరంగపై పాక్ కామెంటేటర్ అనుచిత వ్యాఖ్యలు.. నెటిజన్ల ఆగ్రహం..
T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ బి లో ఆదివారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. టోర్నీని శ్రీలంక శుభారంభంతో ప్రారంభించింది. జట్టును విజయ తీరాలకు చేర్చడంలో శ్రీలంక స్పిన్నర్లు కీలకంగా వ్యవహరించారు.
T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ బి లో ఆదివారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. టోర్నీని శ్రీలంక శుభారంభంతో ప్రారంభించింది. జట్టును విజయ తీరాలకు చేర్చడంలో శ్రీలంక స్పిన్నర్లు కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా వనిందు హసరంగ మ్యాచ్ సందర్భంగా గాయ పడినప్పటికీ తీవ్రమైన నొప్పిని భరిస్తూ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కీలక సమయాల్లో ఐర్లాండ్ వికెట్లను పడగొట్టి తమ జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. అయితే హసరంగ బౌలింగ్‌కు దిగిన వెంటనే తొడ కండరాలు పట్టుకుపోవడంతో తీవ్రంగా నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే మైదానం వెలుపల ఉన్న ఫిజియోకు సూచనలు చేస్తూ సహాయం కోరాడు.
రమీజ్ రాజా వ్యాఖ్యలపై నెటిజన్ల మండిపాటు..
అయితే అదే సమయంలో కామెంటరీ చెబుతున్న పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. హసరంగ గాయంతో బాధపడుతుంటే అతనిపై రమీజ్ రాజా లైంగిక అర్థం వచ్చేలా కామెంట్లు చేశాడు. తన తొడకు గాయం అయిందని, సహాయం కావాలని హసరంగ ఫిజియోకు చూపిస్తూ చేసిన సైగలపై రమీజ్ రాజా డబుల్ మీనింగ్ అర్థం వచ్చేలా మాట్లాడాడు. A quick magical rub, maybe.. అని అన్నాడు. దీంతో రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ ఆటగాడు మైదానంలో నొప్పితో బాధపడుతుంటే రమీజ్ రాజా డబుల్ మీనింగ్ అర్థం వచ్చేలా మాట్లాడడం సిగ్గు చేటని, ఆయనకు అది ఒక అంతర్జాతీయ మ్యాచ్ అని, తాను పబ్లిగ్గా మాట్లాడుతున్నాననే విషయం తెలియదా.. అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అయితే రమీజ్ రాజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఇటీవల బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోని ప్రేక్షకులను ఉద్దేశించి టాస్ సమయంలో మాట్లాడుతూ భారత కామెంటేటర్ రవిశాస్త్రిని అనుకరించబోయాడు. అయితే రమీజ్ రాజా మాటలకు స్టేడియం ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అతను నవ్వుల పాలయ్యాడు. రవిశాస్త్రిని అనుకరించబోయి బొక్కబోర్లా పడ్డాడు.. అంటూ నెటిజన్లు ఆయనను ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు కూడా తన అనుచిత వ్యాఖ్యలతో మరోసారి నవ్వుల పాలయ్యాడు.
శ్రీలంక శుభారంభం..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కుశాల్ మెండిస్, కమిందు మెండిస్‌ల బ్యాటింగ్ ప్రదర్శనకు, వనిందు హసరంగ, మహీష్ తీక్షణల స్పిన్ బౌలింగ్ తోడవడంతో శ్రీలంక జట్టు ఐర్లాండ్‌పై సునాయాసంగానే విజయం సాధించింది. కానీ బ్యాటింగ్ సమయంలో మాత్రం ఒక దశలో చాలా వెనుక బడింది. అయితే కుశాల్ మెండిస్ 43 బంతుల్లో 56 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. మరో వైపు కమిందు కూడా 19 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టు స్కోరును 163/6 కు చేర్చాడు. ఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 19.5 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ దసున్ శనక మాట్లాడుతూ స్పిన్నర్ల వల్లే తాము ఈ విజయం సాధించామని, హసరంగ ఒక కాలునే నేలపై మోపుతూ తీవ్రమైన నొప్పితో ఉండి కూడా కీలక సమయాల్లో ఐర్లాండ్ వికెట్లను తీసి తమ జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడని శనక అన్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026

Dope Tests | చిక్కుల్లో యశస్వీ జైస్వాల్, షెఫాలీ వర్మ.. నోటీసులు జారీ చేసిన నాడా..!
మే 9, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



