త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | పాకిస్థాన్‌తో మ్యాచ్ గెల‌వాల‌ని భార‌త‌ అభిమానుల పూజ‌లు.. వీడియో..!

T20 World Cup 2026 | పాకిస్థాన్‌తో క్రికెట్‌ మ్యాచ్ అంటే మామూలుగా ఉండ‌దు. వ‌ర‌ల్డ్ క‌ప్ అస‌లు రాక‌పోయినా ఫ‌ర్వాలేదు, కానీ పాకిస్థాన్ చేతిలో మాత్రం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఓట‌మి పాలు కావొద్ద‌ని స‌గ‌టు భార‌త క్రికెట్ అభిమాని కోరుకుంటాడు. అయితే ఐసీసీ టోర్నీల్లో వాస్త‌వానికి పాక్‌పై భార‌త్‌దే ఎల్ల‌ప్పుడూ పైచేయిగా ఉంది.

S

Sports | Published On Feb 15, 2026, 11.57 am IST

T20 World Cup 2026 | పాకిస్థాన్‌తో మ్యాచ్ గెల‌వాల‌ని భార‌త‌ అభిమానుల పూజ‌లు.. వీడియో..!
Advertisement

T20 World Cup 2026 | పాకిస్థాన్‌తో క్రికెట్‌ మ్యాచ్ అంటే మామూలుగా ఉండ‌దు. వ‌ర‌ల్డ్ క‌ప్ అస‌లు రాక‌పోయినా ఫ‌ర్వాలేదు, కానీ పాకిస్థాన్ చేతిలో మాత్రం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఓట‌మి పాలు కావొద్ద‌ని స‌గ‌టు భార‌త క్రికెట్ అభిమాని కోరుకుంటాడు. అయితే ఐసీసీ టోర్నీల్లో వాస్త‌వానికి పాక్‌పై భార‌త్‌దే ఎల్ల‌ప్పుడూ పైచేయిగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆదివారం కొలంబోలో పాక్‌తో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 గ్రూప్ మ్యాచ్‌లోనూ ఆ జ‌ట్టుపై భార‌త్ పైచేయి సాధించాల‌ని, మ్యాచ్‌లో క‌చ్చితంగా గెల‌వాల‌ని ఫ్యాన్స్ బ‌లంగా కోరుకుంటున్నారు. ఇక పాక్‌తో మ్యాచ్ ఉన్న‌ప్పుడ‌ల్లా పూజ‌లు చేసే అభిమానులు ఇప్పుడు కూడా ప్లేయర్లు రాణించాల‌ని పూజ‌లు చేస్తున్నారు.

ప్ర‌త్యేక హోమం..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న ఓ స్థానిక ఆల‌యంలో కొంద‌రు అభిమానులు టీమిండియా ప్లేయ‌ర్ల ఫొటోల‌ను పెట్టి పూజ‌లు చేశారు. ఈ సందర్భంగా హోమం నిర్వ‌హించారు. మంత్రాల‌ను చ‌దువుతూ భార‌త్ గెలవాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. జ‌స్‌ప్రిత్ బుమ్రా, ఇషాన్ కిష‌న్‌, సూర్య కుమార్ యాద‌వ్‌, అభిషేక్ శ‌ర్మ‌ల‌కు చెందిన ఫొటోల‌ను హోం సంద‌ర్భంగా ఉంచి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆ పూజ‌ల తాలూకు వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

రెండు టీమ్‌లు ఒకే గ్రూప్‌లో చాలా సార్లు..

భార‌త్, పాకిస్థాన్‌ను ఆదివారం శ్రీ‌లంక‌లోని కొలంబోలో ఉన్న ఆర్‌.ప్రేమ‌దాస స్టేడియంలో గ్రూప్ ఎ మ్యాచ్‌లో భాగంగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీలో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది. కాగా ఈ మ‌ధ్య కాలంలో నిర్వ‌హించిన అనేక ఐసీసీ టోర్నీల్లో పాక్ పై భార‌త్ దే పైచేయిగా ఉంది. భిన్న గ్రూపుల్లో ఈ టీమ్‌ల‌ను ఉంచినా ఆ త‌రువాత జ‌రిగే ద‌శ‌ల్లో క‌చ్చితంగా ఒక‌సారి ఈ జ‌ట్లు త‌ల‌ప‌డాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలో చివ‌రి రెండు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌తోపాటు చివ‌రి 5 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌లోనూ ఈ రెండు టీమ్‌ల‌ను ఒకే గ్రూప్‌లో ఉంచారు. అయితే 2011 వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ లో మాత్రం ఈ రెండు జ‌ట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. కానీ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డాయి. ఆ మ్యాచ్ లో భార‌త్ విజ‌యం సాధించి అనంత‌రం ఫైన‌ల్‌లో గెలుపు ద్వారా ట్రోఫీని లిఫ్ట్ చేసింది.

భార‌త్‌దే పైచేయి, కొలంబోలోనూ మెరుగైన రికార్డు..

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు భారత్‌, పాక్‌లు 8 సార్లు త‌ల‌ప‌డ‌గా, భార‌త్ 7 సార్లు విజ‌యం సాధించింది. చివ‌రి సారి భార‌త్ పై పాక్ 2021లో గెలుపొందింది. ఇక ఇవాళ్టి మ్యాచ్ జ‌ర‌గ‌నున్న కొలంబో మైదానంలోనూ భార‌త్‌కు మెరుగైన రికార్డే ఉంది. ఇక్క‌డ 2009 నుంచి భార‌త్ ఆడిన 15 టీ20 మ్యాచ్‌ల‌లో 11 విజ‌యాలు న‌మోదు చేసింది. అందువ‌ల్ల భార‌త ప్లేయ‌ర్ల‌కు స్టేడియం, పిచ్ కండిష‌న్‌ల‌పై పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఇవాళ్టి మ్యాచ్‌కు వ‌రుణుడు అడ్డంకిగా మారే అవ‌కాశం ఉంది. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు అధికంగా ఉండ‌గా, సాయంత్రం స‌మ‌యంలో చిరు జ‌ల్లులు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ ద్వారా తెలుస్తోంది. మ‌రి మ్యాచ్‌లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Advertisement
Advertisement