T20 World Cup 2026 | పాక్ స్పిన్నర్ తారిక్‌కు అశ్విన్ పరోక్ష మద్దతు.. బౌలర్లకే అన్ని రూల్స్ అంటూ..!
T20 World Cup 2026 | పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తన వివాదాస్పద బౌలింగ్ శైలితో ఇటీవలే ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తారిక్ అందరి దృష్టిలో నిలిచాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో అమెరికాతో జరిగిన మ్యాచ్ తరువాత కూడా తారిక్ పేరు మరోమారు వైరల్ అవుతోంది.
T20 World Cup 2026 | పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తన వివాదాస్పద బౌలింగ్ శైలితో ఇటీవలే ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తారిక్ అందరి దృష్టిలో నిలిచాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో అమెరికాతో జరిగిన మ్యాచ్ తరువాత కూడా తారిక్ పేరు మరోమారు వైరల్ అవుతోంది. అతని బౌలింగ్ యాక్షన్‌పై మైదానంలో ఫ్యాన్స్ వ్యంగ్యంగా స్పందించడం, ఆ తరువాత చాలా మంది నెటిజన్లు అతని బౌలింగ్ యాక్షన్ ఇల్లీగల్ అంటూ కామెంట్లు చేయడం మరోమారు వివాదాస్పదం అవుతోంది. అయితే ఈసారి ఉస్మాన్ తారిక్‌కు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పరోక్షంగా మద్దతును ఇవ్వడం విశేషం. అతను పలువురు చేసిన కామెంట్లకు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ సరికాదు: నెటిజన్లు
అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఉస్మాన్ తారిక్ మరోమారు రాణించాడు. 4 ఓవర్లు వేసిన తారిక్ 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ సందర్భంగా మైదానం వెలుపల పలువురు ప్రేక్షకులు తారిక్ బౌలింగ్ యాక్షన్‌ను వ్యంగ్యంగా అనుకరించారు. అతని బౌలింగ్ యాక్షన్ ఇల్లీగల్ అని అర్థం వచ్చేలా సైగలు చేశారు. ఈ క్రమంలో చాలా మంది నెటిజన్లు కూడా మరోసారి అతని బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఐసీసీ తారిక్‌ను ఎలా అనుమతిస్తుంది, అతని బౌలింగ్ యాక్షన్ నియమాలకు విరుద్ధం, అతన్ని వెంటనే బ్యాన్ చేయాలి.. అని కోరుతున్నారు. ఇక భారత మాజీ క్రికెటర్ శ్రీవాట్స్ గోస్వామి కూడా ఈ విషయంపై ఎక్స్ వేదికగా స్పందించాడు. ఫుట్ బాల్ లాంటి ఆటలో పెనాల్టీ షూట్ అవుట్‌లో ప్లేయర్ యాక్షన్‌ను అకస్మాత్తుగా కాసేపు ఆపి తరువాత కొనసాగించడాన్ని ఇల్లీగల్‌గా పరిగణిస్తారు. అలాంటిది ప్రొఫెషనల్ గేమ్‌గా చెప్పుకునే క్రికెట్‌లో ఉస్మాన్ తారిక్ లాంటి బౌలర్‌ను అసలు ఎలా అనుమతిస్తున్నారు..? అతను బౌలింగ్ వేసేటప్పుడు కాసేపు బంతిని ఆపి ఉంచుతున్నాడు, ఇది నియమాలకు పూర్తిగా విరుద్ధం.. అని కామెంట్ చేశాడు.
ICC should ban Usman Tariq for his illegal bowling action. pic.twitter.com/dYfSEFxmDv
— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) February 10, 2026
రవిచంద్రన్ అశ్విన్ కౌంటర్..
అయితే శ్రీవాట్స్ గోస్వామి చేసిన వ్యాఖ్యలకు రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్ వేదికగానే కౌంటర్ ఇచ్చాడు. దురదృష్టవశాత్తూ రూల్స్ అన్నీ బ్యాటర్లకే అనుకూలంగా ఉన్నాయని అన్నాడు. అంపైర్‌కు చెప్పకుండానే బ్యాటర్ తన పొజిషన్ ను మార్చుకుని స్విచ్ హిట్ చేసేందుకు అనుమతిస్తున్నారు. కానీ బౌలర్‌కు మాత్రం చేతి వాటం మార్చాలంటే కచ్చితంగా అంపైర్‌కు చెప్పాలనే నిబంధన విధించారు. ఇది పూర్తిగా అన్యాయం. ముందుగా ఈ రూల్‌ను మార్చాలి. అన్ని రూల్స్ బ్యాటర్లకే అనుకూలంగా ఉన్నాయి.. అని అన్నాడు. అయితే అశ్విన్ తన వ్యాఖ్యల్లో ఎక్కడా తారిక్ గురించి నేరుగా స్పందించలేదు. కానీ గతంలో అతను కూడా కొన్ని సందర్భాల్లో బంతిని వేసే సమయంలో కాసేపు ఆపి ఆ తరువాత బంతిని సంధించాడు. అప్పట్లో అశ్విన్ చకింగ్ (త్రోయింగ్) చేస్తున్నాడని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే దాన్ని దృష్టిలో ఉంచుకుని తారిక్‌కు పరోక్షంగా మద్దతు ఇస్తూనే అశ్విన్ ఈ పోస్టు పెట్టాడని అంటున్నారు.
Reverse sweep was first played in 1964 and it’s still debatable ? Ok.
We are talking about the “ pause “ here. “ PAUSE “. A batter doesn’t take stance, look away, pause & then reset before the ball is delivered. He/she is absolutely ready for whatever the bowler has to offer.… https://t.co/3uH8kGN8mc— Shreevats goswami (@shreevats1) February 11, 2026
తారిక్ యాక్షన్ సరైందే: అంపైర్లు
ఇక తారిక్ బౌలింగ్ యాక్షన్ ఈ మధ్య కాలంలో విపరీతంగా వివాదాస్పదం అవుతోంది. ఇటీవలే పాక్‌లో ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆసీస్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ కూడా తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. గతంలో తారిక్ అక్కడి స్థానిక పీఎస్ఎల్ టోర్నీలో ఆడినప్పుడు రెండు సార్లు రిపోర్టింగ్‌కు గురయ్యాడు. దీంతో లాహోర్‌లో పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) అతనికి బయో మెకానికల్ పరీక్షలు నిర్వహించి అతని బౌలింగ్ యాక్షన్ సరిగ్గానే ఉందని తేల్చింది. కానీ అంతర్జాతీయ మ్యాచ్‌లలో తారిక్‌పై ఇప్పటి వరకు ఎవరూ ఐసీసీకి ఫిర్యాదు చేయలేదు. అదే గనక జరిగితే అతనిపై కొంత కాలం పాటు ఐసీసీ నిషేధం విధించే అవకాశం ఉంటుంది. అతను అన్ని పరీక్షల్లోనూ పాస్ అయితేనే మళ్లీ బౌలింగ్‌కు అనుమతిస్తారు. అయితే భారత అంపైర్ అనిల్ చౌదరి మాత్రం తారిక్ బౌలింగ్ యాక్షన్ సరైందేనని చెప్పారు. అతను బంతిని వేసే సమయంలో చేయి 15 డిగ్రీల కన్నా తక్కువగానే కోణాన్ని కలిగి ఉందని, అలాగే ఐసీసీ రూల్స్ ప్రకారం అతని పాజ్ బౌలింగ్ యాక్షన్ కూడా సరైందేనని తెలిపారు. ఇక పాక్ తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 15న భారత్‌తో కొలంబోలో ఆడనుంది. ఆ మ్యాచ్‌లో అందరి దృష్టి తారిక్‌పైనే నిలవనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






