త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | భార‌త్ సెమీఫైన‌ల్‌కు చేర‌డం క‌ష్ట‌మేనా..? కీల‌కంగా మార‌నున్న నెట్ ర‌న్ రేట్‌..?

T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ తొలి ఓటమిని చవిచూసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌతాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య భారత్‌ను ఓడించింది. ఈ ఓటమితో భార‌త బ్యాటింగ్‌లోని లోపాలు బ‌య‌ట ప‌డ‌డ‌మే కాదు, టీమిండియా సెమీ ఫైన‌ల్ బెర్త్ అత్యంత సంక్లిష్టంగా మారింది.

S

Sports | Published On Feb 23, 2026, 7.16 am IST

T20 World Cup 2026 | భార‌త్ సెమీఫైన‌ల్‌కు చేర‌డం క‌ష్ట‌మేనా..? కీల‌కంగా మార‌నున్న నెట్ ర‌న్ రేట్‌..?
Advertisement

T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ తొలి ఓటమిని చవిచూసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌతాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య భారత్‌ను ఓడించింది. ఈ ఓటమితో భార‌త బ్యాటింగ్‌లోని లోపాలు బ‌య‌ట ప‌డ‌డ‌మే కాదు, టీమిండియా సెమీ ఫైన‌ల్ బెర్త్ అత్యంత సంక్లిష్టంగా మారింది. ఇంకా సూపర్ 8 ద‌శ‌లో భార‌త్ రెండు మ్యాచ్‌లు ఆడాల్సిన ఉండ‌గా, ఇక‌పై అస‌లు ఎలాంటి త‌ప్పులు చేయ‌కూడ‌దు. అలాగే నెట్ ర‌న్ రేట్ భారీగా త‌గ్గింది క‌నుక మిగిలిన రెండు జ‌ట్ల‌పై భారీ తేడాతో గెల‌వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. చిన్న త‌ప్పు చేసినా సెమీ ఫైన‌ల్ బెర్త్ అందుకోవ‌డం క‌ష్టంగా మారింది. ఒక్క మ్యాచ్ ఓడినా స‌రే ప్ర‌పంచ క‌ప్ నుంచి నిష్క్ర‌మిస్తుంది. సెమీ ఫైన‌ల్‌కు చేర‌డంలో నెట్ ర‌న్ రేట్ (NRR) అత్యంత కీల‌కంగా మారింది.

కీల‌కం కానున్న నెట్ ర‌న్ రేట్‌..

భార‌త్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం డూ ఆర్ డై అన్న విధంగా మారింది. సూప‌ర్ 8లో ఇంకా టీమిండియా మ‌రో రెండు మ్యాచ్‌ల‌ను ఆడ‌నుంది. జింబాబ్వేతో ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన చెన్నైలో ఆ త‌రువాత మార్చి 1న వెస్టిండీస్‌లో కోల్‌క‌తాలో మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మ్యాచ్‌ల‌లో క‌చ్చితంగా భార‌త్ గెల‌వాలి. ఒక్క‌టి ఓడినా టోర్నీ నుంచి నిష్క్ర‌మ‌ణ త‌ప్ప‌దు. ఇక సౌతాఫ్రికా సూప‌ర్ 8లో జింబాబ్వే, వెస్టిండీస్ రెండు జ‌ట్ల‌ను ఓడించాల్సి ఉంటుంది. లేదంటే భారత్‌కు పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుంది. జింబాబ్వే-వెస్టిండీస్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుపై సౌతాఫ్రికా పాయింట్లు కోల్పోతే భారత్ రెండు మ్యాచ్‌లు గెలిచినా సరిపోకపోవచ్చు. అలా జరిగితే 3 జట్లు 4 పాయింట్లతో సమంగా నిలిచే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిలో నెట్ ర‌న్ రేట్ కీల‌కం అవుతుంది. దీని వ‌ల్ల భార‌త్ త‌మ నెట్ ర‌న్ రేట్‌ను పెంచుకోవ‌డానికి భారీ తేడాతో విజ‌యం సాధించాల్సి ఉంటుంది.

బ‌య‌టప‌డ్డ బ‌ల‌హీన‌త‌లు..

సౌతాఫ్రికాతో జ‌రిగిన ఒక్క‌మ్యాచ్‌లో దారుణంగా విఫ‌లం అవ‌డం ప్ర‌స్తుతం టీమిండియాను పీక‌ల్లోతు క‌ష్టాల్లోకి నెట్టేసింద‌నే చెప్పాలి. మిగిలిన రెండు మ్యాచ్‌ల‌లో గెలిచినా ఒక వేళ సౌతాఫ్రికా ఇత‌ర జ‌ట్ల‌కు పాయింట్ల‌ను కోల్పోతే అప్పుడు నెట్ ర‌న్ రేట్ కీల‌కం అవుతుంది క‌నుక టీమిండియా ఈ విష‌యంలో అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. ఇక‌పై ఆడే రెండు మ్యాచ్ ల‌లోనూ నెట్ ర‌న్ రేట్ ను క‌చ్చితంగా మెరుగు ప‌రుచుకోవాలి. మ‌రోవైపు బ్యాటింగ్‌లో తీవ్ర వైఫ‌ల్యం చెంద‌డం, షాట్ సెలెక్ష‌న్‌, ఆట తీరులో స‌మ‌స్య‌లు ఈ మ్యాచ్‌లో బ‌య‌ట ప‌డ్డాయి. దీంతో ప్ర‌త్య‌ర్థి జ‌ట్లు భార‌త బ‌ల‌హీన‌ల‌ను తెలుసుకున్న‌ట్లు అయింది. వీట‌న్నింటికీ చెక్ పెట్టేలాగే భార‌త్ త‌న త‌దుప‌రి వ్యూహాన్ని అమ‌లు చేయాలి. లేదంటే టైటిల్‌ను కోల్పోవాల్సి వ‌స్తుంది.

Advertisement
Advertisement