NZ Vs SA | టీ20 ప్రపంచకప్‌లో రన్నర్స్ అప్ జట్టు.. కట్ చేస్తే సౌతాఫ్రికా చేతిలో చిత్తు..
NZ Vs SA | న్యూజిలాండ్‌లోని బే ఓవల్ మైదానంలో ఆదివారం జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు అద్భుతమైన ప్రదర్శనతో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ప్రోటీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
NZ Vs SA | న్యూజిలాండ్‌లోని బే ఓవల్ మైదానంలో ఆదివారం జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు అద్భుతమైన ప్రదర్శనతో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ప్రోటీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికా బౌలర్ల అద్భుత ప్రదర్శనకు తట్టుకోలేక 14.3 ఓవర్లలో కేవలం 91 పరుగులకు ఆలౌట్ అయింది. బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లలో ఎవరూ 30 పరుగుల మార్కును దాటలేకపోయారు. ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ 21 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ తో 26 పరుగులు చేసి జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. నీషమ్ తరువాత కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 19 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేయగా, కోల్ మెక్‌కాంచీ 11 బంతుల్లో ఒక ఫోర్‌తో 15 పరుగులు చేశాడు. అలాగే బెవోన్ జాకబ్స్ 7 బంతుల్లో ఒక సిక్స్ సహాయంతో 10 పరుగులు చేసినప్పటికీ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించలేకపోయారు.
ప్రోటీస్ బౌలింగ్‌కు కివీస్ విలవిల..
దక్షిణాఫ్రికా బౌలింగ్ విభాగం పూర్తిగా ఆధిపత్యం చాటింది. 19 ఏళ్ల యువ బౌలర్ కోబాని మొకోయెనా తన తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లోనే మూడు వికెట్లు (3/26) సాధించి ఆకట్టుకున్నాడు. అతనితో పాటు జెరాల్డ్ కొట్జియా (2/14), ఒట్నీల్ బార్ట్‌మన్ (2/22), కెప్టెన్ కేశవ్ మహారాజ్ (2/25) తలో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను కుదిపేశారు. 92 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్‌హుయిజెన్ చక్కని ప్రారంభం అందించాడు. అతను 48 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో అజేయంగా 45 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దక్షిణాఫ్రికా జట్టు 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుని 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
అరంగేట్ర మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు..
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న మొకోయెనా మాట్లాడుతూ మొదటి మ్యాచ్‌లోనే అరంగేట్రం చేయడం చాలా మంచి అనుభూతి ఇచ్చిందన్నాడు. మొదటి రెండు ఓవర్లు తనకు అనుకున్నట్టుగా సాగలేదని, వికెట్లు దక్కవని అనుకున్నానని, అయితే పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా ఉన్నాయని తెలిపాడు. పిచ్ వేగంగా ఉండటంతోపాటు బంతి కాస్త స్వింగ్ అయిందని, అందుకే తాను స్లో బాల్స్ ఉపయోగించానని తెలిపాడు. మొత్తం మీద ఈ మ్యాచ్‌ను బాగా ఆస్వాదించానని చెప్పాడు. అయితే ఇటీవల భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన కివీస్ జట్టు ఇలా సౌతాఫ్రికా చేతిలో దారుణ పరాజయం పాలవడం చర్చనీయాంశంగా మారింది. కివీస్ జట్టులో పోరాట పటిమ లోపించిందని, అందుకనే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడారని, అదే ఫామ్ ఇప్పటికీ కొనసాగుతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






