త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bathukamma | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

Bathukamma | దేవీ నవరాత్రుల సందర్భంగా ఎస్ఎస్‌డీసీవో(SSDCO) దక్షిణాఫ్రికా ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ( Bathukamma ) వేడుకలు ఘనంగా ముగిశాయి. అక్టోబర్‌ 18వ తేదీ ఆదివారం నాగయ్యాస్‌ మాల్‌లోని SSDCO దేవీ మండపంలో జరిగిన ఈ వేడుకలకు 650 మందికి పైగా తెలుగు ప్రజలు, భక్తులు హాజరయ్యారు.

S

International | Published On Oct 19, 2026, 5.24 pm IST

Bathukamma | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Advertisement

SSDCO ఆధ్వర్యంలో వేడుకల్లో పాల్గొన్న 650 మందికి పైగా తెలంగాణ వాసులు

Bathukamma | త్రినేత్ర న్యూస్ : దేవీ నవరాత్రుల సందర్భంగా ఎస్ఎస్‌డీసీవో(SSDCO) దక్షిణాఫ్రికా ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ( Bathukamma ) వేడుకలు ఘనంగా ముగిశాయి. అక్టోబర్‌ 18వ తేదీ ఆదివారం నాగయ్యాస్‌ మాల్‌లోని SSDCO దేవీ మండపంలో జరిగిన ఈ వేడుకలకు 650 మందికి పైగా తెలుగు ప్రజలు, భక్తులు హాజరయ్యారు.

దేవీ నవరాత్రుల్లో నిత్య పూజలు, ప్రత్యేక వైదిక క్రతువులు నిర్వహించేందుకు భారతదేశం నుంచి వేద పండితులు శ్రీ మనోహర్‌ శర్మ ప్రత్యేకంగా విచ్చేశారు. ఆయన ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్వహించిన పూజల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. పూలతో ప్రకృతిని ఆరాధిస్తూ, గౌరమ్మను కొలిచే తెలంగాణ పండుగ బతుకమ్మ. చివరి రోజున వివిధ రకాల సద్దులను నైవేద్యంగా సమర్పించి, ఆటపాటలతో జరుపుకునే సద్దుల బతుకమ్మ వేడుకలు తెలుగు కుటుంబాలను ఒక్కచోట చేర్చాయి.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎన్నారై దక్షిణాఫ్రికా శ్రేణులు తమ కుటుంబాలతో కలిసి పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ ఎన్నారై శ్రేణుల భాగస్వామ్యాన్ని అరవింద్‌ చికోటి గారు సమన్వయం చేశారు. ఆడ‌ప‌డుచులంద‌రూ ఒకచోట చేరి, అందంగా పేర్చిన బతుకమ్మలతో గౌరమ్మను పూజించారు. మహిళల బతుకమ్మ ఆటపాటలు, చిన్నారుల సందడితో ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది.

ఆత్మీయ పలకరింపులు, ఆనందోత్సాహాల మధ్య చిన్నారులు, పెద్దలు అందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు. విదేశీ గడ్డపై మన సంస్కృతి, సంప్రదాయాలను చాటుతూ కుటుంబాలు, మిత్రులతో కలిసి జరుపుకున్న ఈ వేడుకలు తెలుగు ప్రజల ఐక్యతకు అద్దం పట్టాయి.

ఈ కార్యక్రమ నిర్వహణలో SSDCO కమిటీ సభ్యులు అరుణ్‌ సుంకు, రాజేష్‌ యార్లగడ్డ, శ్రీధర్‌ బొల్లోజు, సాతులూరి లక్ష్మీ శ్రీనివాస్‌, నిర్మల్‌ నల్లు ముందుండి ఏర్పాట్లను సమన్వయం చేశారు. వేడుకలకు తరలివచ్చిన తెలుగు కుటుంబాలకు, భక్తులకు, బీఆర్‌ఎస్‌ ఎన్నారై శ్రేణులకు, సహకరించిన స్వచ్ఛంద సేవకులకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో సద్దుల బతుకమ్మ వేడుకలు విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు.

అలాగే, కేప్‌టౌన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేతన్‌ కొరోబోయిన సమన్వయంతో కేప్‌టౌన్‌లో కూడా బతుకమ్మ సంబరాలు జరిగాయి. దక్షిణాఫ్రికాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ప్రవాసుల అనుబంధాన్ని చాటాయి.

Advertisement
Advertisement