Shashi Tharoor | దేశ ప్రజలను బీసీసీఐ అవమానించింది, ముస్తాఫిజుర్ ఏం చేశాడని అతన్ని తప్పించారు: శశి థరూర్
Shashi Tharoor | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026కు గాను బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను రిలీజ్ చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాల పరంగా సుడిగుండాల వలయాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. ముస్తాఫిజర్‌ను రిలీజ్ చేయడంతో భగ్గుమన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఆ దేశ ప్రభుత్వం భారత్, బీసీసీఐపై మండిపడింది.
Shashi Tharoor | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026కు గాను బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను రిలీజ్ చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాల పరంగా సుడిగుండాల వలయాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. ముస్తాఫిజర్‌ను రిలీజ్ చేయడంతో భగ్గుమన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఆ దేశ ప్రభుత్వం భారత్, బీసీసీఐపై మండిపడింది. ఒక్క ప్లేయర్‌కు మీరు సెక్యూరిటీ అందించకపోతే మొత్తం బంగ్లా జట్టుకు ఎలా రక్షణ కల్పిస్తారు, కనుక మేము మీ దేశంలో టీ20 వరల్డ్ కప్ ఆడలేము. ఐసీసీ దయచేసి మా మ్యాచ్ లను శ్రీలంకకు తరలించాలి.. అని బంగ్లాదేశ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ కొందరు మాత్రం బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఇదే విషయంపై స్పందించారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం సరైంది కాదని అన్నారు.
బీసీసీఐది ముమ్మాటికీ తప్పే..
ముస్తాఫిజుర్ రహమాన్‌ను ఐపీఎల్ 2026 నుంచి రిలీజ్ చేయడం సరికాదు. ఇది అనవసర రాజకీయ చర్య. బీసీసీఐ ఈ విషయంలో తప్పు చేసింది. బీసీసీఐ ఆమోదించిన ప్లేయర్‌నే కేకేఆర్ కొనుగోలు చేసింది. అలాంటప్పుడు ఆ జట్టును ఎలా విమర్శిస్తారు..? ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐకి సత్సంబంధాలు లేవు. రెండు దేశాలు చాలా ఏళ్ల నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడడం లేదు. అలాగే పాకిస్థాన్ ప్లేయర్లను ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతించడం లేదు. అది కరెక్టే కానీ, బంగ్లాదేశ్ ప్లేయర్‌ను అనవసరంగా రిలీజ్ చేశారు. అతన్ని ఐపీఎల్ నుంచి తప్పించడం సరికాదు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఒకేలా లేవు.. అని థరూర్ వ్యాఖ్యానించారు.
ముస్తాఫిజుర్ ఏం చేశాడు..?
పాకిస్థాన్ తో భారత్‌కు ఉన్న శత్రుత్వం వేరు. బంగ్లాదేశ్ తో అలాంటి శత్రుత్వం లేదు. అలాంటప్పుడు బంగ్లాదేశ్, పాకిస్థాన్ రెండూ ఒకటే ఎలా అవుతాయి..? పాకిస్థాన్ పంపించినట్లు బంగ్లాదేశ్ ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించడం లేదు కదా. అలాంటప్పుడు పాక్‌ను, బంగ్లాను ఒకేలా ఎలా చూస్తారు..? పాక్ ప్లేయర్లలాగే బంగ్లా ప్లేయర్‌లను కూడా ఎలా నిషేధిస్తారు..? పాక్‌తో మనకు ఉన్న పరిస్థితులు వేరు, బంగ్లాతో మనకు అలాంటి స్థితి లేదు. అలాంటప్పుడు బంగ్లా ప్లేయర్‌ను కూడా పాక్ ప్లేయర్‌లలాగే ఎందుకు నిషేధించారు..? బీసీసీఐ ఈ వియంలో చాలా పొరపాటు చేసింది. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని ప్లేయర్‌ను తొలగిస్తారా..? బీసీసీఐ ఇలా చేయడం వల్ల దేశ ప్రజలకు అవమానం జరిగింది. అసలు ముస్తాఫిజుర్ ఏమైనా ఉగ్రవాదా, కనీసం అతను ఇండియాకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడాడా, అతను ఒక సాధారణ ప్లేయర్. అలాంటప్పుడు అతన్ని ఎందుకు తీసేశారు..? అని థరూర్ ప్రశ్నించారు. దేశంలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. కానీ కేవలం క్రికెట్‌కు మాత్రమే బంగ్లా అంశాన్ని ఎలా ముడిపెడతారు..? అలాంటప్పుడు క్రికెట్‌కు, రాజకీయాలకు తేడా ఏముంటుంది..? ఆటను ఆటలాగే చూడాలి.. అని థరూర్ అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



