Pakistan Media | జైషా, బీసీసీఐపై పాక్ మీడియా అబద్ధాలు.. గోబెల్స్‌ను మించి దుష్ప్రచారం..
Pakistan Media | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో ప్రస్తుతం మాటల యుద్ధాలు సాగుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌తో మ్యాచ్‌లో ఆడేది లేదని పాక్ ప్రభుత్వం ప్రకటించిన తరువాత నుంచి ఈ మాటల యుద్ధం మొదలైంది.
Pakistan Media | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో ప్రస్తుతం మాటల యుద్ధాలు సాగుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌తో మ్యాచ్‌లో ఆడేది లేదని పాక్ ప్రభుత్వం ప్రకటించిన తరువాత నుంచి ఈ మాటల యుద్ధం మొదలైంది. దీనిపై ఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ తన స్టాండ్‌ను మార్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే పాక్ మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మ్యాచ్ జరగడంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే పరిస్థితి ఇలా ఉండగా పాకిస్థాన్ మీడియా మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఐసీసీ, జైషా, బీసీసీఐ గురించి తప్పుడు ప్రచారం చేస్తోంది. పాక్ మీడియా చర్యలు గోబెల్స్ ప్రచారాన్ని మించిపోయాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Dr. Noman Niaz has dropped a big news update.
pic.twitter.com/sOXuJ2pbrj— Azam-K (@MusafirNagri) February 3, 2026
జైషా యూరోప్‌లో ఉంటే ఇండియాలో మీటింగ్ ఎలా..?
ఐసీసీ చైర్మన్ జైషా, బీసీసీఐ డిజిటల్ ప్రాజెక్ట్ హెడ్, సీఈవో సంజోంగ్ గుప్తా ప్రస్తుతం యూరోప్ పర్యటనలో ఉన్నారు. వారు ఇప్పటికే మిలన్‌లో అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ (ఐవోసీ)తో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. యూరోప్ దేశాల్లో క్రికెట్ విస్తరణ, అభివృద్ధితోపాటు ఒలంపిక్స్‌లో క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించడం వంటి పలు అంశాలపై ఆయా సంస్థల ప్రతినిధులతో వరుసగా చర్చిస్తూ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ మేరకు క్రికెట్ జర్మనీ అధికారులతోనూ వారు సమావేశంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వివరాలను క్రికెట్ జర్మనీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. అయితే జైషా ఓ వైపు యూరోప్‌లో ఉండగా, పాకిస్థాన్ మీడియా మాత్రం ఆయన భారత్‌లో ముంబైలో ఉన్నారని, ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు, పాక్ ప్రభుత్వం ఇచ్చిన ఝలక్‌కు జైషా, సంజోంగ్ గుప్తా, ఇంకా ఇతర బీసీసీఐ అధికారులు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారని, వారు పాకిస్థాన్ డిమాండ్లకు అంగీకరించినట్లే కనిపిస్తున్నారని.. ఏవేవో వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పాక్ న్యూస్ చానల్స్‌లో పలువురు పాక్ మాజీ క్రికెటర్లు పాల్గొని ఇవే విషయాలను నిజమని ధ్రువీకరించారు.
View this post on Instagram
పాక్ మీడియాపై ట్రోలింగ్..
అయితే జైషా ఓ వైపు యూరోప్‌లో ఉంటే ఇండియాలో ఎలా సమావేశాన్ని నిర్వహించారని భారత క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నెటిజన్లు సైతం పాక్ మీడియా గోబెల్స్ ప్రచారంపై ట్రోల్ చేస్తున్నారు. దుష్ప్రచారం చేయడంలో పాక్ మీడియా తమ ప్రభుత్వాన్నే మించిపోయిందని వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తో ఆడాలని భయపడే పాకిస్థాన్ ఇలా చేస్తుందని ట్రోల్ చేస్తున్నారు. అదే రోజు వుమెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో మరి భారత్‌తో పాకిస్థాన్ ను ఎందుకు ఆడిస్తున్నారు..? అని ప్రశ్నిస్తున్నారు. పాక్ మీడియాకు అసలు ఏం చేయాలో పాలుపోక ఇలాంటి పనికిమాలిన చర్చలను నిర్వహిస్తుందని దుయ్యబట్టారు. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే పాక్‌పై ఐసీసీ తీసుకునే చర్యలపై ఎందుకు చర్చించడం లేదని కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పాక్ చానల్స్ చేస్తున్న ప్రచారానికి చెందిన వీడియోలను నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



