త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NZ Vs SA | న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం.. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 3-2తో కైవ‌సం..

NZ Vs SA | క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్‌తో జ‌రిగిన 5వ టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం సాధించింది. కివీస్‌పై 33 ప‌రుగుల తేడాతో గెలుపొందిన ప్రోటీస్ టీమ్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2తో కైవ‌సం చేసుకుంది.

S

Sports | Published On Mar 25, 2026, 5.18 pm IST

NZ Vs SA | న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం.. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 3-2తో కైవ‌సం..
Advertisement

NZ Vs SA | క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్‌తో జ‌రిగిన 5వ టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం సాధించింది. కివీస్‌పై 33 ప‌రుగుల తేడాతో గెలుపొందిన ప్రోటీస్ టీమ్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2తో కైవ‌సం చేసుకుంది. చివ‌రి మ్యాచ్‌లో కాన‌ర్ ఎస్టర్‌హుయిజెన్, రుబిన్ హెర్మ‌న్‌, వియాన్ ముల్డ‌ర్‌లు బ్యాట్‌తో రాణించ‌గా, బౌల‌ర్లంద‌రూ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసి కివీస్‌ను క‌ట్ట‌డి చేశారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత ల‌క్ష్య ఛేద‌న‌లో భాగంగా న్యూజిలాండ్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌ను కోల్పోయి 154 ప‌రుగులే చేసింది.

కానర్ ఎస్టర్‌హుయిజెన్ అదిరిపోయే ఇన్నింగ్స్‌..

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెన‌ర్ టోనీ డి జోర్జి (12 ప‌రుగులు, 3 ఫోర్లు) విఫ‌లం అయినా మ‌రో ఓపెన‌ర్ వియాన్ ముల్డ‌ర్ 31 ప‌రుగులు (2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) సాధించి జ‌ట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన రుబిన్ హెర్మ‌న్ (39 ప‌రుగులు, 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌), కానర్ ఎస్టర్‌హుయిజెన్ (75 ప‌రుగులు, 5 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), డియాన్ ఫారెస్ట‌ర్ (21 ప‌రుగులు నాటౌట్‌, 1 ఫోర్‌, 1 సిక్స‌ర్‌) రాణించ‌డంతో ప్రోటీస్ భారీ స్కోరు చేయ‌గ‌లిగింది. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో బెన్ సియర్స్ 2 వికెట్లు తీయ‌గా, జాక్ ఫోక్స్‌, జాష్ క్లార్క్‌స‌న్‌లకు చెరొక వికెట్ ద‌క్కింది.

సౌతాఫ్రికా బౌల‌ర్ల విజృంభ‌ణ‌..

భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలో వ‌రుస‌గా వికెట్ల‌ను కోల్పోయింది. జట్టు మిడిలార్డ‌ర్‌పై భారం ప‌డింది. ఓపెన‌ర్ కేటీన్ క్లార్క్ (2 ప‌రుగులు) విఫలం అవ‌గా, మ‌రో ఓపెన‌ర్ టిమ్ రాబిన్స‌న్ (25 ప‌రుగులు, 1 ఫోర్‌) కొద్ది సేపే క్రీజులో ఉన్నాడు. అనంత‌రం డేన్ క్లీవ‌ర్ (22 ప‌రుగులు, 3 ఫోర్లు), నిక్ కెల్లీ (14 ప‌రుగులు, 1 ఫోర్‌) త‌క్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఆ త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన బెవాన్ జేక‌బ్స్ (36 ప‌రుగులు, 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), జేమ్స్ నీష‌మ్ (24 ప‌రుగులు, 2 ఫోర్లు) కాసేపు పోరాడే ప్ర‌య‌త్నం చేశారు. అయిన‌ప్ప‌టికీ సౌతాఫ్రికా బౌల‌ర్ల ముందు నిల‌బ‌డ‌లేక‌పోయారు. వికెట్ల‌ను వెంట వెంట‌నే కోల్పోవ‌డంతో కివీస్ ఓట‌మి ఖాయ‌మైంది. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో గెరాల్డ్ కొశ్చియా, వియాన్ ముల్డ‌ర్‌, ఓట్‌నీల్ బార్ట్‌మ‌న్ లు త‌లా 2 వికెట్లు తీయ‌గా, కేశ‌వ్ మ‌హ‌రాజ్‌కు 1 వికెట్ ద‌క్కింది.

Advertisement

తాజావార్తలు

Advertisement