త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khushi Mukherjee | సూర్య‌కుమార్ యాద‌వ్ నాతో త‌ర‌చూ మాట్లాడేవాడు.. బాలీవుడ్ న‌టి సంచ‌ల‌నం..

Khushi Mukherjee | భార‌త క్రికెట్ జ‌ట్టులో ఉండే ప్లేయ‌ర్ల‌కు బాలీవుడ్‌తో సంబంధాలు ఉండ‌డం కొత్తేమీ కాదు. కొంద‌రు ప్లేయ‌ర్లు న‌టీమ‌ణుల‌తో బ‌హిరంగంగానే డేటింగ్ చేశారు. మ‌రికొంద‌రి సంబంధాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు కూడా వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ న‌టి భార‌త టీ20 క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.

S

Sports | Published On Dec 31, 2025, 9.59 am IST

Khushi Mukherjee | సూర్య‌కుమార్ యాద‌వ్ నాతో త‌ర‌చూ మాట్లాడేవాడు.. బాలీవుడ్ న‌టి సంచ‌ల‌నం..
Advertisement

Khushi Mukherjee | భార‌త క్రికెట్ జ‌ట్టులో ఉండే ప్లేయ‌ర్ల‌కు బాలీవుడ్‌తో సంబంధాలు ఉండ‌డం కొత్తేమీ కాదు. కొంద‌రు ప్లేయ‌ర్లు న‌టీమ‌ణుల‌తో బ‌హిరంగంగానే డేటింగ్ చేశారు. మ‌రికొంద‌రి సంబంధాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు కూడా వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ న‌టి భార‌త టీ20 క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. త‌న‌తో సూర్య‌కుమార్ యాద‌వ్ త‌ర‌చూ మాట్లాడేవాడ‌ని బ‌హిరంగంగానే వ్యాఖ్య‌లు చేసింది. దీంతో ఆమె కామెంట్స్ ప్ర‌స్తుతం ఇటు క్రికెట్ వ‌ర్గాల‌తోపాటు సామాజిక మాధ్య‌మాల్లో, బాలీవుడ్‌లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. బాలీవుడ్ న‌టి ఖుషి ముఖ‌ర్జీ తాజాగా ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ ఆ వ్యాఖ్య‌లు చేసింది. దీంతో ఆమె కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మీరు క్రికెట‌ర్‌తో డేటింగ్ చేసేందుకు ఇష్ట‌ప‌డతారా..? అని ఓ రిపోర్ట‌ర్ ఆమెను ప్ర‌శ్నించ‌గా అందుకు ఆమె బ‌దులిస్తూ.. చాలా మంది క్రికెట‌ర్లు త‌న వెంట ప‌డ్డార‌ని, అందులో సూర్య‌కుమార్ యాదవ్ కూడా ఉన్నాడ‌ని తెలిపింది. అత‌ను త‌న‌తో త‌ర‌చూ మాట్లాడేవాడ‌ని, మెసేజ్‌లు చేసేవాడ‌ని, కానీ ఇప్పుడు మాట్లాడ‌డం లేద‌ని, దూరంగా ఉంటున్నాన‌ని తెలిపింది. అయితే తాను ఏ క్రికెట‌ర్‌తో అయినా స‌రే రిలేష‌న్‌లో ఉంటే అది అంద‌రికీ తెలిసేలా చేస్తాన‌ని, పుకార్లు వ్యాప్తి అయ్యేలా చూడ‌న‌ని తెలిపింది. ఇక ఖుషి ముఖ‌ర్జీ చేసిన కామెంట్స్‌పై సూర్య కుమార్ యాదవ్ స్పందించ‌లేదు. కానీ ఆయ‌న ఫ్యాన్స్ మాత్రం ఆమెపై మండిప‌డుతున్నారు. సూర్య‌కుమార్ యాద‌వ్ కు క్లీన్ ఇమేజ్ ఉంద‌ని, వ్య‌క్తిగ‌త విష‌యాల్లో చాలా హుందాగా ఉంటాడ‌ని, ఇలాంటి విష‌యాల జోలికి వెళ్ల‌డ‌ని ఫ్యాన్స్ అంటున్నారు. న‌టి ఖుషి ముఖ‌ర్జీ ప‌బ్లిసిటీ కోసం, సినిమాల్లో ఆఫ‌ర్లు రావ‌డం కోసం ఇలా సూర్య‌కుమార్ పేరును వాడుకుంటుంద‌ని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

కాగా సూర్య‌కుమార్ యాద‌వ్ ప్ర‌స్తుతం త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇప్ప‌టికే ఆయ‌న కెప్టెన్ గా బీసీసీఐ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టును కూడా ప్ర‌క‌టించింది. ఆ జ‌ట్టుకు అక్ష‌ర్ ప‌టేల్ వైస్ కెప్టెన్‌గా నియ‌మితుడ‌య్యాడు. అయితే ఫామ్ విష‌య‌మే సూర్య‌కుమార్‌ను చాలా ఇబ్బంది పెడుతోంది. గ‌త 20 ఇన్నింగ్స్‌లో సూర్య మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. దీంతో అత‌ని ఫామ్ అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో సొంత గ‌డ్డ‌పై కివీస్‌తో జ‌ర‌గ‌నున్న 5 టీ20ల సిరీస్‌లో అయినా స‌త్తా చాటాల‌ని, వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో పూర్తి ఆత్మ‌విశ్వాసంతో అడుగు పెట్టాల‌ని సూర్య ఆలోచిస్తున్నాడు. కాగా సూర్య‌కుమార్ యాద‌వ్ ముక్కోటి ఏకాద‌శి సంద‌ర్భంగా తాజాగా తిరుమ‌ల శ్రీ‌వారిని కుటుంబ స‌భ్యుల‌తో స‌హా ద‌ర్శించుకున్నాడు. ఇక ఖుషి ముఖ‌ర్జీ ఎంటీవీ ఆధ్వ‌ర్యంలో గ‌తంలో నిర్వ‌హించిన స్ల్పిట్స్ విల్లాతో పాపుల‌ర్ అయింది. ఆమె ప‌లు సినిమాలు, మ్యూజిక్ వీడియోలు, డిజిట‌ల్ ప్రాజెక్టుల్లో న‌టించింది. కానీ త‌న గ్లామ‌రస్ దుస్తుల‌తో మాత్రం నిత్యం సోష‌ల్ మీడియాలో ఆక‌ట్టుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by E24 Bollywood (@e24official)

Advertisement

తాజావార్తలు

Advertisement