త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs MAL U-19 Asia Cup | అండ‌ర్ 19 ఆసియా క‌ప్‌.. డ‌బుల్ సెంచ‌రీతో చ‌రిత్ర సృష్టించిన‌ భార‌త ప్లేయ‌ర్ కుందు..

S

Sports | Published On Dec 16, 2025, 2.03 pm IST

IND Vs MAL U-19 Asia Cup | అండ‌ర్ 19 ఆసియా క‌ప్‌.. డ‌బుల్ సెంచ‌రీతో చ‌రిత్ర సృష్టించిన‌ భార‌త ప్లేయ‌ర్ కుందు..
Advertisement

IND Vs MAL U-19 Asia Cup | దుబాయ్ వేదిక‌గా అండ‌ర్ 19 ఆసియా క‌ప్ టోర్నీలో భాగంగా మ‌లేషియాతో జ‌రుగుతున్న వ‌న్డే మ్యాచ్‌లో భార‌త ప్లేయ‌ర్ అభిజ్ఞాన్‌ కుందు డ‌బుల్ సెంచ‌రీతో స‌త్తా చాటాడు. 125 బంతులు ఆడిన కుందు 17 ఫోర్లు, 9 సిక్స‌ర్ల‌తో 209 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో మ‌లేషియా అండ‌ర్ 19 టీమ్‌పై భార‌త్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌ను కోల్పోయిన భార‌త్ 408 ప‌రుగులు చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన మ‌లేషియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా భార‌త్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో భార‌త ప్లేయ‌ర్లు మొద‌టి 10 ఓవ‌ర్ల ప‌వ‌ర్ ప్లేలో దూకుడుగా ఆడారు. ఆ త‌రువాత నెమ్మ‌దిగా ఆడుతూ 6కు పైగా ర‌న్ రేట్ ఉండేలా క్రీజులో నిలిచారు. అనంత‌రం చివ‌రి ఓవ‌ర్ల‌లో మ‌ళ్లీ బ్యాట్ ఝులిపించారు. దీంతో భారీ స్కోరు చేయ‌గ‌లిగారు.

భార‌త ఇన్నింగ్స్‌లో కుందుతోపాటు వేదాంత్ త్రివేది, వైభ‌వ్ సూర్య‌వంశీలు అర్థ సెంచ‌రీల‌తో రాణించారు. 106 బంతులు ఆడిన త్రివేది 7 ఫోర్ల‌తో 90 ప‌రుగులు చేసి ఔట్ అవ‌గా, సూర్య‌వంశీ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల‌తో 50 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. ఇక మ‌లేషియా బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ అక్ర‌మ్ 5 వికెట్లు తీయ‌గా, శ‌త్న‌కుమ‌ర‌న్‌, కృష్ణ‌మూర్తి చెరొక వికెట్ తీశారు.

కాగా అండ‌ర్ 19 ఆసియా క‌ప్ వ‌న్డే టోర్నీల్లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు సాధించిన బ్యాట్స్‌మ‌న్‌గా కుందు రికార్డు సృష్టించాడు. అలాగే డ‌బుల్
ఈ టోర్నీల్లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన రెండో ప్లేయ‌ర్‌గా కూడా కుందు రికార్డుల‌కెక్కాడు. ఇక ఈ మ్యాచ్‌లో భార‌త్ నిర్దేశించిన 409 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మ‌లేషియా ఛేదించాల్సి ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement