త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asia Cup | ఈ క‌ప్పూ అందుకోలే.. న‌ఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ.. నిరాక‌రించిన భార‌త్‌

Asia Cup | ఆసియా క‌ప్‌లో (Asia Cup) మ‌ళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌ టోర్నీ విజేత‌గా భార‌త్ ( Indian women's team) నిలిచింది. క‌ప్ ప్ర‌జెంటేష‌న్ వేడుక‌కు ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

G

Sports | Published On Sep 14, 2026, 6.41 am IST

Asia Cup | ఈ క‌ప్పూ అందుకోలే.. న‌ఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ.. నిరాక‌రించిన భార‌త్‌
Advertisement

Asia Cup | త్రినేత్ర‌.న్యూస్‌: ఆసియా క‌ప్‌లో (Asia Cup) మ‌ళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌ టోర్నీ విజేత‌గా భార‌త్ ( Indian women's team) నిలిచింది. క‌ప్ ప్ర‌జెంటేష‌న్ వేడుక‌కు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. బ‌హుమ‌తులు ఇచ్చేందుకు అతిథులు వేదిక‌పైకి వ‌చ్చారు. అయితే ట్రోఫీ (Asia Cup trophy) అందుకునేంద‌కు మాత్రం భార‌త జ‌ట్టు నిరాక‌రించింది. కార‌ణం.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్య‌క్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ న‌ఖ్వీ (Mohsin Naqv). అత‌ని చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు టీమ్ ఇండియా నిరాక‌రించింది. దీంతో అర‌గంట‌పాటు వేచి చూసిన న‌ఖ్వీ... ట్రోఫీ స‌హా స్టేడియం బ‌య‌ట‌కు ప‌రుగులు తీశాడు. గ‌తేడాది పురుషుల ఆసియా క‌ప్ ఫైన‌ల్లోనే ఇదే విధంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే.

శ్రీలంక‌తో (Sri Lanka,) జ‌రిగిన ఫైన‌ల్‌లో 72 ప‌రుగుల తేడాతో టీమ్ఇండియా మ‌హిళ‌ల జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. మ్యాచ్ అనంత‌రం హ‌ర్మ‌న్ కౌర్ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు ఎప్ప‌టిలానే సంబురాలు చేసుకుంది. ప్ర‌సార సంస్థ‌కు ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చింది. సాధ‌రంగా మ్యాచ్ ముగిసిన 15 నుంచి 20 నిమిషాల్లో బ‌హుమ‌తుల ప్ర‌దాన కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. ఇక్క‌డ మాత్రం గంట‌కుపైగా ఆల‌స్య‌మైంది. వేదిక‌పై న‌ఖ్వీ ఉండ‌టంతో భార‌త జ‌ట్టు మైదానంలోకి బ‌య‌ట‌కు రాలేదు. దీంతో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన శ్రీలంక కెప్టెన్ చ‌మ‌రి ఆట‌పట్టుకు ఆయ‌న బ‌హుమ‌తి చెక్కును అంద‌జేసి వెళ్లిపోయారు.

ఆసియా క‌ప్ టోర్నీలో ఒక్క ఓట‌మీ లేకుండా ఫైన‌ల్‌లోకి ప్ర‌వేశించిన భార‌త్‌.. ఆదివారం శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసి 5 వికెట్ల న‌ష్టానికి 183 ల‌క్ష్యాన్ని నిర్ధేశించింది. అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన లంక‌.. 20 ఓవ‌ర్ల‌లో 111 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. తెలుగ‌మ్మాయి శ్రీచ‌ర‌ణి (4/20), దీప్తి శ‌ర్మ (3/19) లంక ఓట‌మిని శాసించారు. కాగా, ఆసియాక‌ప్ ఇప్ప‌టివ‌ర‌కు 10 సార్లు జ‌రిగితే ఎనిమిది ప‌ర్యాయాలు (2004, 2005, 2006, 2008, 2012, 2016, 2022, 2026) భార‌త్ విజేత నిలిచింది. 2018లో బంగ్లాదేశ్, 2024లో శ్రీలంక ఒక్కోసారి ట్రోఫీ ద‌క్కించుకున్నాయి. భార‌త్ టీ20, వ‌న్డే ఫార్మాట్ల‌లో నాలుగుసార్ల చొప్పున క‌ప్‌ను గెలిచింది.

Advertisement
Advertisement