త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hardik Pandya | సూప‌ర్‌కార్‌ను కొన్న హార్దిక్ పాండ్యా.. ధ‌ర ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు..

Hardik Pandya | భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026లో విజయం సాధించిన కొద్ది రోజుల అనంత‌రం స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త సూపర్‌కార్‌ను కొనుగోలు చేశాడు. తన కార్ల సేకరణలో తాజాగా లగ్జరీ ఫెరారీ 12సిలిండ్రి (Ferrari 12 Cilindri) కారును చేర్చాడు. ఈ సూపర్‌కార్ ధర సుమారు రూ.12 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

S

Sports | Published On Mar 15, 2026, 5.11 pm IST

Hardik Pandya | సూప‌ర్‌కార్‌ను కొన్న హార్దిక్ పాండ్యా.. ధ‌ర ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు..
Advertisement

Hardik Pandya | భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026లో విజయం సాధించిన కొద్ది రోజుల అనంత‌రం స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త సూపర్‌కార్‌ను కొనుగోలు చేశాడు. తన కార్ల సేకరణలో తాజాగా లగ్జరీ ఫెరారీ 12సిలిండ్రి (Ferrari 12 Cilindri) కారును చేర్చాడు. ఈ సూపర్‌కార్ ధర సుమారు రూ.12 కోట్లుగా అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో హార్దిక్ బ్లాక్ క‌ల‌ర్‌ కన్వర్ట‌బుల్ కారును నడుపుతుండగా అతని స్నేహితురాలు మహికా శర్మ పక్కన కూర్చుని కనిపించింది. ఇప్పటికే హార్దిక్ వద్ద రోల్స్-రాయిస్ ఫాంటమ్, లంబోర్గిని హురాకాన్ ఈవో, లంబోర్గిని ఉరస్, మెర్సిడెస్-ఏఎంజీ జీ63, రేంజ్ రోవర్ వోగ్, ఆడి ఏ6 వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. తాజా కారు వాటి స‌ర‌స‌న చేరింది.

https://twitter.com/mufaddal_vohra/status/2033079485587980767

కారు ఫీచ‌ర్లు ఇవే..

హార్దిక్ పాండ్యా కొనుగోలు చేసిన ఫెరారీ 12సిలిండ్రి సూపర్‌కార్‌లో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ సూపర్‌కార్ లో 6.5 లీటర్ల వి12 ఇంజిన్ ఉంది. ఇది 7,250 ఆర్‌పీఎమ్ వద్ద గరిష్ఠంగా 678 ఎన్‌ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 9,500 ఆర్‌పీఎమ్ వద్ద 818 బీహెచ్‌పీ గరిష్ఠ శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంది. గంటకు 340 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ఈ కారు ప్ర‌యాణించ‌గ‌ల‌దు. ఈ కారు కేవలం 2.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. డ్రైవర్‌తో కలిపి ఇద్దరు కూర్చునే సామర్థ్యం ఇందులో ఉంది. ఈ కారు ఇంధన ట్యాంక్ సామర్థ్యం 92 లీటర్లుగా ఉంది.

పాండ్యా ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌..

ఇక టీ20 ప్రపంచకప్ 2026లో హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత జట్టు ఏకపక్ష విజయాన్ని సాధించి టైటిల్ గెలుచుకుంది. బ్లాక్‌క్యాప్స్‌పై భారత్ 95 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నమెంట్‌లో హార్దిక్ తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 217 పరుగులు చేసి మంచి ప్రదర్శన ఇచ్చాడు. అతని సగటు 27.12 కాగా స్ట్రైక్ రేట్ 160.74గా ఉంది. టోర్నమెంట్‌లో అతను రెండు అర్ధశతకాలు సాధించాడు. వాటిలో ఒకటి మొదటి రౌండ్‌లో నమీబియాపై, మరొకటి సూపర్ ఎయిట్ దశలో జింబాబ్వేపై నమోదు చేశాడు. 32 ఏళ్ల ఈ స్టార్ ఆల్‌రౌండర్ బౌలింగ్‌లో కూడా మెరిశాడు. మొత్తం తొమ్మిది మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు సాధించాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 2/16 గా న‌మోద‌య్యాయి. ఒక ఎండ్ నుంచి కొత్త బంతితో బౌలింగ్ చేస్తూ జట్టులో కీలక పాత్ర పోషించాడు. అతని కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తోపాటు స్వింగ్ బౌలింగ్ కారణంగా ప్రత్యర్థి బ్యాటర్లు అతనిని ఎదుర్కోవడం కష్టంగా మారింది.

Advertisement
Advertisement