Hardik Pandya | వాలెంటైన్స్ డే స్పెషల్.. పాండ్యా కొత్త టాటూ.. అర్థం ఏమిటంటే..?
Hardik Pandya | టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇటీవల ఢిల్లీలో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో పాండ్యా 52 పరుగులతో బ్యాటర్‌గా రాణించడమే కాకుండా 2 వికెట్లు తీసి బౌలర్‌గా కూడా అదిరిపోయే ప్రదర్శన చేశాడు.
Hardik Pandya | టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇటీవల ఢిల్లీలో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో పాండ్యా 52 పరుగులతో బ్యాటర్‌గా రాణించడమే కాకుండా 2 వికెట్లు తీసి బౌలర్‌గా కూడా అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. అయితే మైదానంలో పాండ్యా ప్రదర్శన ఈ మధ్య కాలంలో అత్యుత్తమంగా ఉంటున్నప్పటికీ అతని వ్యక్తిగత జీవితం మాత్రం నిన్న మొన్నటి వరకు ఒడిదుడుకులుగా కొనసాగింది. భార్య నటాషాకు విడాకులు ఇచ్చిన అనంతరం చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్న పాండ్యా తరువాత మహికా శర్మతో ప్రేమలో పడ్డాడు. తరువాత వారి బంధం అన్యోన్యంగా కొనసాగుతోంది. అయితే ఫిబ్రవరి 14, 2026 వాలెంటైన్స్ డే నేపథ్యంలో పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ మహికా గుర్తుగా తన మెడ భాగంపై ఓ ఆకర్షణీయమైన టాటూ వేయించుకున్నాడు.
M అక్షరం, రెండు చిరుత పులులు..
ప్రముఖ సెలబ్రిటీ టాటూ ఆర్టిస్ట్ సన్నీ భానుశాలి స్థాపించిన ఎలియన్స్ టాటూ స్టూడియోలో లీడ్ ఆర్టిస్ట్ తుషార్ మరానే స్వయంగా పాండ్యా మెడపై ఓ టాటూ వేశారు. ఆ టాటూలో మహికా పేరులోని మొదటి అక్షరం M ఉండడంతోపాటు రెండు చిరుత పులులు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒక పులి స్పష్టమైన రూపంలో కనిపిస్తుండగా, మరో పులి బొమ్మ గీతల ఆకారం, నీడలతో కనిపిస్తోంది. అంటే ఆ రెండు పులులను పాండ్యా తాను, తన గర్ల్ ఫ్రెండ్‌గా అభివర్ణిస్తూ చెబుతున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆ పులులు ముందుకు కదలడాన్ని చూస్తుంటే వారు కూడా అంతే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న భావనను కలిగిస్తాయి. అందుకనే పాండ్యా ఆ టాటూను అలా వేయించాడని స్పష్టమవుతోంది.
అర్థం ఇదే..
ఇక పాండ్యా టాటూపై సన్నీ భానుశాలి మాట్లాడుతూ హార్దిక్ మొదట ఒక ఇనిషియల్ ఆలోచనతో వచ్చాడు. కానీ మాట్లాడుతుండగా, వారి బంధం ఎంతో లోతైనదని అర్థమైంది. వారు ఒకరినొకరు బలపరిచే భాగస్వాములుగా తమను తాము వివరించారు. అందుకే చిరుతపులి సరైన రూపంగా అనిపించింది. ఒంటరిగా బలమైనది, కలిసి ఉంటే ఆపలేనిది.. అనే అర్థం వచ్చేలా టాటూ వేశాం. ఈ టాటూ అలంకారం కాదు, జీవిత కథ. ఇది నమ్మకం, భావోద్వేగాలతో రూపుదిద్దుకుంది.. అన్నారు. ఈ క్రమంలోనే పాండ్యా కొత్త టాటూ తాలూకు ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Hardik Pandya | గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి.. డేట్ కూడా ఫిక్స్..?
మే 16, 2026

Mumbai Indians | రోహిత్ గాయంపై అప్డేట్ ఇచ్చిన హెడ్‌కోచ్ జయవర్ధనే..!
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



