Finn Allen | మేం ఎవరిపైనైనా గెలవగలం: ఫిన్ అలెన్
Finn Allen | న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ చాలా కాలంగా క్రికెట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హిట్టర్‌గా గుర్తింపు పొందాడు. తాజాగా టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో అతని అద్భుత ప్రదర్శన న్యూజిలాండ్‌ను ఫైనల్‌కు చేర్చింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో అలెన్ కేవలం 33 బంతుల్లోనే శతకం సాధించి రికార్డు సృష్టించాడు.
Finn Allen | న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ చాలా కాలంగా క్రికెట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హిట్టర్‌గా గుర్తింపు పొందాడు. తాజాగా టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో అతని అద్భుత ప్రదర్శన న్యూజిలాండ్‌ను ఫైనల్‌కు చేర్చింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో అలెన్ కేవలం 33 బంతుల్లోనే శతకం సాధించి రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 8 సిక్సర్లు, 10 ఫోర్లు బాదుతూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 170 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే చేధించింది. అతని ఈ సెంచరీతో గతంలో క్రిస్ గేల్ 2016లో 47 బంతుల్లో చేసిన టీ20 వరల్డ్ కప్ శతకం రికార్డును అలెన్ బద్దలు కొట్టాడు. బలమైన శరీరాకృతితో ఉన్న అలెన్ క్రీజులో నిలబడగానే ప్రత్యర్థి బౌలర్లకు ఒత్తిడి కలిగిస్తాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అతని ఆటను ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ తో పోలుస్తున్నారు.
మాథ్యూ హేడెన్ లాంటి ఆట..
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మాట్లాడుతూ మాథ్యూ హేడెన్ కాలంలో అతను కేవలం తన స్థిరమైన స్టాన్స్‌తోనే బౌలర్లను భయపెట్టేవాడు. కొంతకాలం గ్రేమ్ స్మిత్ కూడా అలాగే ఉండేవాడు. ఇప్పుడు ఫిన్ అలెన్ కూడా అదే ప్రభావం చూపుతున్నాడు. బౌలింగ్‌కు పరుగెత్తుకుంటూ వస్తున్నప్పుడు అతను ఒక భారీ వ్యక్తిలా కనిపిస్తాడని అన్నారు. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో యాన్సెన్ వేసిన ఓ ఓవర్‌లో అలెన్ వరుసగా రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు, మళ్లీ ఒక ఫోర్ బాదుతూ మ్యాచ్‌ను ఒక్కసారిగా మార్చేశాడు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోల్ మెక్‌కోన్షి మాట్లాడుతూ అద్భుతమైన హిట్టింగ్, ప్రపంచ స్థాయి స్ట్రైకింగ్, అలెన్ చాలా కాలంగా ఇలా ఆడుతున్నాడు. కానీ ఇలాంటి పెద్ద వేదికపై ఇలా ఆడడం ప్రత్యేకం.. అని ప్రశంసించాడు.
ఎవరిపైనైనా గెలవగలం: అలెన్
26 ఏళ్ల అలెన్ 2021 మార్చిలో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2024లో పాకిస్తాన్‌పై డునెడిన్‌లో జరిగిన మ్యాచ్‌లో 62 బంతుల్లో 137 పరుగులు, అందులో 16 సిక్సర్లు బాది ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. కాగా ఇప్పుడు టోర్నమెంట్‌లో ఈడెన్ గార్డెన్స్ మైదానంలో చేసిన అజేయ శతకం అతని కెరీర్‌లో మూడో టీ20 అంతర్జాతీయ శతకం కావడం విశేషం. ఇప్పుడు న్యూజిలాండ్ జట్టు ఫైనల్లో భారత్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనుంది. న్యూజిలాండ్ జనాభా కేవలం 5.3 మిలియన్లు మాత్రమే ఉన్నప్పటికీ, దేశ ప్రజలంతా తమ జట్టుకు మద్దతుగా నిలుస్తారని అలెన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. మా దేశం మొత్తం మా వెంటే నిలబడాలని ఆశిస్తున్నాను. ఆదివారం ఫైనల్‌ను చూడడానికి సోమవారం పని నుంచి సెలవు తీసుకుని అయినా మ్యాచ్ చూడాలని అభిమానులను కోరుతున్నాను. మా జట్టుకు మంచి మొమెంటం ఉంది. మేము ఉత్తమ ఆట ఆడితే ఎవరిపైనైనా గెలవగలం.. అని అలెన్ తెలిపాడు. అయితే ఫైనల్‌లో భారత్‌తో అతను ఎలాంటి ప్రదర్శన చేస్తాడు.. అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

Gold Ring Falls Into Train Toilet | ప్రయాణికుడి చేతి నుంచి ట్రైన్ టాయిలెట్లోకి జారిపోయిన గోల్డ్ రింగ్.. తర్వాత ఏమైందంటే..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



