Hardik Pandya | హార్దిక్ పాండ్యా టెస్టుల్లోకి వస్తాడా..? ఆ ఒక్కటే మిగిలింది..!
Hardik Pandya | గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మారిన తరువాత వైట్ బాల్ క్రికెట్‌లో టీమిండియా రాణిస్తోంది. కానీ టెస్టుల్లో మాత్రం చతికిలపడుతోంది. సొంత గడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతుల్లో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ అయిన టీమిండియా ఎన్నో ఏళ్ల పాటు కాపాడుకుంటూ వస్తున్న అనేక రికార్డులను సైతం కోల్పోయింది.
Hardik Pandya | గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మారిన తరువాత వైట్ బాల్ క్రికెట్‌లో టీమిండియా రాణిస్తోంది. కానీ టెస్టుల్లో మాత్రం చతికిలపడుతోంది. సొంత గడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతుల్లో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ అయిన టీమిండియా ఎన్నో ఏళ్ల పాటు కాపాడుకుంటూ వస్తున్న అనేక రికార్డులను సైతం కోల్పోయింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌తోపాటు విశ్లేషకులు, మాజీలు కూడా గంభీర్ కోచింగ్, ప్లేయర్ల సెలెక్షన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు. టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఇప్పటికే 6వ స్థానంలో ఉన్న టీమిండియా మొదటి రెండు స్థానాల్లో నిలవడం కష్టంగా మారింది. ఓ వైపు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి ప్లేయర్లు టెస్టుల నుంచి రిటైర్ అవడం, మరోవైపు సెలక్షన్ లోపాలు, కోచింగ్ వంటి అంశాల కారణంగా భారత టెస్టు క్రికెట్ జట్టు ఇంటా బయటా విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే ఇలాంటి పరిస్థితిలో హార్దిక్ పాండ్యా టెస్టుల్లోకి వస్తే బాగుంటుందని పలువురు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ రాబిన్ ఊతప్ప ఇదే విషయంపై తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియోలో మాట్లాడారు.
పాండ్యా నం.7లో ఆడాలి..
భారత క్రికెట్ జట్టు టెస్టు చాంపియన్‌షిప్‌లో బాగా వెనుకబడడంతో కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్‌పై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. బీసీసీఐ కూడా టెస్టు జట్టులో మార్పులు చేయడంతోపాటు టెస్టులకు కోచ్‌గా గంభీర్‌ను తొలగించాలని చూస్తోంది. ఆయన స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి స్థితిలో హార్దిక్ పాండ్యా టెస్టుల్లోనూ ఆడితే జట్టుకు ఎంతో సపోర్ట్ లభిస్తుంది.. అని రాబిన్ ఊతప్ప అన్నారు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం వన్డేలు, టీ20ల్లో కీలక ప్లేయర్‌గా ఉన్నాడు. ఓ వైపు ఫాస్ట్ బౌలర్‌గా వికెట్లు తీస్తూ రాణిస్తూనే మరో వైపు బ్యాటింగ్‌లో సత్తా చాటుతున్నాడు. కనుక అతను టెస్టుల్లోకి వచ్చి నంబర్ 7 స్థానంలో ఆడాలి. అతని వల్ల టెస్టు జట్టుకు బలం లభిస్తుంది. అతను ఒక అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్. కనుక టెస్టుల్లో అతను వస్తే టీమిండియాకు ఎంతో సపోర్ట్ ఉంటుంది. మళ్లీ టెస్టు చాంపియన్ షిప్ బాట పట్టే అవకాశం ఉంటుంది.. అని ఊతప్ప అన్నారు.
పాండ్యా ఎందుకు టెస్టులు ఆడడం లేదు..?
హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా కేవలం వైట్ బాల్ క్రికెట్ మాత్రమే రొటేషన్ పద్ధతిలో ఆడుతున్నాడు. అతను ముఖ్యమైన టోర్నీలతోపాటు ఐసీసీ టోర్నీల్లోనూ ఆడుతూ సత్తా చాటుతున్నాడు. అయితే అతను టెస్టుల్లో ఆడితే బాగుంటుంది. హార్దిక్ ఖాతాలో ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ వంటి ట్రోఫీలు ఉన్నాయి. కనుక అతను టెస్టుల్లోనూ ఆడితే టీమిండియా టెస్టు చాంపియన్ షిప్‌ను సాధించే అవకాశాలు ఉంటాయి. అప్పుడు అతను అన్ని ఫార్మాట్లలోనూ ట్రోఫీలను సాధించిన జట్టులో ప్లేయర్‌గా నిలుస్తాడు. అది అతనికి కూడా గర్వకారణమే. ఆ ప్రయాణంలో అతను ఇప్పటికే సగం ఫీట్ సాధించేశాడు. మిగిలిన సగం టెస్టుల్లో ఆడితే నెరవేరుతుంది. అతను టెస్టుల్లో రాణిస్తాడన్న నమ్మకం ఉంది.. అని రాబిన్ వ్యాఖ్యలు చేశాడు. అయితే అతని వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీశాయి. అసలు హార్దిక్ ఇప్పటి వరకు టెస్టులు ఆడాడా, అతను టెస్టు క్రికెట్ ఎందుకు ఆడడం లేదు..? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
బీసీసీఐ ఏమంటుంది..?
హార్దిక్ పాండ్యా టెస్టుల్లో 2017లో ప్రవేశించాడు. అప్పటి నుంచి 2018 వరకు 11 టెస్టు మ్యాచ్‌లలో ఆడాడు. ఆ తరువాత మళ్లీ ఇప్పటి వరకు పాండ్యా టెస్టులు ఆడలేదు. అతను ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కనుక బీసీసీఐ అతనికి ఉన్న వర్క్ లోడ్ దృష్ట్యా టెస్టులను ఆడించడం లేదు. కేవలం టీ20, వన్డే స్పెషలిస్ట్‌గా పాండ్యా ఉన్నాడు. అయితే పాండ్యా టెస్టులలోకి వస్తే టీమిండియాకు అదనపు బలం లభిస్తుందని మాజీలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కనుక బీసీసీఐ ఆ దిశగా కూడా పునరాలోచన చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పాండ్యా కూడా టెస్టులు ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. అలా రెండు రకాలుగా ప్రయత్నం జరిగితేనే పాండ్యా టెస్టుల్లోకి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. మరి బీసీసీఐ ఆ దిశగా ప్రయత్నం చేస్తుందా..? అసలు పాండ్యా మనసులో ఏముంది..? ఇకపై అతను టెస్టులు ఆడుతాడా..? లేదా..? అన్న విషయాలు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Hardik Pandya | గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి.. డేట్ కూడా ఫిక్స్..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



