Monty Desai | కెనడా హెడ్‌కోచ్‌గా మోంటీ దేశాయ్..!
Monty Desai | అంతర్జాతీయ స్థాయిలో మరింత స్థిరంగా రాణించే లక్ష్యంతో క్రికెట్ కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. పురుషుల జట్టు హెడ్‌కోచ్‌గా మోంటీ దేశాయ్‌ని నియమించింది. అసోసియేట్ జట్లను పోటీ స్థాయికి తీసుకెళ్లడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన రాకతో కెనడా క్రికెట్‌లో మార్పులు కనిపిస్తాయని వర్గాలు భావిస్తున్నారు.
Monty Desai | అంతర్జాతీయ స్థాయిలో మరింత స్థిరంగా రాణించే లక్ష్యంతో క్రికెట్ కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. పురుషుల జట్టు హెడ్‌కోచ్‌గా మోంటీ దేశాయ్‌ని నియమించింది. అసోసియేట్ జట్లను పోటీ స్థాయికి తీసుకెళ్లడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన రాకతో కెనడా క్రికెట్‌లో మార్పులు కనిపిస్తాయని వర్గాలు భావిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల కోచింగ్ అనుభవం కలిగిన దేశాయ్, గతంలో అనేక జట్లతో పనిచేశారు. ముఖ్యంగా నేపాల్ నేషనల్ క్రికెట్ టీమ్‌తో ఆయన మంచి ఫలితాలు సాధించారు. ఆయన పర్యవేక్షణలో నేపాల్ మళ్లీ వన్డే హోదాను సంపాదించడమే కాకుండా పలు అంతర్జాతీయ టోర్నీలకు అర్హత సాధించింది. అలాగే ఆప్ఘనిస్తాన్ నేషనల్ క్రికెట్ జట్టు, యూఏఈ, వెస్టిండిస్ క్రికెట్ టీమ్‌లతోనే కలిసి పని చేసిన అనుభవం ఉంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించడంలో ఆయన పాత్ర కీలకం.
కొత్త బాధ్యతపై స్పందించిన దేశాయ్, ఈ అవకాశాన్ని గౌరవంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. జట్టులో నమ్మకం, క్రమశిక్షణ, ధైర్యం పెంపొందితే పెద్ద ఫలితాలు సాధ్యమని పేర్కొన్నారు. గతంలో కొన్ని జట్లు సాధించిన విజయాలు అదే విషయాన్ని నిరూపించాయని, కెనడా కూడా ఆ దిశగా ముందుకు వెళ్లగల సామర్థ్యం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వేదికపై జట్టును స్థిరంగా నిలబెట్టడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో కెనడా పాల్గొనడం తర్వాత, భవిష్యత్ టోర్నీలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డు అధ్యక్షుడు అర్వింద్ కోషా మాట్లాడుతూ జట్టు ప్రదర్శనలో మెరుగుదలతో పాటు సంస్థ ప్రతిష్టను పెంచడం తమ లక్ష్యమని అన్నారు. దేశాయ్ అనుభవం, స్పష్టమైన దృష్టి జట్టుకు ఉపయోగపడుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యదర్శి పరన్‌జిత్ సైని ఆయనకు స్వాగతం పలుకుతూ.. పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IPL 2026 | రాజస్థాన్ రాయల్స్‌కు షాక్.. గాయంతో ఐపీఎల్‌కు సామ్ కర్రన్ దూరం..?
మార్చి 20, 2026

T20 World Cup Final | బ్యాట్ Vs బాల్.. అహ్మదాబాద్ వేదికగా నేడు రసవత్తర పోరు
మార్చి 8, 2026

Semifinal Qualification Scenario | వెస్టిండీస్, జింబాబ్వేపై గెలిస్తే భారత్ సెమీస్‌కు వెళ్తుందా..? సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..?
ఫిబ్రవరి 24, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



