త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ipl Auction | ఐపీఎల్ 2026 వేలంలో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన ఆట‌గాళ్లు ఎవ‌రంటే?

Ipl Auction | ఐపీఎల్ 2026 వేలంలో కామెరూన్ గ్రీన్ 25.20 కోట్ల‌తో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆట‌గాళ్ల‌లో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచాడు. గ్రీన్ త‌ర్వాత 18 కోట్ల‌తో మ‌తీశా ప‌తిర‌న సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు.

N

Sports | Published On Dec 16, 2025, 11.02 pm IST

Ipl Auction |  ఐపీఎల్ 2026 వేలంలో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన ఆట‌గాళ్లు ఎవ‌రంటే?

ఐపీఎల్ వేలం 2026

Advertisement

Ipl Auction | ఐపీఎల్ 2026 వేలం ముగిసింది. ఈ వేలంలో 77 స్లాట్స్‌కు గాను 359 మంది ప్లేయ‌ర్లు పోటీ ప‌డ్డారు. ఈ మినీ వేలంలో ఐపీఎల్ (Ipl) ఫ్రాంచైజ్‌లు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాయి. సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న‌పెట్టి యంగ్ టాలెంట్‌కు పెద్ద‌పీట వేశాయి. ఈ వేలంలో అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్లు అద‌ర‌గొట్టారు. ఒక్క ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్ కూడా ఆడిన‌ అనుభ‌వం లేని క్రికెట‌ర్ల‌పై ఫ్రాంచైజ్‌లు కోట్లు కుమ్మ‌రించాయి. మ‌రోవైపు సీనియ‌ర్లు చాలా మంది అన్‌సోల్డ్‌గానే మిగిలారు. ఈ వేలంలో ఇండియ‌న్ ప్లేయ‌ర్ల కంటే ఫారిన్ క్రికెట‌ర్లే ఎక్కువ ధ‌ర ప‌లిక‌డం గ‌మ‌నార్హం.
ఐపీఎల్ 2026 వేలంలో ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green) రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ ఆల్‌రౌండ‌ర్‌ను కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ 25 .20 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఈ వేలంలోనే కాకుండా ఐపీఎల్ హిస్ట‌రీలోనే అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన ఫారిన్ క్రికెట‌ర్‌గా గ్రీన్ నిలిచాడు.
శ్రీలంక పేస‌ర్ మ‌తీష ప‌తిర‌న కోసం అన్ని ఫ్రాంచైజ్‌లో పోటీప‌డ్డాయి. రెండు కోట్ల బేస్ ధ‌ర‌తో వేలంలోకి వ‌చ్చిన అత‌డిని కేకేఆర్ ఏకంగా 18 కోట్ల‌కు కొన్న‌ది
అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్లు ప్ర‌శాంత్ వీర్‌, కార్తీక్ శ‌ర్మ‌ల‌ను త‌లో 14.20 కోట్ల‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ (Csk) సొంతం చేసుకున్న‌ది. ఈ వేలంలో కాస్ట్‌లీ ప్లేయ‌ర్ల లిస్ట్‌లో వీరిద్ద‌రు మూడో స్థానంలో నిలిచారు. ఈ ఇద్ద‌రు అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్ల కోస‌మే చెన్నై 28.40 కోట్లు ఖ‌ర్చు చేసింది. జ‌డేజాకు రీప్లేస్‌గా ప్ర‌శాంత్ వీర్‌, ధోనీ స్థానాన్ని కార్తీక్ శ‌ర్మ‌తో భ‌ర్తీ చేసేందుకు సీఎస్‌కే ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.
ఇక ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ లియాన్ లివింగ్‌స్టోన్ గ‌త సీజ‌న్ కంటే ఈ సారి ఎక్కువే ధ‌ర ప‌లికాడు. గ‌త సీజ‌న్‌ల 8.75 కోట్ల‌కు ఆర్‌సీబీ అత‌డిని కొనుగోలు చేసింది. ఈ వేలంలో 13 కోట్ల‌కు హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ కు ఈ ప్లేయ‌ర్ అమ్ముడుపోయాడు. బంగ్లాదేశ్ పేస‌ర్ ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్ ఇప్ప‌టివ‌ర‌కు ఐదు సీజ‌న్స్‌లో ఆడాడు. రెండు కోట్ల బేస్ ధ‌ర దాట‌ని ఈ పేస‌ర్‌పై ఈ సారి కోల్‌క‌తా కోట్ల వ‌ర్షం కురిపించింది. ఏకంగా 9.20 కోట్ల‌కు అత‌డిని సొంతం చేసుకుంది.
వీరితో ఇండియ‌న్ అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్‌, జ‌మ్ము క‌శ్మీర్ క్రికెట‌ర్ అకిబ్ ధార్ 8.40 కోట్లు (ఢిల్లీ క్యాపిట‌ల్స్‌), ర‌వి బిష్టోయ్ 7.20 కోట్లు (రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌), జేస‌న్ హోల్డ‌ర్ ఏడు కోట్లు (గుజ‌రాత్ టైటాన్స్‌), వెంక‌టేష్ అయ్య‌ర్ ఏడు కోట్లు (ఆర్‌సీబీ) ఈ సారి వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికారు.

Advertisement

తాజావార్తలు

Advertisement