Vaibhav Suryavanshi | టీమిండియా జెర్సీలో వైభవ్ సూర్యవంశీ..? బీసీసీఐ కార్యదర్శి ఏమన్నారంటే..!
Vaibhav Suryavanshi | ఐపీఎల్-2026లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఈ బీహార్ యువ బ్యాటర్ భవిష్యత్‌పై నెలకొన్న చర్చలకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Vaibhav Suryavanshi | ఐపీఎల్-2026లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఈ బీహార్ యువ బ్యాటర్ భవిష్యత్‌పై నెలకొన్న చర్చలకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తం 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా 237.30 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ ఈ సీజన్‌లో తనదైన ముద్ర వేశాడు.
వైభవ్ భవిష్యత్‌పై బీసీసీఐ భరోసా
ఐపీఎల్ ముగిసిన అనంతరం స్పందించిన బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, వైభవ్ ప్రతిభను ప్రశంసిస్తూ అతనికి ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. "ఈ ఐపీఎల్ సీజన్ అద్భుతంగా సాగింది. వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన ఆర్సీబీకి అభినందనలు. వైభవ్ సూర్యవంశీ ప్రతిభావంతమైన యువ ఆటగాడు. అతడు అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు బీసీసీఐ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తాం" అని సైకియా తెలిపారు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో మరో అరుదైన రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు. కేవలం 15 సంవత్సరాల 65 రోజుల వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు సాయి సుదర్శన్ పేరిట ఉండేది. 2025లో 23 సంవత్సరాల 231 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. అంతకుముందు 2023లో శుభ్‌మన్ గిల్ సైతం యువ వయసులో ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు.
మహిళల టీ20 ప్రపంచకప్‌పైనా..
రానున్న మహిళల టీ20 ప్రపంచకప్‌పై కూడా దేవజిత్ సైకియా స్పందించారు. భారత మహిళల జట్టు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉందని, గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అద్భుత ప్రదర్శన చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కూడా ఐపీఎల్ టైటిల్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న ఆర్సీబీకి అభినందనలు తెలిపారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారని, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్‌లో టైటిల్ గెలవడం గొప్ప విజయమని పేర్కొన్నారు.
టీమిండియాకు అడుగుదూరంలో..
ఐపీఎల్-2026లో ఆరెంజ్ క్యాప్‌తో పాటు ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ అవార్డు సహా పలు వ్యక్తిగత పురస్కారాలను గెలుచుకున్న వైభవ్ సూర్యవంశీ.. భవిష్యత్‌కు కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. బీసీసీఐ కార్యదర్శి తాజా వ్యాఖ్యలతో త్వరలోనే వైభవ్ సూర్యవంశీ టీమిండియా జెర్సీలో కనిపించనున్నాడా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
జులై 26, 2026

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
జులై 26, 2026

CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్‌కు సిల్వర్..!
జులై 26, 2026
తాజావార్తలు
- ●Rice Business Success | టీసీఎస్ జాబ్ రిజెక్ట్ చేసి.. బియ్యం అమ్మి ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు!
- ●Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ

Rice Business Success | టీసీఎస్ జాబ్ రిజెక్ట్ చేసి.. బియ్యం అమ్మి ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు!

Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా



