త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఒలింపిక్స్‌లో ప‌త‌కాలు సాధించ‌డ‌మే ల‌క్ష్యం

CM Revanth Reddy | యువ‌త‌లో దాగి ఉన్న క్రీడా ప్ర‌తిభ‌ను వెలికి తీసి అంత‌ర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్ది, ఒలింపిక్స్‌లో పత‌కాలు సాధించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

S

Telangana | Published On Nov 3, 2026, 7.18 am IST

CM Revanth Reddy | ఒలింపిక్స్‌లో ప‌త‌కాలు సాధించ‌డ‌మే ల‌క్ష్యం
Advertisement

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష‌

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : యువ‌త‌లో దాగి ఉన్న క్రీడా ప్ర‌తిభ‌ను వెలికి తీసి అంత‌ర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్ది, ఒలింపిక్స్‌లో పత‌కాలు సాధించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్ క్రీడల పోటీల నిర్వహణ ఏర్పాట్లపై ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో సోమ‌వారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఈ పోటీలకు ఎక్కడా ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాల లోపం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. తెలంగాణ క్రీడా విధానం, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే క్రీడల హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు

ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే దీర్ఘ కాలిక లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, ప్రపంచస్థాయి క్రీడా శిక్షణను తెలంగాణ యువ క్రీడాకారులకు అందించేందుకు ఈ పోటీలు ఒక గొప్ప అవకాశంగా మలుచుకోవడం ప్రభుత్వ ఉద్దేశమని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించిన అన్ని వనరులను ఖేలో ఇండియా పోటీలకు సైతం ఉపయోగించుకునేలా సమాంతరంగా ఖేలో ఇండియా పోటీల ఏర్పాట్లు చెయ్యాలని సీఎం సూచించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో క్రీడలు, క్రీడాభివృద్ధికి సంబంధించిన పెట్టుబడుల ఆకర్షణ కూడా ఒక భాగం అయినందున అధికారులందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

గ్రూప్-1 స్థాయి అధికారుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించండి..

యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని సీఎం అన్నారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్ది ఖేళో ఇండియా పోటీల తర్వాత కూడా అవి గొప్ప క్రీడా వనరులుగా ఉపయోగపడేలా చూడాలన్నారు. ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాల లోపం లేకుండా పటిష్ట చర్యలు తీసుకునే విధంగా గ్రూప్-1 స్థాయి అధికారులకు ఏర్పాట్ల నుంచి క్రీడలు ముగీసే వరకు పర్యవేక్షణా బాధ్యతలు అప్పగించాలన్నారు. వివిధ జిల్లాల్లో జరగనున్న పోటీలకు సంబంధించి ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఆయా చోట్ల స్థానికంగా పనిచేస్తున్న ట్రైనీ అధికారులు, గ్రూప్-1 అధికారులను నియమించాలని సీఎం అన్నారు.

క్రీడాకారులకు ఆహారం, వసతి సౌక‌ర్యం..

క్రీడాకారులకు ఆహారం, వసతి సౌకర్యాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతివారం ఏర్పాట్ల పురోగతిపై సమాచారమివ్వాలన్నారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో క్రీడా పోటీల ప్రారంభ, ముగింపు వేడుకల్లో అనవసరమైన ఆడంబరాలకు తావు లేకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు.

సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (స్పోర్ట్స్) వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోని బాలాదేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్:

CM Revanth ReddyKhelo India Youth GamesOlympicsSportsTelangana
Advertisement
Advertisement